పాటతో పరమార్ధం - బొమ్మను చేసి ప్రాణము పోసి (పేరడీ) - దేవత - ఎన్టీఆర్, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,229; 104 తత్వాలు (Tatvaalu) and views 226,475.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Bommanu Chesi Pranamu Posi (Parody) - Devata - NTR, Savitri

అందమైన ప్రక్రుతిని, సుందరమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి, కమ్మటి పొలాలు ఫలాలు ఇచ్చి, మనము తింటూ పదిమందికి కడుపు నింపమని, మనల్ని ఈ భూమిపై దిగపెడితే, మనము ఏమి చేస్తున్నాము?

అరిషడ్వర్గ అష్టవ్యసనం కు బానిసలమై, ఇదంతా మాది అని, స్వార్ధం పెరిగిపోయి, ఆదేవుడు ఇచ్చిన భూమికే రూపు రేఖలు మార్చేసి, తీరా వరదలు వడగండ్లు భూకంపాలు తుఫానులు వచ్చేసరికి, అయ్యో అమ్మో దేవుడా కాపాడు అంటున్నాము.

అసలు పాటలో మొత్తము తప్పు, దేవుని మీదకు నెట్టారు. అది చాలా పెద్ద తప్పు. అందుకే మనము సగము పాట మాట దేవుని గురించి, మిగతా సగం పాట మాట మానవుని పైత్యం గురించి పేరడీ గా మార్చాము.

నేటి మానవుని జీవితం ఎలా ఉంది అంటే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లుగా ఉంది - బ్రతుకంత బాధగా, కలలోని గాధగా, కన్నీటి ధారగా, కరిగిపోయేది మన బ్రమల జీవితం. అంతా నాదే, కానీ ఏదీ నాది కాదు అన్నట్లు ఉంది ప్రతి వ్యక్తి జీవితం. అందుకే, తలచేది జరుగదూ, జరిగేది తెలియదూ.

బొమ్మను చేసి, ప్రాణము పోసి, ఆడేరు మీకిది వేడుకా అని ఆయనను తప్పు చూపిస్తూ, మనము ఏమి చేసాము? గారడి చేసి, గుండెలు కోసి, నవ్వేము ఈవింత, చాలదా - అవ్వ అంతా నాశనము చేసింది మనము. కష్టాలు కన్నీళ్ళకు కారణం మనము.

అందాలు సృష్టించినావూ, దయతో నీవూ, అని ఓ వైపు దేవుని పొగుడుతూ, ఇంకోవైపు మరలా మా చేతి తో, మేమె ఆ అందాలను తుడిచేములే, కాదా? ఎన్ని అడవులు చెడగొట్టాము, ఎన్ని జంతువుల ప్రాణాలు తీసాము?

దీపాలు మీరే వెలిగించినారు, అని ఓ వైపు దేవుని పొగుడుతూ, ఐనా ఘాఢాంధకారాన నడిచేములే అంటూ, మన అహంకారాన్ని చూపుతున్నాము. కొండంత ఆశా, అడియాశ చేసి, పాతాళ లోకాల దూకాములే, ఇది చివరకు మన బతుకు.

ఒకనాటి దేవుడు ఇచ్చిన ఉద్యానవనమూ, నేడు కనమూ అంటే చూడలేము, అదియే మరుభూమిగా, మేము మార్చాములే, అంతే కదా?

అనురాగమధువు అందించినా మీరూ (దేవుడు), ఐనా మనము అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో హాలాహలజ్వాల చేసేములే, 100 శాతం నిజం కదూ? ఆనంద జీవిత నౌకా, పయనించు వేళా, శోకాల సంద్రాల ముంచాములే. ఒక్క సారి ఆసుపత్రి లో, కోర్ట్ లో, బార్లో, పోలీసు స్టేషన్ లో, అలాగే రోడ్ మీద పడ్డ బతుకులు, ఇంట్లో చీకట్లో మగ్గుతున్న పెళ్ళి బందాలు బాంధవ్యాలను చూడండి?

బ్రతుకంత బాధగా.., కలలోని గాధగా.., కన్నీటి ధారగా..., కరిగిపో.యే...
తలచేది జరుగదూ.., జరిగేది తెలియదూ..

బొమ్మను చేసి. ప్రాణము పోసి, ఆడేరు మీకిది వేడుకా.. 2
గారడి చేసి, గుండెలు కోసి, నవ్వేము ఈవింత, చా..లదా. ||బొమ్మను||

అందా.లు సృష్టించినా.వూ., దయతో నీవూ., మరలా మాచే.తితో, మేమె, తుడిచేములే..
దీపాలు మీరే.., వెలిగించినారు., ఐనా ఘాఢాంధకారాన నడిచేములే..
కొండంత ఆశా., అడియాశ చేసి. 2 పాతాళ లోకాల దూకాములే ...||బొమ్మను||

ఒక.నాటి ఉద్యానవనమూ.., నేడు కనమూ.., అదియే మరుభూమిగా, మేము మార్చాములే.. - 2 లైన్లు మొత్తము
అనురా.గమధువు., అందించినా మీరూ.., ఐనా హాలాహలజ్వాల చేసేములే .
ఆనందనౌకా. పయనించువేళా. 2 శోకాల సంద్రాల ముంచాములే.. ||బొమ్మను||

Bommanu Chesi Song Lyrics - Devatha; Movie : Devata; Music : S. P. Kodandapani; Singers: Ghantasala; Lyricist: Veturi 1965  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,229; 104 తత్వాలు (Tatvaalu) and views 226,475
Dt : 26-Jul-2023, Upd Dt : 26-Jul-2023, Category : Songs
Views : 267 ( + More Social Media views ), Id : 1854 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bommanu , Chesi , Pranamu , Posi , Devata , NTR , Savitri , ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content