సొంత అమ్మా నాన్న భాష పై క్రుతజ్ఞత ప్రేమ చూపించనివారు దేవుని/ ఉద్యోగం/వ్యాపారం/ భాగస్వామి/పిల్లలు పై? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,864; 104 తత్వాలు (Tatvaalu) and views 230,160.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ 30 ఏళ్ళు అన్ని ఇచ్చి పెంచిన, సొంత అమ్మా నాన్న మరియు భాష పై క్రుతజ్ఞత విశ్వసనీయత బాధ్యత విలువలు ప్రేమ నిజాయితీ చూపించనివారు, వారిలో లేని వారికి తెలియని వారు ఆచరించని ఇలాంటి ఉన్నత విలువలును, దేవునిపై/ దేశం/ ఉద్యోగం/ వ్యాపారం/ సంస్థ/ భాగస్వామి/ పిల్లలు/ ఇతర వ్యక్తుల పై చూపించగలరా? అవసర అవకాశవాదులు కాదా? స్థితప్రజ్ఞులు ఎలా అవుతారు భగవద్గీత ప్రకారం? మోక్షానికి ఎలా అర్హులు అవుతారు?*

*Anyone, who has given everything and raised for all 30 years, can show #gratitude, #loyalty, #responsibility, #love, #ethics, #values ​​on their own #language (#mothertongue) and #parents. If they don't have and know and practice them, can they show the same on #God/ #Country/ #job/ #business/ #company/ #partner/ #children/ other #people? #Needy #opportunists? According to the #BhagavadGita, how do one become #sthitaprajna? How do they qualify for #salvation?*

గురువు గారు, నమస్కారములు, శుభోదయం శుభదినం, శుభసంకల్పం. మీ ప్రశ్న తోటే కడుపు నిండిపోయింది, సగం జవాబు మీరే చెప్పేసారు. మీకున్న లోతు అభిలాష కూడా తెలుస్తుంది. దేవుడు, మీకు అరిషడ్వర్గాలను జయించే శక్తి కై క్రుప చూపించాలి.

పరిప్రశ్న అంటే ఇదే, సజీవ గురు సేవ, కొంత జ్ఞానం, అరిషడ్వర్గాల సాధన మనకు ఉండి, ఇంకా లోతు తెలుసుకోవాలని ఆసక్తితో, మంచి విద్యార్ధి లా గౌరవముగా భక్తి తో చిత్తశుద్ది జిజ్ఞాస తో, దేవుడిని అడిగినట్లు అడగడమే. అవమానించడానికి లేదా ఎదురు వారి శక్తి తెలుసుకోవడానికి అగౌరవముగా ఉపయోగం లేని ఎదురు ప్రశ్న కాకూడదు, ఉత్తమ గురువుకు లేదా శిష్యునకు.

కలియుగ ధర్మం ప్రకారం, అరిషడ్వర్గాలలో మునిగి ఉన్న 75 మందికి, ఇలాంటి మాటలు ప్రశ్నలు జవాబులు నచ్చవు, మెచ్చరు. తలనొప్పి చిరాకు ఇవి వారికి. ఆనాడు 3 వంతులు (75) పాపం అన్నారు, 1 వంతు (25) తో ధర్మం కుంటుతుంది అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగి, 80-85 దాకా ఉంటుంది.

మిగతా 20 మందికి మాత్రమే, ఇది సత్సంగముగా, మధురముగా ఉంటుంది. వారు సంతోషాన్ని క్రుతజ్ఞతలను వెంటనే తెలియచేస్తారు, ఏ ఒక్క మంచి మాట వారి చెవిని పడ్డా, ఆచరణలో మానసిక ఆనందం పొందుతారు. భూతద్దము లో లోపాలు వెతకరు.

మంచి చెడు, సుఖం కష్టం, బాగుపడటం నాశనం అవ్వడం, అంతా మన చేతిలో నే ఉంది సుమా. దేవుడు మనవైపు చూస్తున్నాడు, కానీ మనము భ్రమలలో ప్రాపంచిక మాయవైపు చూస్తున్నాము, అందులోనే పొరలుతున్నాము అంతే తేడా.

మీకు గుర్తు ఉందా, 3 ఏళ్ళు గా సజీవ గురువు సేవ మరియు అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నం లో సాక్ష్యం ఉన్న వ్యక్తులకు, ఏప్రిల్ నెలలో 10 మందికి ఒక్కొక్కరికి, 10 వేలు ఇద్దాము అని, మనము ఎదురు చూస్తున్నాము. కానీ నమ్మకం అయిన ఎవరు పట్టుకుని రావడం లేదు. అంటే సహాయమే, వారికోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ మంచి మనసులు అటు వైపు ద్రుష్టి పెట్టడం లేదు. మాట సాయానికి కూడా తీరిక లేదు.

మంచి గుణము/ విలువలు/ సంస్కారము - అన్ని అందరికీ స్థిరముగా ఉండాలి, అలాగే ఉంటాయి దేవతలకు, అందుకే వారిని పూజిస్తాము, గౌరవిస్తాము. అలాగే రాక్షసులకు, చెడు గుణము/ విలువలు లేకపోవడం/ కుసంస్కారము స్థిరముగా ఉంటాయి. కామరూప విద్యలు ఉన్నా, కాసేపటికే మరలా యధారూపాన్ని పొందుతారు, వంకర బుద్ది మారదు.

కానీ రాక్షసుల కన్నా నీచముగా, మనుష్యులలో కపట బుద్ది, 2 నాల్కలు, 2 మాటలు గల, శకుని లాంటి వారితోనే సమస్యలు. బుద్ది మారుతూ ఉంటుంది, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా. వీరిని అవసర అవకాశవాదులు అని ముద్దుగా పిలుచుకోవచ్చు. దానికి వారూ బాధపడరు, ఎందుకంటే మన మాటలను పట్టించుకునే జవాబు సమయలో, వారు ఇంకో 2 తప్పులు చేయవచ్చు, బ్రమలు లో చిక్కుకోవచ్చు కదా? అందుకే, ఎప్పుడూ బిజీ బిజీ అంటారు, తమ లేదా ఇతరుల గొయ్యి తవ్వుతూ.

సూర్యుడు రోజు సమయపాలనతో, తూర్పు వైపు ఉదయించి, సాయంత్రం పడమర అస్తమించును. మబ్బులు వర్షం గ్రహణం వచ్చి మనకు కనపడకపోయినా, తాను మాత్రం నిరంతరం సంచరిస్తూనే ఉంటారు (వాస్తవానికి భూమి తిరుగుతుంది), క్రమం తప్పరు. మనిషిని బట్టి సమయాన్ని బట్టి మానరు, ఆగరు. అంటే స్థిర బుద్ది నీతి నియమము నిజాయితీ సంస్కారము.

పంచభూతాలు అందరికీ సమానమే. నిప్పు/ వేడి ఆ ప్రాంతములో అందరికీ ఒకటే. అలాగే వర్షం పడితే, అక్కడ అంతా తడుస్తుంది. గాలి కొడితే, అందరికీ హాయిగా ఉంటుంది. భూమి అందరికీ నివాసమే, రంగు రూపు ని బట్టి ఇక్కడ వద్దు అని అది అనదు. ఆకాశము అందరికీ అందదు. అంటే స్థిర బుద్ది నీతి నియమము నిజాయితీ సంస్కారము.

మరి శివ మరియు విష్ణు తత్వం అదే, అన్నిటిని అన్ని జీవులను సమముగా చూడు అని. ఇంక అమ్మ అల్లం (దూరం) ఆలి బెల్లం (దగ్గర) లేదా అమ్మ బెల్లం(దగ్గర) ఆలి అల్లం (దూరం) అన్న తేడా ఎందుకు వస్తుంది?

మరి మనుషులలో ఎందుకు బుద్దులు, అమ్మ అయ్య దగ్గర ఒక విధముగా, ఆలి అత్త మామ దగ్గర ఒక విధముగా ఉంటుంది? తప్పు ఉంటే, రెండు వైపులా ఇద్దరునూ మందలించాలి. అంతా బాగుంటే, ఇద్దరు నూ దగ్గర పెట్టుకోవాలి. 100 కష్టాలు ఉంటే, ఇద్దరు నూ దూరముగా పెట్టాలి కదా? అంటే తన శారీరక సుఖం లేదా అవసరం మాత్రమే ముఖ్యమా?

ముక్కోటికి, శివరాత్రికి అసలు ఏ దేవాలయము ఖాళీ ఉండదు. మరి 30 ఏళ్ళు గా వెళ్ళి, ఏమి నేర్చుకున్నాము? ఏమి మారాం? ఎవరిని మార్చాము? ఏమీ లేదు. ఎందుకంటే, ఎందుకు దేవాలయము కు వెళుతున్నామో మనకు తెలీదు. అందుకే పెద్దలు అంటారు, మొక్కుబడి గా అశ్రద్ధతో గుడికి బడికి పోకూడదు. అలాగే పెళ్ళి పిల్లలు కూడా, మొక్కుబడి గా చేసుకోకూడదు.

ముదుసలి తల్లి దండ్రిని దగ్గర ఉంచి చూసుకోలేని, అన్ని ఉన్న మూర్ఖులకు చేతగాని వారికి, భాగస్వామి మరియు పిల్లలు మాత్రం ఎందుకు? రేపు రోగం కష్టాలు వస్తే, వారిని మాత్రం నిర్ధాక్షిణ్యముగా వదిలి వెళ్ళిపోరా? ఎక్కువ జీతం వస్తే, ఆదరించి గౌరవించి ఇచ్చిన వారినే వదలి, ఉద్యోగమే మారమా? ఇప్పుడు అవసర అవకాశ పెళ్ళిళ్ళు / విడాకులు/ బంధాలు అలా లేవా?

ఆ 80 మంది అరిషడ్వర్గాలకు బానిసలై తలవంచి విలువలు తప్పినా, ఆ కాసేపు ధనం సుఖం ఉంటే చాలు అనుకుంటారు. కానీ అసలు కష్టాలు మొదలు అయ్యాక మాత్రం, వాటిని తట్టుకోలేక పారిపోతారు, లేదా పైకి పోతారు. ఎటు పోయినా, ఇన్నాళ్ళు చేసిన తప్పులకు శిక్ష మాత్రం తప్పదు. పంచ భూతాల పని అదే.

ఎవరైతే, ప్రేమ అభిమానం ఆప్యాయత ఆదరణ నిస్వార్ధ సేవ, సమముగా 2 వైపులా అలాగే ఇతరులకు పంచకపోతే, అతనికి/ ఆమెకు స్థిర చిత్తము లేదు, స్థితప్రజ్ఞులు కారు. అంటే సుఖానికి పొంగిపోతారు, కష్టానికి కుంగిపోతారు, అవసరానికి అవకాశానికి లొంగిపోతారు. అంటే త్రికరణ శుద్ది లేదు.

అంటే, వారి పూజలకు యాత్రలకు యాగాలకు భజనలకు అర్ధం లేదు, విలువైన సమయం ఖర్చు వ్రుధా. అంటే అవి దేవుని చేరలేవు, వీరికి చిత్తశుద్ది లేకపోవడం వలన. అంటే మోక్షం అనే ప్రశ్న ఇంకొన్ని జన్మలు ఎత్తి, మరలా ఇవే అష్ట కష్టాలు పడి, ఎన్నో సాధనలు, చేసిన తర్వాత మాట. వచ్చే జన్మలో, ఇప్పుడు ఉన్న సౌకర్యాలు కూడా ఉండవు సుమా, అంటే ఇంకా కష్టం. ఎందుకంటే, ఇచ్చినవి దుర్వినియోగం చేసి, అరిషడ్వర్గాలకు బానిసలము అయ్యాము కాబట్టి.

10 వ తరగతి ఒకేసారి పాసైతే విలువ ఉంటుంది. 2 వ సారి పాస్ అయితే, కాస్త విలువ తగ్గుతుంది, 10 వ సారి దాకా పాస్ ప్రయత్నం జరుగుతూనే ఉంటే, వరి విలువ అందరిలో ఇంకా ఇంకా దిగజారిపోతుంది. పలు నీచ కపట మానవ జన్మలు కూడా అంతే.

కాబట్టి, ఇప్పుడు ఉన్న కష్టాలు సుఖాలు సౌకర్యాలతోనే మహాద్భాగ్యము గా భావించి, అరిషడ్వర్గాలను జయించి, మోక్షం వైపు అడుగులు వేయాలి. మరు జన్మలు లో ఇంకా చాల కష్టాలు కన్నీళ్ళు, తట్టుకోలేము గురువు గారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,864; 104 తత్వాలు (Tatvaalu) and views 230,160
Dt : 27-Jun-2022, Upd Dt : 27-Jun-2022, Category : General
Views : 606 ( + More Social Media views ), Id : 1443 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : person , gratitude , old , parents , language , god , country , job , partner , children , business , company , folks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content