పాటతో పరమార్ధం - చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ(పేరడీ)- మనీ - చక్రవర్తి, జయసుధ, రావల్, బ్రహ్మానందం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,062,493; 104 తత్వాలు (Tatvaalu) and views 236,236.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Chakravarthiki Veedhi(Parody) - Money - Chakravarthy, Chinna, Jayasudha, Paresh Rawal, Kota, Bramhananda, Tanikella

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ, అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు, అయినా అన్నీ అంది మనీ మనీ. నిజముగా మనీ అందా అండీ, అలా? ఎప్పుడు, ఎవరితో? దానికి నోరు, మనసు ఉందా?

అలా మనీ ని స్వార్ధం కోసం పుట్టించింది, దానిని త్యాగం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, సంస్కారం కన్నా ఎక్కువ అని భ్రమింప చేసింది, అబద్దాలు మాయలు మోసాలు ప్రచారం చేసింది, దానిని పుట్టించిన కపట నటన బద్దక నిర్లక్ష్య రాతి గుండే మనిషే, అంటే మనమే.

అందుకే ఇలా పాడాలి, చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ, బానిసత్వం చేసాం, మనీ మనీ, అంతేనా? మన అమ్మ చుట్టమూ కాదూ, అయ్య చుట్టమూ కాదు, అయినా అలా చేసాం, మనీ మనీ? అలా చేసి, చివరకు మన బతుకు బస్టాండ్ చేసుకున్నాము.

ధనం హోదా పదవి అవసరం అవకాశం వీసా ఆస్తులు లేనిదే, పలుకు లేదు, పెళ్ళి లేదు, సంసారం లేదు, సుఖం లేదు. పోనీ ఇవన్నీ ఉంటే, అప్పుడు మనశ్శాంతి లేదు.

సంస్కార పిల్ల పెంపకం కన్నా, ముదుసలి తల్లి తండ్రి అత్త మామల కన్నా, ధనమే ముఖ్యం అనుకుని, ఎవరి జీవితాలను వారు కాల రాసుకుంటున్నారు, నిత్య సొంత గొయ్యిలతో.

ఎప్పుడైతే, వీరు ధనం ముఖ్యం అన్నారో, వారి భాగస్వామి, అదే భావనతో, విడాకులతో సగం తన్నుకు పోతుంది. వ్యాపార భాగస్వాములు, అదే భావనతో, ఇంకో సగం తన్నుకు పోతారు. మిగతాది, అదే భావనతో, పిల్లలు/ కోడళ్ళు/ అల్లుళ్ళు మిగిలినది కొట్టుకు పోతారు.

ఆ తర్వాత మనం చేరేది రోగాలతో ఆసుపత్రి, అనాధాశ్రమం లేదా ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవడం. ఆస్తి రాయి మాకు ముందు, ముదుసలి తనము లో చూస్తాము లేకపోతే చూడము అంటారు. ఆస్తి రాస్తే, వెంటనే వదిలించుకుందామని, మెట్ల మీద నుంచో తూములో పడ్డారనో చీర అంటుకున్నదనో, చెపుతారు. లేదా ఇంటి బయట పంచలో, పాకలో పడవేస్తారు, ముద్దు ముచ్చట గౌరవం మర్యాద క్రుతజ్ఞత లేకుండా. మరి దేని కోసం ఇంత పతన పరుగులు?

అందుకే చెప్పేది చిత్తశుద్ధి, వాక్సుద్ధి, సేవ, త్యాగం, అలవాటు ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, చివరకు రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య శ్రీదేవమ్మ‌‌‌ కాఫీడేఅయ్య సరసన మనందరం చేరతాము. వీరికి ఏమి తక్కువ, అధికారం ఆస్తులు పదవులు పలుకుబడి అభిమానులు?

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ, బానిసత్వం చేసాం, మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదూ, అయ్య చుట్టమూ కాదు, అయినా అలా చేసాం, మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు, పెట్టుకునేట్లు చేసాం, మనీ మనీ
పుట్టడానికీ పాడే కట్టడానికి, మధ్య అంతా తనే చేసాం, మనీ మనీ
కా.లం, ఖరీదు చేయలేం, మోహం వద్దు, మనీ మనీ..
ఖర్మ, తమాషా చూడలెం, బ్రమలు వద్దు, మనీ మనీ
డబ్బుని, లబ్ డబ్బని, గుండెల్లో మూర్ఖమేలరా
దీక్షగా, మనశ్శాంతిని, త్యాగంతో పట్టుకోరా ||చక్రవర్తికీ ||

బాకీలు కట్టవా ఓ తండ్రీ, నో ఎంట్రీ, వీధి వాకిట్లో
దొంగల్లే దూరొద్దు సైలెంట్లీ, నీ ఇంట్లో, చిమ్మ చీకట్లో
అందుకే, పదా బ్రదర్, మది సాధనకీ
శాంతికే, సదా బ్రదర్, ప్రతీ రోజుకి
రోటీ కపడా రూము అన్నీ, కనీస అవసరాలే
సాధనతో శరణమ్మని, కోరికలను అడ్డుకోరా..
దీక్షగా, మనశ్శాంతిని, త్యాగంతో పట్టుకోరా ||చక్రవర్తికీ ||

పూజిన్చుకోవచ్చు దర్జాగా, ఇంట్లోనే పేద భక్తునిలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా, మదిలోనే దైవ స్టోరీలా
జపంలో, కనే దోవే, విలువైనది..
ధ్యానంలో, కనే శాంతి, మోక్షాని కీ..
చూపించరుగా జాలి, మోహ దాసులకీ..
జీవితం, ప్రతి నిమిషమూ, సాధనతో నడుపుకోరా
దీక్షగా, మనశ్శాంతిని, త్యాగంతో పట్టుకోరా||చక్రవర్తికీ ||

శాంతి రా, మన శ్శాంతి, రా
శాంతి, శాంతే మన శ్శాంతి, రా

Seetharama Shastry 1993 చక్రవర్తి, చిన్నా, జయసుధ, పరేష్ రావల్, కోట, బ్రహ్మానందం, తనికెళ్ళ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,062,493; 104 తత్వాలు (Tatvaalu) and views 236,236
Dt : 22-Sep-2023, Upd Dt : 22-Sep-2023, Category : Songs
Views : 332 ( + More Social Media views ), Id : 1923 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chakravarthiki , Veedhi , Parody , Money , Chakravarthy , Chinna , Jayasudha , Paresh , Rawal , Kota , Bramhananda , Tanikella
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content