Devi Navratri - Serving Temple Mom common, but serving home older Mom? cataract surgery 1 - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,637; 104 తత్వాలు (Tatvaalu) and views 225,085.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Serving Temple Mom (Goddess) is common by many folks, but serving home older Mom (Living Goddess) is unique by only few people. దేవీ నవరాత్రులు - ఆ అమ్మ తో పాటూ మన అమ్మ సేవా భాగ్యం - నేత్ర చికిత్స

First we need to start helping our own elders by our own hands by keeping along with us and giving best world class medicine support help along with pure original responsible love affection gratitude given by them.

Remember, after 60 years age our parents are equal to 6 years old kids, particularly with respect to health and safety. They don't care about them, they will just care about us. So, we have to care and teach and give our level best love to them.

Goddess Durga gave opportunity to perform puja as usual like every year with Sri Suktam, Durga Suktam, Ashtottara, ...

But this year, Durga gracefully gave another great unique opportunity and helped to take care of Mom, who got eye cataract surgery last Wednesday.

8 years back our home town doctor said, "based on bp, sugar, old age weakness, it would be better to go to big doctor in big city. It may be simple for others but not same for all. So your mom situation is also unique and sensitive, . . .".

We were hesitating to go forward these many years. Last year, Corona situation. But this great doctor gave confidence and make us to agree and go forward.

It is 2 week process, more than Navratri days, lol. Not sure in our home town, they are following all these rules.

First primary doctor need to approve the surgery by checking and doing blood test.

Later after approval, eye doctor will take the measurements of that particular eye.

One day before, we have to start eye drops medicine, 3 bottles, for every 4 hrs.

Last Wednesday morning we visited doctor at 6.30am. again eye drops. completed surgery around 7.30am. We came out at 8.30 AM after their checkup.

That day and next day, again every 4 hrs we have to use 3 bottle drops with 3 min difference.

We have to go to restroom all the night along with Mom, every 2 hours, sugar folks need more visits.

Already from 8 years here, so many fall downs and by luck and God's grace no major issues but many emergencies.

Now the medicine has more drowsiness and sleep. So we should watch all the time carefully and hold the shoulder and make walk safely.

They gave black spectacle and strong eye shield, which need to be use while sleeping. It will take 2 weeks to become normal and see better.

Thursday first visit after surgery, doctor explained how difficult is the surgery for Mom. He said, I never did this much complex situation, but got success. We thanked him, because we already aware of that. Next week again we need to visit.

Not sure when we got into this situation when we are old, how will we face it and who will take care. lol. Even kids are leaving us at old age homes or with some other relatives.

Please sincerely help our own parents first and show gratitude love on them and give best world class health medicines facilities.

గురువు లందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడు పై మంచి కి గెలుపు, అందుకే దుర్గమ్మ ను మనసారా మదిలో తలుస్తూ,

కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోకజనని నీకు దండాలు

అని ఏళ్లుగా అంటున్నాము కదూ. అమ్మ తో ఉన్న ఈ 8 ఏళ్లుగా, అన్ని పూజలతో పాటుగా, దశమి పూజ కూడా ఎప్పుడూ వదలలేదు, ఆదాయం ఉన్నా లేకపోయినా, కష్ట నష్టం అయినా కూడా.

ఫోన్ లు, లాప్ టాప్ లు, కారు లోపల బయట పసుపు కుంకుమ పూజ బొట్టు లు, దశమి ఆయుధ పూజలో భాగం గా.

భగవద్గీత లో చెప్పిన విధంగా సాధ్యమైనంత వరకు, సమతాస్ధితి లో ఉండాలి, అరిషడ్ వర్గాల ను సాధనతో జయించాలి.

కొన్ని సార్లు దేవుడు, మన వారి ద్వారా పంపిన సందేశం ను, సరిగ్గా అర్థం చేసుకుని, పాటించము. కానీ రాత తప్పించుకోలేము, మంచైనా చెడైనా.

ఈరోజు కూడా దుర్గా మరియు మహిషాసుర మర్ధని అష్టోత్తరం తో పాటుగా, దుర్గా సూక్తం, శ్రీసూక్తం తో దేవుని అర్చన చేసే భాగ్యం కలిగింది. ధ్యానం తో కూడా.

మనసు మాట నిబద్ధత ముఖ్యం, భీకర అలంకారాలు విందు భోజనాలు కాదు దేవుళ్ళ కు కావలసింది. మానవ సేవ లో మాధవ సేవ కూడా నిస్వార్థంగా చేయాలి చూడాలి, త్యాగ బుద్ది తో.

యువకులు ఇది చదివినా కూడా, గుడి లో దేవత తో పాటుగా, ఇంట్లో ఉండే సజీవ దేవతలకు కూడా, అందులో 60 దాటి నిస్సహాయత స్ధితిలో ఉన్న వారికి, బాధ్యత తో కూడిన కృతజ్ఞతల సేవలో తరించాలని, ధైర్యం అందించాలని ఈ భావవ్యక్తీకరణ.

ఈరోజు పూజలో తేడా ఏమిటి అంటే పక్కన 76 ఏళ్ల అమ్మ లేదు. మంచంమీద మందు బిళ్ళల మత్తులో, గాఢ నిద్ర లో అచేతనంగా ఉంది, ఎందుకంటే నేత్ర చికిత్స వలన.

ఈసారి నువ్వే దేవీ పూజ చేయి అంది ముందే, తన పరిస్థితి తెలుసు కాబట్టి. కష్టం లో కూడా, దేవుని పూజ వదలకుండా ఉండాలి.

8 ఏళ్ళ క్రితం, మన ఊళ్ళో డాక్టరు చెప్పారు, శుక్లాలు ముదురుతోంది, కానీ అమ్మ కు ఉన్న ప్రత్యేక స్ధితికి, ప్రసాద్ కళ్లు ఆసుపత్రి లాంటి పెద్ద వాటికి వెళ్ళాలి. ఇక్కడ మామూలు చోట కష్టం అన్నారు.

సరే ఇక్కడ కు వచ్చిన తర్వాత కూడా, ఇక్కడ డాక్టర్లు చెప్పారు, చేపిస్తే మంచిది అని. కానీ బీపీ షుగర్ ఇతర భయాలతో, మంచి డాక్టరు దొరికిన తర్వాత చేద్దాం అని ఆగాము. పోయిన సంవత్సరం కరోనా భయం.

గత వారం ధైర్యం చేసి, అమ్మ కు నచ్చ చెప్పి ధైర్యం కలిగించి, మన కళ్లు డాక్టర్ తోనే వెళ్ళడానికి నిర్ణయం చేసుకుని దైవ సహాయం తో.

ముందుగా అసలు ప్రైమరీ డాక్టరు తో కూడా పరీక్షలు చేయించి అనుమతి పొందాలి. తర్వాత మన కళ్ళు డాక్టరు తో పరీక్షలు చేయించి, కంటి లోపల కొలతలు ఇవ్వడం జరిగింది. తర్వాత రెండో బుధవారం, శస్త్రచికిత్స అని చెప్పారు.

నిన్న బుధవారం పొద్దున్నే 6 గంటలకు కారులో తీసుకుని వెళ్లి, 6.30 నర్సుల సంరక్షణ లో, కళ్ళు మందులు వాడుతూ, 7.30 దగ్గర లో , ఒక కన్ను కు శుక్లాల పొర తొలగించి, కొత్త పొర పెట్టారు. 8.30 కు మందులు, నల్ల కళ్లజోడు, నిద్ర అప్పుడు కంటి కవచం ఇచ్చి పంపారు.

ఒక మనిషి దగ్గర ఉండి చూసి, తీసుకుని వెళ్ళడానికి పక్కన లేనిదే, ఇవి చేయరు. ఒక రోజు మొత్తం కు జాగ్రత్తలు చెప్పి, మరలా తర్వాత రోజు తెమ్మన్నారు.

ఇంటికి వచ్చిన దగ్గర నుండి, షుగరు వాళ్ళు ఎక్కువగా, బాత్రూం కు వెళతారు. పడకుండా మనం పట్టుకుని తిరగాలి. ప్రతి 4 గంటలకు మందులు కళ్ళు లో వేయాలి, ఇన్ఫెక్షన్ రాకుండా. నొప్పులు ఉంటే, బిళ్ళలు వేయాలి.

బుధవారం రాత్రి అంతా అమ్మ తో బాత్రూం కు తిరుగుతూ ఉన్నాము. బుధవారం మొత్తం, మన సొంత పనులు కు పూర్తిగా సెలవు.

గురువారం ఉదయం కూడా, తోడుగా నే తిరగాలి. అవే మందులు కళ్ళు లో వేస్తూ ఉండాలి. బాధతో నొప్పి తో కన్నీరు కారుస్తూ తను మాటలను చెబుతుంటే ,మనం ఓపిక గా వింటూ, ఓదార్చడం, ఎంత అదృష్టం ఉంటే ఇక్కడ ఇంత మంచి వైద్యం డాక్టర్లు వస్తారని ధైర్యం చెపుతూ ఉండాలి, చేతులు పట్టుకుని ఆప్యాయంగా అండగా.

ప్రేమ తో కూడిన స్పర్శ, ఆర్తి గా ఓదార్పు తో చెప్పే మాటలు, ఎటువంటి రోగులకు రోగులకు అయినా మానసిక ధైర్యం ను ఇస్తాయి. అదే సంపూర్ణ ఆరోగ్యం కు మార్గదర్శనం. అదే దేవుని మానవుని అండ.

టిఫిన్, భోజనం, ఇతర బలమైన ఫలహారం సమయానికి ఒత్తిడి లేకుండా అందించాలి తినే విధంగా మాటలు చెప్పాలి , భాధ మరచేటట్టు , ధైర్యం పెరిగేటట్టు.

మన వేపాకు, కాకర అల్లం వెల్లుల్లి ఎటూ ఉంటాయి కదా పొద్దున్నే. అవే బీపీ, షుగరు ను అదుపులోకి తెచ్చి, కరోనా బారిన పడకుండా అమ్మ ను కాపాడింది.

గురువారం సాయంత్రం మరలా కళ్ళు డాక్టరు దగ్గరకు, చెకప్ కు. అప్పుడు ఆయన వివరించారు, ఇంత కఠినమైన సర్జరీ నేను ఎప్పుడూ చేయలేదు. చాలా సమయం పట్టింది, పర్లేదు సక్సెస్ అయింది. చిన్నగా ఓ రెండు వారాలలో, బూదర తొలగిపోతుంది అని చెప్పారు.

ఇంటికి వచ్చి, స్నానం చేపించి, బుధవారం వినాయకుని మరియు దుర్గమ్మ అనుమతి తీసుకున్నాం చికిత్స కు ముందు, ఇప్పుడు గురువారం వారికి కృతజ్ఞతలు చెప్పి అలాగే 14 వ వారం అనుకుంటా, హారతులు నీ సమక్షంలో గుడి లో జరగాలని, ధైర్యం చెప్పి, నల్ల కళ్ళు జోడు తో తీసుకుని వెళ్లి, ఎప్పుడు లాగ జనం కు దూరంగా వెనక కుర్చీలో కూర్చొనబెట్టి, సాయంత్రం మరియు రాత్రి హారతులు కూడా జరిపించాము.

అలా కన్నతల్లి సేవ చేసుకునే భాగ్యం, ఆ ఆదిపరాశక్తి మనకు కల్పించి, విజయదశమి నవరాత్రులు పర్వదినాలలో, విజయవంతం గా, శుక్లాల శస్త్రచికిత్స పూర్తి చేశారు. చూద్దాం మరి , ఆ కనకదుర్గమ్మ దయ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో.

ఓం నమో నారాయణాయ , ఓం శ్రీ మాత్రేనమః.

మీరూ మీ ముదుసలి తల్లి దండ్రలకు సేవ చేస్తారు కదూ. పెద్దలు గతించి ఉంటే, పశ్చాత్తాపం తో ఇతర దగ్గర పెద్దలు కు సేవ చేయాలి రక్షణ అండ కల్పించాలి, పాప పరిహారం కు.

కాల చక్రం మన దగ్గరకు వస్తుంది సుమా, మనమూ తప్పించుకోలేము.

ముందు కన్నతల్లి తండ్రి పాద దాసుడు, తర్వాత నే హరిహర దాసుడు, ఈ మీ అజ్ఞాన శిష్య శ్రీనివాసుడు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,637; 104 తత్వాలు (Tatvaalu) and views 225,085
Dt : 14-Oct-2021, Upd Dt : 16-Oct-2021, Category : General
Views : 853 ( + More Social Media views ), Id : 1261 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devi , navaratri , serving , temple , mom , goddess , older , eye , treatment , cataract , surgery
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content