కల, కోరిక తీరేనా జగనన్నా? చీరాల జిల్లా, హార్బర్, చేనేత పార్కు, స్మార్ట్ సిటీ, బీచ్ - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,864,123; 104 తత్వాలు (Tatvaalu) and views 224,753.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కల నిజమయ్యేనా, ఎన్నో ఏళ్ల కోరిక తీరేనా జగనన్నా? చీరాల జిల్లా, హార్బర్, చేనేత పార్కు, స్మార్ట్ సిటీ, స్మార్ట్ బీచ్, ఇతర పరిశ్రమ లు


ఏపీ నుంచి విడిపోయిన రెండేళ్లకే కేసీఆర్ సర్కారు, కొత్త జిల్లాల్ని అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో ఉన్నవి 17 లోక్ సభ స్థానాలే అయినా, ఆ సంఖ్యతో నిమిత్తం లేకుండా, ఏకంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్రా లో ఉన్న, భిన్న భౌగోళిక సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో, ఏపీలోనూ కేసీఆర్ ఫార్ములాను అనుసరించి, లోక్ సభ సెగ్మెంట్ల వారీగా కాకుండా, ప్రజలకు సౌకర్యవంతంగా, అభివృద్ధి ధ్యేయంగా, జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే, అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అని అనుకుంటున్నారు.


ఒక్క సారి కనీసం ఇలా కలలోనైనా కలగనండి, వైసీపీ పార్టీ పెద్దలు, విజయసాయిరెడ్డి, సజ్జల, వేమిరెడ్డి, సుబ్బారెడ్డి గార్లు, ఇతర ఆ స్ధాయి పెద్దలు, చీరాల కు జరుగున్న అన్యాయానికి చలించి, చీరాల జిల్లా మరియు పార్లమెంటు మా బాధ్యత, ఇన్నాళ్ల తెదేపా నాయకులు కు చేతగాని ది, చేవ గల మేము చేస్తాం, అన్నారు అనుకోండి కాసేపు.

మంత్రులు బాలినేని, సురేష్ గార్లు, ఉపసభాపతి కోన గారు, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు మాకు వదిలేయి, మేము తెస్తాము త్వరలో అన్నారు అనుకోండి.

ఎంపీలు మాగుంట, సురేష్, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలు, బీజేపీ జనసేన తెదేపా నాయకులు, చీరాల పార్లమెంటు, స్మార్ట్ సిటీ, బీచ్, ఇతర పరిశ్రమ లు బాధ్యత మాది అన్నారు అనుకోండి.

అది గదా మంచి రోజులు చీరాల, కారంచేడు, పర్చూరు, వేటపాలెం, చిన్న గంజాం, ఇతర దగ్గర ప్రకాశం మండలాలకు వచ్చే సుదినం.

ఇవి ఎన్నో ఏళ్ల కోర్కెలు, కలలు గానే, మిగిలిన వి కదా? ఈ కల సాధ్యపడుతుందా? నిజం చేసే దేవుళ్ళు, మంచి మనసులు మనుషులు, మన ఈ పెద్దలు గురువు లు లో ఉన్నారా? చిరస్థాయిగా ఈ ప్రాంత హృదయాలలో నిలచిపోతారా, జగనన్నను నిలబెడతారా? కలెక్టర్, జిల్లా అధికారులు తమ పలుకుబడి రికమండేషన్ లు సాధ్యమైనంత వరకు అందుతాయా అందిస్తారా?



మీలో నుంచి ఒక గురువు గారు, నవ్వుతూ, ఏవండి మీ బాధ ఆవేదన అర్ధము అయ్యింది, సొంత లోన్ లేదా ఆస్తి కోసము ఇలా అడుగుతారు కానీ, మీది విచిత్రము మొత్తము ప్రాంతము గురించి జాలర్లు నేతన్నల గురించి నెల రోజులు పైన, ఇవి ఎమ్మెల్యే ఎంపీ నాయకులు అడగాల్సినవి, ఎప్పుడో చెయ్యాల్సినవి. ఈ మీ ప్రాంత కలలన్నీ ఒకవేళ నిజమైతే, మరి వారికి అంటే కలెక్టర్ అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఎక్కువ సాధించారో, మీరు ఒక వ్యక్తి గా, మీ పరిధిలో, మీ శక్తి కొలది, ఏమి గురుదక్షిణ ఇస్తారు అని అడిగారు?

ఇది సీరియస్ ప్రశ్న కూడా, దైవం మన నిబద్ధత అందరి జనం ముందు నిలపడానికి, కావచ్చు ఏమో? వారు చెయ్యాలి అనుకుంటే ఇది చాలా చిన్నపని, 3 రాజధానుల కన్న కూడా. కేసీయార్ ఎన్నో జిల్లాలు చేసారు. ఇది ఎంటీఆర్ రాజన్న చంద్రబాబు జగనన్న ప్రతిష్ట కు సంభందించినది.

అంతకన్నా భాగ్యమా, అవి జరిగితే, మా శక్తి మేరకు అన్ని ఇచ్చేస్తాము, ఏమి తెచ్చాము వస్తా. 75 ఏళ్ల అమ్మ తో కలసి, స్వచ్చందముగా నారాయణుడు లేదా యముడు దగ్గరకు ఆనందంగా వెళతాము కలెక్టర్ గారి అనుమతితో దయతో కూడిన ముగింపు తో, సంతోషం తో ఉత్త చేతులు తో వెళ్లి పోతాము.

ఆధ్యాత్మికంగా, 44 వారాల 108 ప్రదక్షిణాల, 75 ఏళ్ల కన్నతల్లి కి అండ, 20 ఏళ్ల శాఖాహారం నేల నిద్ర దైవ పూజ, ఇతరులకు చేసిన చెప్పిన మంచి, ఉన్న పుణ్యం, మొత్తం శాస్త్రోక్తంగా నీళ్ల తో వారికి ధార పోస్తాము వారికి నమ్మకము ఉంటే. ఇది వారికి ఆపదల సమయంలో, తక్కువ నష్టం తో భవిష్యత్తు లో బయటపడతారు.

భౌతికంగా, మాకున్న పావలా అర్థ ఆస్తులు మొత్తం వారికే ఇస్తాము. అది వారికి పెద్దగా ఆనకపోవచ్చు కూడా, కరివేపాకు లా అనిపిస్తుంది. లేదంటే మా గ్రామ పంచాయతీ కి పట్టణ మున్సిపాలిటీ కి ఇచ్చేస్తాము. లైబ్రరీ, పార్కు, ఏదో ఒక మంచి చేయవచ్చు కదా. ఇంక మాకు ఏమీ లేదు కాబట్టి, ఇంత మంచి జరిగాక మా ప్రాంతంకు, ఇక మేము ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు.

అమ్మ ని అడిగా, నీకిష్టమేనా అని, నువ్వు చెపితే నారాయణుడి మాటే, ఇంతకన్నా మనం జీవితంలో ఇంక సాధించేది ఏముంది, అలాగే అంది, నవ్వుతూ. ఇంతకన్నా ఇవ్వగలిగింది ఏమీ లేదు, దేవుని బిడ్డ లైన గురువు లందరకు.

ఆ మంచి మనసున్న పెద్దలు, జగన్ గారి తో కలిపి, అందరి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు, వారి వంశము ఎల్ల కాలం, అష్ట ఐశ్వర్యాలతో ఆధ్యాత్మిక చింతనతో , ఆనందంగా జీవించాలి ఇలాగే నలుగురు కి సహాయం చేస్తూ అని భగవంతుని కి నివేదిస్తా మనస్పూర్తిగా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,864,123; 104 తత్వాలు (Tatvaalu) and views 224,753
Dt : 10-Aug-2020, Upd Dt : 10-Aug-2020, Category : Request
Views : 779 ( + More Social Media views ), Id : 642 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : cm jagan , dream , wish , chirala , district , harbor , handloom park , smart city , beach
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content