బీజేపీ నాయకత్వ మీటింగ్, ఢిల్లీ మరియు అమరావతి, మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్ధుల . . . - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,526; 104 తత్వాలు (Tatvaalu) and views 225,918.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

* బీజేపీ నాయకత్వ మీటింగ్ ఢిల్లీ మరియు అమరావతి మధ్య జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రములో మున్సిపల్ ఎన్నికలలో, అభ్యర్ధుల ఎన్నిక గెలుపు గురించి.

అటు వైపు జాతీయ అధ్యక్షుడు నడ్డా, మోదీ, అమిత్ షా గార్లు. ఇటు వైపు వీరన్న, కన్నా, పురందేశ్వరి, జీవియెల్, తదితరులు గార్లు ఉన్నారు.

* మోదీ, నడ్డా గారిని ఉద్దేశించి, ఇది పార్టీ మీటింగ్ కాబట్టి, మేము ఊరికే వింటాము, మీరు మనము అనుకున్న ప్రశ్నలు అన్ని, వివరముగా అడగండి మొహమాటము లేకుండా అన్నారు.

* నడ్డా గారు, ఈ విధముగా మొదలు పెట్టారు, హల్లో రాష్ట్ర టీం ఎలా ఉంది, మన పరిస్థితి జనసేనతో కలసి, గెలుపు బాటేనా? మీ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చాలా చోట్ల వార్డ్ మెంబరు కూడా దొరకడము లేదు అని వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రములో అన్ని మున్సిపాలిటీస్ మనవేనా? లేక కనీసము సగము అయినా వస్తాయా అని అడిగారు. తిరుపతి మనకే కావాలి అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇతర మున్సిపాలిటీస్ కి, అభ్యర్ధులు దొరికారా?

* ఏమ్మా పురందేశ్వరీ, ఇంట్లో వాళ్ళను పార్టీలో చేర్పించలేకపోయినా కూడా, వైసీపీ తో నిలబెట్టినా కూడా, గౌరవించి ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చాము.

కనీసము ప్రకాశం జిల్లాలో తిరిగి, చీరాల పర్చూరు ఒంగోల్ వరకన్నా, అభర్ధుల కొరత లేకుండా, ఆర్ధిక వనరులు పార్టీ నుంచి ఇప్పించి, జిల్లాలో గెలిపించి, బీజేపీ కి విశ్వాస పాత్రురాలిగా ఉన్నావా?

నువ్వు తిరగలేక పోతే వయస్సు భారముతో, ఇంట్లో వారినైనా మన పార్టీ కోసము తిప్పావా?

కనీసం, ఈ 3 మున్సిపల్ మరియు పంచాయితీల లో నైనా, బీజేపీ నిలబడుతుందా? తెలంగాణా నుంచి డీకే అరుణ కు కూడా కార్యదర్శి పోస్ట్ ఇచ్చాము, ఆమె సోషల్ మీడియా ఒకసారి చూడమ్మా, పార్టీ కోసం ఎలా కష్టపడాలో తెలుస్తుంది.

* జీవీయెల్ గారు, మీరు ప్రకాశం నుంచే అని అంటున్నారు. పోనీ మీరైనా, జనముతో కలసి, జిల్లాలో పర్యటించి, ధైర్యము చెప్పి, ఓడినా పర్లేదు, కనీసం మీరు నిలుచోండి వార్డ్ మెంబరులు గా, అని సహాయము చేసి, స్థానిక బీజేపీ సోషల్ మీడియాలో, వారి ఫోటోలు వివరాలు పనులు, ఎలా పెట్టుకోవాలో నేర్పి, సలహాలు ఇచ్చి, మీ జిల్లాలో అన్నా పార్టీ కోసం మంచి చేశారా?

* సలహాలు సహాయము చేయనప్పుడు మీకు ఎందుకు రాజ్యసభ సీటు, పార్టీలో పదవులు? కనీసం ఒక్కో నాయకుడు ఒక మున్సిపాలాలిటీ కూడా బాధ్యత తీసుకోరా?

పోనీ ప్రకాశం కాకపోతే, ఇంకో జిల్లా అయినా మీరు బాధ్యత తీసుకుని, గెలిపించే సత్తా ఉందా? లేనప్పుడు ఎందుకు, హాయిగా రాజీనామాలు చేసి, ఇంటికి వెళ్ళక? యువకులను పెట్టుకుని నడిపిస్తాము కదా?

* అలుపు లేకుండా మోదీ, అమిత్షా ఎలా తిరుగుతున్నారు ప్రజా పర్యటనలతో? మీరు తిరగరా బాధ్యతగా ఒక జిల్లా తీసుకుని?

మోదీ ఉన్నప్పుడే, మీరు ఒక్క మున్సిపాలిటీ ప్రకాశం జిల్లాలో గెలవలేక పోతే, ఆ తర్వాత గెలుపుకు మీకు ఇంకో 50 ఏళ్ళు కావాలని తెలుసా?

* ఏమయ్య కన్నా, రాష్ట్ర అధ్యక్షుడి గా చేసావు, ఏమీ మార్పు లేదు, ఎవరు ఏ పార్టీ కోసం పని చేస్తున్నారో తెలీదు. సగము మంది తెదేపా వైపు మాట్లాడుతారు, సగము మంది వైకాపా వైపు మాట్లాడుతారు. శరీరం ఇక్కడా, మనసు ఎక్కడో.

ఇంత మంది కోవర్టులతో, ఎలా పార్టీని నడిపించారు? కనీసము, ఇప్పుడు ఉన్న వీరన్న కన్నా, పూర్తి సప్పోర్ట్ ఇచ్చి పార్టీని నడపలేరా?

* ఏమయా వీరన్నా, బాగానే చంద్రన్న ను జగనన్న ను దులుపుతున్నావు. కానీ ఫలితాలు రావడము లేదు, ఎక్కడో చీరాలలో, 3 వార్డ్ మెంబర్లు మాత్రమే దొరికారు అంటా, 33 వార్డులకు.

ఎవరు ఈ బాధ్యత తీసుకుని, రాజీనామా చేస్తారో, మీరే తేల్చుకోండి.

ఆ విష్ణు ని, ఊరక తగవులు పెట్టుకోకుండా, మున్సిపాలిటీస్ గెలిపించే, సారీ, ముందు అభ్యర్ధులను నిలబెట్టే పని చేయండి, గెలవడం తర్వాత.

* రాష్ట్ర బీజేపీ నుంచి ఏదో సమాధానం రాబోయింది సర్ది చెప్ప బోయారు, నడ్డా గారు అడ్డముగా చెయ్యి చూపి, అన్ని మాకు ఎప్పడుకప్పుడు తెలుస్తుంది. ఇంకో నెలబోతే, మున్సిపల్ ఫలితాలే చెబుతాయి, మీ పని తనాన్ని.

తెలంగాణా నాయకులను చూసి నేర్చుకోరు మీరు, బండి సంజయ్, ధర్మపురి, రాజా సింగ్, డీకే అరుణ లను తెచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇలాగే ఉంటే, మీరు మారరు.

మీ 10 మంది నాయకులు, రాష్ట్రములో 20 మున్సిపాలిటీస్ గెలిచి నా దగ్గర మాట్లాడండి గర్వముగా. మిమ్మల్ని గౌరవించిన, పార్టీకి, క్రుతజ్ఞతలతో ఇప్పుడు అయినా పని చేయండి, అదే మేము మిమ్మల్ని కోరేది, ఉంటాము అన్నారు.

బాగుంది కదూ, ఈ ఊహా. ఇలా జరిగితే, బీజేపీ ఎప్పుడో బాగుపడేది ఆంధ్రాలో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,526; 104 తత్వాలు (Tatvaalu) and views 225,918
Dt : 03-Mar-2021, Upd Dt : 03-Mar-2021, Category : Politics
Views : 778 ( + More Social Media views ), Id : 999 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bjp , leadership , meeting , delhi , amravati , candidates , municipal elections , nadda , amitsha , veeranna , purandeswari , gvl
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content