చిత్తూర్ కలెక్టర్, వైద్య ఆరోగ్య అధికారులు, కమీషనర్, రుయా, కోవిడ్ వారియర్స్ గార్లకు - భూమన - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1690 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1725 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గౌరవనీయులైన చిత్తూర్ కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త, జిల్లా మరియు తిరుపతి వైద్య ఆరోగ్య అధికారులకి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గిరిషా, రుయా ఆసుపత్రి డాక్టర్లు, జిల్లా కోవిడ్ వారియర్స్ గార్లకు,

నమస్కరించి వ్రాయు విన్నపము, భూమన గారి ఆరోగ్యము క్షేమము జాగ్రత్తల గురించి. మీరు తీసుకునే చర్యలు, కలెక్టర్ గారి ఫేస్బుక్ లో రోజూ చూస్తున్నాము. ఆంధ్రా రాష్ట్ర కోవిడ్ అధికారి శ్రీకాంత్ గారి సూచనలు క్రమం తప్పకుండా, మీరు జిల్లా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు.

కలెక్టర్ గా అంటే జిల్లా ప్రభుత్వ నాయకుడిగా అంటే ప్రధమ పౌరుడిగా అంటే ప్రజల క్షేమము కోరే ఉత్తమ అధికారిగా, జిల్లా ఇతర అధికారులను బాధ్యతతో సరైన దోవలో నడిపించి, జగన్ గారి ప్రభుత్వ పధకాలను, ప్రజలకు అందించడములో సఫలము చెందారు.

ఇవి మా పొగడ్తలు, మాటలు కాదు. యావత్ తెలుగు ప్రపంచము విదేశాలలో ఉన్నా వారు కూడా, ఆశ్చర్యపోయిన సంఘటన. జిల్లా అధికారుల చర్యలు నమ్మి, గౌరవించి, ఆచరణలో చూపించడానికి, తిరుపతి ఎమ్మెల్యే, నిజమైన ప్రజా సేవకుడు, ఒకే ఒక్క ధైర్యవంతుడు, వయస్సులో పెద్దాయన, భూమన కరుణాకర్ రెడ్డి గారు, మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడము గొప్ప విషయము. మన జిల్లా అధికారుల మరియు డాక్టర్ల సామర్ధ్యమునకు, క్రుషికి, ఇదొక నిదర్శనము. మీ క్రుషికి, తలవంచి నమస్కారములు చేస్తున్నాము.

అయితే, ఇక్కడే, మనకు పెద్ద బాధ్యతతో సవాల్ ఉంది. ఇంకా ఎక్కువ క్రుషి చేసి, మన కీర్తి ఇంకా పెంచుకోవాలి, అని మా కోరిక. ఇప్పుడు భూమన గారిని, కంటికి రెప్పలా కాచుకోని, వైద్యం తరువాత, నవ్వుతూ బయటకు పంపాల్సిన బాధ్యత మనమీద ఉంది. దయచేసి, మనకున్న వైద్య పరికరాలు వసతులు పరిశీలించి, ఏవైనా లేకపోతే, జగన్ గారికి చెప్పి, తెప్పించుకుని, భూమన గారి ఆరోగ్యాన్ని, కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.

ఏదైనా, తేడా వస్తే, మన క్రుషి మొత్తము, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. తగిన వసతులు లేకపోతే, ఇంకో పెద్ద ఆసుపత్రికో లేక హైదరాబాద్ పంపగలరు. అధికారులుగా, మీరు పంపితే తప్పులేదు.

దయచేసి, తగిన జాగ్రత్తలు తీసుకుని, వారిని సంపూర్ణ ఆరోగ్యముతో, బయటకు తెస్తారని ఆశిస్తున్నాము. అలాగే, జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు, నమ్మకము కలిగించి, మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించి, మన చిత్తూరు జిల్లా మరియు మన తిరుపతి అధికారుల, వైధ్యుల, కోవిడ్ వారియర్ల పేరును, తెలుగు ప్రజల మనసులలో చిరకాలము నిలిచేటట్లుగా చేస్తారని, జిల్లా సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకము పెంచుతారని, ఆశిస్తున్నాము.

మా వంతు బాధ్యత గా, మీ గొప్ప ప్రయత్నాన్ని పది మందికి తెలియచేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరి పైనా, ఎల్ల వేళలా ఉండాలని కోరుతున్నాము. తప్పులు ఉంటే మన్నించగలరు.

ఇట్లు తెలుగు ప్రజల తరపున, విలేఖరి


తిరుపతి, ఆగస్టు 26: అన్ని కోవిడ్ సెంటర్లలో హౌస్ సర్జన్లు విధులు నిర్వహించాలని, కాల్ సెంటర్ సేకరించే స్పందన మేరకు డాక్టర్లు వచ్చి చూడలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నదని, విధులు కేటాయించిన వారు తప్పనిసరి పేషంట్ల ను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త అన్నారు.

బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు, హౌసర్జన్స్, ఐ.ఎం.ఏ.ప్రతినిధులతో విధులు నిర్వహణపై కలెక్టర్, జెసి(డి) వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ , తుడా విసి హరికృష్ణ సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ఏ జిల్లాలో లేనంతగా రిసోర్స్ పరంగా సౌకర్యాలు వున్నాయని, విధులు కేటాయించిన వైద్యసిబ్బంది ఈ విపత్తు సమయంలో భాధ్యతగా పనిచేయాలని అవసరం ఉందనేది గుర్తించాలని అన్నారు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి తరచూ పరిశీలించగలిగితే వారికి భరోసా ఉంటుందని అన్నారు. ప్రధానంగా కాల్ సెంటర్ ఫీడ్ బ్యాక్ లో ఎక్కువగా డాక్టర్లు దగ్గరకు వచ్చి చూడలేదనే అభిప్రాయం వుందని దానిపై దృష్టి పెట్టాలని అన్నారు. కేర్ సెంటర్లు పెరగనున్నాయని అందుకు సరిపడా వైద్యసేవలు కూడ విస్తరించాలని అన్నారు. విధుల్లో అలసత్వం లేకుండా చూడాలని అన్నారు.

ఈ సమీక్ష లో డి.ఎం.హెచ్.ఓ.పెంచలయ్య, ఎస్.వి.వైద్యకళాశాల ప్రిన్సిపల్ జయాభాస్కర్, డా.సంధ్య, డిప్యూటీ డి. ఎం.హెచ్.ఓ. అరుణ సులోచన దేవి, నోడల్ అధికారి చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ బాలాంజనేయులు, ఐ.ఎం.ఏ.డాక్టర్లు కృష్ణ ప్రశాంతి, యుగంధర్, హౌస్ సర్జన్లు పాల్గొన్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1725 General Articles, 86 Tatvaalu
Dt : 27-Aug-2020, Upd Dt : 27-Aug-2020, Category : Request
Views : 532 ( + More Social Media views ), Id : 661 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chittoor , collector , medical , health , officers , commissioner , ruya , covid , warriors , bhumana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content