మేలుకొలుపు - చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు - NTR, KR Vijaya, Jayaprada - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,881,230; 104 తత్వాలు (Tatvaalu) and views 226,239.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఆనాడే పిల్లలు యువకులు తప్పుదోవ పట్టడం గురించి, ఈ మంచి పాటను రాసి పాడారు. నేటి పాటలు, ఇలా మంచి కోసము, ఉండవు. ఒకవేళ ఉన్నా పిల్లలు వినేటట్లు లేరు, పెద్దలకు అసలు గిట్టవు. ఎందుకంటే, బిగ్ బాస్ సీరియల్స్ సినిమాల పిచ్చిలో, అందరూ ప్రాపంచిక సుఖాలకు మరిగి, సొంత తల్లి దండ్రులనే మరచారు.

పిల్లలకు సంస్కారం నేర్పే బాధ్యత మాది కాదు, మా ఇద్దరి బద్దకం నిర్లక్ష్యం లేదా ఉద్యోగాలతో లేదా సంతోషాలతో అది కష్టం అంటున్నారు. ధనం ముందు, తర్వాత నే పిల్లలు అయినా మా ప్రాణాలు అయినా అంటున్నారు. పంతుళ్ళు, చదువుకే సమయం లేదు, సంస్కారం బాధ్యత ఇంటి వద్ద పెద్దలది అని వారు ఏమీ చేయలేక గమ్ముగా ఉన్నారు.

ఇంటిని కాల్చే మంటల్లాగా, ఎందుకు బ్రతకాలి? చక్కని తెలివి విషమించిందా, రక్కసులౌతారు. రంగుల వల ఈ లోకం, అది చూపే ఆశలు అనేకం. ఆ ప్రలోభాలకు లొంగక, ఏ విలాసాలకు పొంగక, ముందుకు పోవాలి అని ఎంత చక్కగా చెప్పారు, వినండి, మీరూ పాడండి.

పల్లవి:
దారి తప్పిన బాలల్లారా…, దగా.. పడిన యువకుల్లా.రా.
చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు
ఇది దేవుని పిలుపు, ఇదే.. మేలుకొలుపు, ఇదే.. మేలుకొలుపు ||చెడు అనవద్దు||

చరణం: 2
ఇంటిని కాల్చే మంటల్లాగా, ఎందుకు బ్రతకాలి?
ఆ ఇంటికి, చల్లని జ్యోతుల్లాగా, ఎపుడూ.. వెలగాలి - 2 సార్లు మొత్తము
మానవతయే మన దై.వం, మంచితనమే మన ధర్మం 2 ||చెడు అనవద్దు||

చరణం: 2
చక్కని తెలివి విషమించిందా, రక్కసులౌతారు 2
అది మంచిదారిలో మలచుకొంటిరా, మహాత్ములౌతారు, మహాత్ములౌతారు..
పరోపకారం పరమగుణం, పరమగుణం
సహనం మన ఆభరణం, ఆభరణం.. ||చెడు అనవద్దు||

చరణం: 1

రంగుల వల ఈ లోకం, అది చూపే ఆశలు అనేకం 2
ఆ ప్రలోభాలకు లొంగక, ఏ విలాసాలకు పొంగక
నీతి దూతలై. సాగి పోవాలి, మన జాతి గౌరవం జగతిని చాటాలి ||చెడు అనవద్దు||

చరణం: 2
మాత్రుదేవతా నీడలో, మమతల పాఠశాలలో 2
ఓనమాలు నేర్చుకుని, బతుకుబాట మార్చుకుని 2
కోటి దీవెనలు అందుకున్నాను, సరికొత్త వెలుగులో అడుగిడుతున్నాను ||చెడు అనవద్దు||

చిత్రం: మేలుకొలుపు (1978), సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: సినారె, గానం: జానకి
నటీనటులు: యన్.టి.రామారావు, మాటలు: గొల్లపూడి మారుతీరావు, దర్శకత్వం: బి.వి.ప్రసాద్, నిర్మాత: ఎ. పుండరికాక్షయ్య, విడుదల తేది: 13.01.1978

Chedu Anavaddu Chedu Vinavaddu chedu kanavaddu Song Melukolupu - NTR, KR Vijaya, Jayaprada

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,230; 104 తత్వాలు (Tatvaalu) and views 226,239
Dt : 05-Oct-2022, Upd Dt : 05-Oct-2022, Category : Songs
Views : 452 ( + More Social Media views ), Id : 1562 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chedu , anavaddu , vinavaddu , kanavaddu , melukolupu , ntr , krvijaya , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content