కరోనా వాళ్ళ అమ్మ ఎదురు చూస్తుంది, తన బిడ్డ ఇంకా వెనక్కు రాలేదని - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,786,404; 104 తత్వాలు (Tatvaalu) and views 217,095.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ధన్యవాదాలు, ఏప్రిల్ 5 వ తేదీ 9 వ గంట 9 నిమిషాల దీపాల కాంతుల చిత్రములు, పంపిన గురువు లందరకు. అందులో ఒకటి, మీరూ చూడండి. మన పని చెప్పుకోనిదే, చూపించనిదే బయట వారికి తెలీదు. ఆసక్తి ఉండీ ఇవి తెలియని వారు, ఎప్పటికీ నేర్చుకోలేరు కదా.

నిస్వార్ధంగా బయట వారికి ఏమీ చేయని వారు, వీటిని గొప్పలు అని గేళి చేస్తూనే ఉంటారు, జీవితాంతం. చూడండి చిత్రములో, ఆ దీపాల అలంకరణ.

ఈ దీపాలు, దేశానికి, ప్రజలకు మరియు మన పోలీసులు, డాక్టర్లు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు అందరికీ సంఘీభావం, కృతజ్ఞతలు తెలుపుటకు, వారి ఘనమైన గొప్ప సేవలకు. వీరంతా ప్రభుత్వ యంత్రాంగమే. ప్రజా సేవకులకు, రక్షకులకు వందనాలు.

ప్రభుత్వం మాకేమి చేసింది అని అడిగే వారందరికీ సమాధానం, ఈ లాక్ డౌన్ లో దొరికి ఉంటుంది అనుకుంటున్నాము. పైన చెప్పిన అందరూ షుమారు వంద శాతం ప్రభుత్వం వారే. కాంట్రాక్టర్లు ఉన్నా, వారికి ఇచ్చిన ధనం ప్రభుత్వం దే.

ఒక్క నిమిషం ఆలోచన చెయ్యండి, పోలీసులు లేదా డాక్టర్లు కూడా, మేమూ మనుషుల మే, మేమూ ఇంట్లో ఉంటాము మా కుటుంబాలతో అంటే, మన బతుకు ఏమౌతుంది, ఆ క్షణం నుంచి? అరాచకం మొదలు అవుతుంది. మనం ఇంట్లో ఒక్క క్షణం కూడా, ప్రశాంతంగా ఉండలేము కదా.

మరి మనము కూడా తిప్పి ఏమి ఇవ్వాలి, ఎలా సేవ చెయ్యాలి, మన ప్రభుత్వం మరియు దేశం కు? చాలా తేలిక, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, ఇంట్లో నే స్వచ్ఛంద నిర్భంధములో ఉంటే చాలు.

ఫిలప్పీన్స్ ప్రభుత్వం అనుకుంట, కనిపిస్తే కాల్చివేత అన్నారు. మొన్న కేసీఆర్ గారు కూడా అదేమాట అన్నారు అనుకుంట, మంచిగా చెబితే వినకపోతే ఏమి చేయాలి, కేంద్ర పోలీసులు ను దింపాలని, అక్కడ దాకా తెచ్చుకోవడం ఎవరికీ మంచిది కాదు. విదేశాలలో కొన్ని రాష్ట్రాలు, ఫైన్ కూడా వెస్తున్నాయి లేదా జైల్ లో పెడుతున్నారు.

అందరూ జాగ్రత్తగా ఉందాము. కందిపప్పు తో పప్పు మరియు చారు, రసం, పచ్చళ్ళు, కందిపొడి, వేరుశనగ పొడి, మజ్జిగ చారు, తిప్పి తిప్పి వాడటమే రోజూ. భయంకరమైన తెలుగు సీరియల్స్ నే, తిప్పి తిప్పి చూసి తట్టుకొని భరించగల పుణ్యాత్ములకు, ఇది పెద్ద కష్టం కాదు.

కరోనా వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది, తన బిడ్డ ఇంకా వెనక్కు రాలేదని. మనమంతా ఇంట్లో నే ఉంటే, జాలిపడి తే నే, కరోనా కూడా శాంతించి, హాయిగా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళుతుంది. దయచేసి సహాయం చేయండి మీ వంతుగా, ఇంట్లో ఉండి. తొందరగా కరోనా ను పంపిద్దాం, లాక్ డౌన్ రోజులు తగ్గిద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,786,404; 104 తత్వాలు (Tatvaalu) and views 217,095
Dt : 05-Apr-2020, Upd Dt : 05-Apr-2020, Category : General
Views : 935 ( + More Social Media views ), Id : 474 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , lock down days , covid 19 , people behaviour
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content