మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,408; 104 తత్వాలు (Tatvaalu) and views 225,758.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.1 min read time.
బుధవారం, ఎక్కువగా విష్ణువు ను పూజిస్తారు. పరమాత్మ ఒకరే మరువద్దు, మనలోని గుణాలను బట్టి, ఎవరినో ఒకరినే పూజించాలి. ఇప్పుడు ధనుర్మాసం కూడా, తమిళ వైష్ణవులు గోదాదేవి తిరుప్పావై కూడా చదువుతారు.
విష్ణు సహస్రనామ ధ్యానం లో ఇది చదువుతారు, ఒకసారి నోటితో పలికి, పుణ్యం పులకరింపు పొందండి, దయచేసి.
భావము: శాంతిస్వరూపా! భుజగశయన! నాభిలో పద్మము కలవాడా! దేవతలకు అధిపతి అయినవాడా! ఈ విశ్వమునకు అంతటికీ ఆధారము అయినవాడా! ఆకాశము లాగా అంతటా వ్యాపించి ఉన్నవాడా! శుభప్రదమైనవాడా! యోగుల ధ్యానమునకు గమ్యమైనవాడా! సంసార భారమును పోగొట్టువాడా! ఓ విష్ణుదేవా! నీకు నమస్కారము.
ఓ కధ చెప్పుకుందాం, మనశ్శాంతి తో ఆరోగ్యం కోసం, మోహం నుంచి బయటకు రావడానికి.
ఒకసారి సప్త ఋషులు, విష్ణువు దర్శనం కోసం, వైకుంఠమునకు వెళ్తారు. స్వామి దర్శనం ఇప్పుడు లేదని, ద్వారపాలకులైన జయ విజయులు, అహంకారం తో చెపుతారు అడ్డగిస్తారు.
(మనం ఐశ్వర్యం, పదవి మరియు అధికారం తో ఉన్నా అణుకువ మర్యాద తో ఉండాలి, ఇతరులను అవమానించకూడదు, పదవి అధికారం శాశ్వతం కాదు)
దేవతలనే శాసించగల మాకు, స్వామి దర్శనం లేదంటారా? మీరు, 7 జన్మలు మానవులై జన్మించండి, అని మునులు శపించారు.
అప్పుడు జయవిజయులు విష్ణువు ను వేడుకొంటారు, మేము మిమ్ము వదిలి 7 జన్మలు ఉండలేము. శాప విమోచనము చేయమని వేడగా, స్వామి వారితో ఋషులు ఏమి చేసినా, లోక కళ్యాణం కోసం చేస్తారు.
మీరు 7 జన్మలు మానవులుగా జన్మిస్తారా లేక 3 జన్మలు రాక్షసులుగా జన్మిస్తారా అని అడగగా, వారు రాక్షసులు అయినా ఫర్వాలేదు, మేము మీ దగరకు తొందరగా రావాలి. కానీ మేము రాక్షసులుగా ఉన్నపుడు, మీ చేతులతో మమ్ములను సంహరించండి, అని వేడుకుంటారు. అలాగే అని స్వామి వరం ఇస్తారు.
(అర్థం అయిందా పూజలకు తప్పుకు ఫలితాలు మారవు. శిక్షలు కు పాత్రులమే. అధికారంలో ఉన్నప్పుడు కూడా, తన వారిని వెనక వేసుకుని, శిక్షలు తప్పించి, పాపం మూట కట్టుకోవడం తప్పు. పాపాలకు పాపులకు దూరంగా ఉండటం, ఉత్తమం. మంచి వారికి, భగవంతుని కి దగ్గరగా ఉండాలి ఎల్లప్పుడూ)
1. మొదటి జన్మలో జయ విజయులు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. వరాహ అవతారంలో హిరణ్యాక్షుని, నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని విష్ణువు చంపుతారు.
2. రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. విష్ణువు రామునిగా పుట్టి, వీరిని సంహరిస్తారు.
3. 3వసారి శిశుపాల దంతవక్తృడుగా జన్మిస్తారు. విష్ణువు కృష్ణావతారంలో, వీరిని సంహరిస్తారు.
ఇలా మూడు జన్మలు జయవిజయులు, విష్ణువు చేతిలో ప్రాణాలు వదిలి, వైకుంఠం చేరుతారు.
(పాప ఫలితాలు అనుభవించిన తర్వాత నే , మోక్షం సుమీ. తేలికగా మార్గం లేదు, ధనం యాగాలతో, తప్పులు దాయబడవు. ఇతరుల మాట నమ్మవద్దని, ఇదే సాక్ష్యం కదా? లేకపోతే మా కాపాలా వాళ్ళే గదా పోనీ అని వదిలేస్తే, పాపం పెరుగుతుంది కదా, ఆదర్శంగా ఉండలేరు కదా.)
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,408; 104 తత్వాలు (Tatvaalu) and views 225,758
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad. ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం. మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు. మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు