పంచాయితీ సెక్రెటరి ని ప్రశ్నిస్తూ నిలదీసిన మహిళ, ఆదర్శ ప్రజా ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,872,716; 104 తత్వాలు (Tatvaalu) and views 225,518.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

నేటి ముఖ్యమైన వార్త, ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం.

కరోనా పరిస్థితులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు అంటున్నారు. మే 1 నుంచి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ, కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. శభాష్ జగనన్నా, అంటున్న అభిమానులు అలాగే ప్రజలు.

సరే ఇప్పుడు పంచాయితీ సెక్రెటరి విధులు, అలాగే మంచి ఎమ్మెల్యే గురించి చూద్దాము. మంచి ఎమ్మెల్యే అంటే, ఆంధ్రా లో ఎక్కడ కనపడతారో తెలుసా?

అనంతపురం జిల్లా ధర్మవరం లో మాత్రమే సుమా. గతములో కూడా, వారి గురించి కధనాలు రాశాము.

ఈ వీడియో చూసి మరియు చూపించి, మీ మరియు మన ఎమ్మెల్యేకు కూడా, పదవి బాధ్యతలు గుర్తు చేస్తారు కదూ?

ఒక ప్రజల రక్షణ, మంచి చెడు చూసే ఎమ్మెల్యే లేదా ఎంపీ, లక్ష రూపాయల ప్రజా రక్త చెమటల పన్నులు, జీతము తీసుకుంటూ సౌకర్యాలు పొందుతూ, హోదాతో తిరుగుతూ, ఇంట్లో చాటుగా ఉండరు లేదా ఇతర నగరాల్లో వ్యాపారము చేసుకుంటూ అతిధిలా వచ్చి పోరు, సంస్కారం నీతి నియమాలు ఉంటే, కుటుంబ గౌరవం ఉంటే.

ప్రభుత్వ అధికారులు అయినా అంతే సుమా, తేడా ఏమీ లేదు.

అలాంటి నీతి మాలిన నిర్లక్ష్య బద్దకపు, ఎమ్మెల్యేలకు ఎంపీలు కు టిక్కెట్ ఎలా ఇస్తారో లేదా పక్క పార్టీ నుంచి ఎలా తెస్తారో తెలీదు, ఏ పార్టీ అధిష్టానం అయినా, తమ ప్రతిష్ట దిగజారుతుంది అని తెలిసి కూడా.

అలాగే ఆ ఉరి ప్రజలు కూడా, ఎదో ఒక మత్తులో వారిని ఎన్నుకుని, తమ గొంతు తాము ఎందుకు కోసుకుంటారో, ఈ కలియుగములో, ఆ దేవ దేవుని కి కూడా, అర్ధము కాదు.

ఇంతవరకు మాకు కూడా తెలీదు, పంచాయతీ సెక్రటరి గ్రామ వీధుల్లో తిరుగుతూ, అందరినీ మంచి చెడు చూస్తూ సమస్యలు అడుగుతూ, అందరికీ తాను తెలుస్తూ, పలకరించాలని.

మొన్న, మా అక్క గారిని అడిగాను. మన సెక్రటరి గారు వచ్చారా, మన బజారు వైపు ఎప్పుడైనా, కబ్జా షాపులు, రోడ్ మీద పార్కింగ్ చూసారా, రోడ్ వెంట ఖాళీ స్థలాలో చెత్త గమనించారా అని.

ఆయన ఎప్పుడూ ఈ బజారు లో కనపడ లేదు, అన్నారు. మనము, సమస్యలు పంపినా, జవాబు లేదు.

మన డైనమిక్ హీరో, కొత్త ట్రెండ్ సెట్ చేసే, ధర్మవరం ఆదర్శ ఎమ్మెల్యే, కేతిరెడ్డి గారు, వారి నియోజక వర్గ ప్రజల ఇళ్ళకు తిరుగుతూ, వార్డుల వారీగా, సమస్యలు పరిష్కరించడం తెలుసు.

ఈ వీడియోలో చూడండి, ఒక మహిళ వీధి లైట్లు వెలగడం లేదు, అసలు గ్రామ సెక్రటరీ ఎవరో నాకు తెలీదు, ఎప్పుడూ చూడలేదు అంటే, ఎలా, ఆ గ్రామ అధికారిని, ఎమ్మెల్యే గారు, గట్టిగా ప్రశ్నిస్తూ, తన ఉద్యోగ బాధ్యతను, ప్రజల యందు భక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారో.

ఆ మహిళ కూడా, సెక్రటరీ ని ఎలా నిలదీస్తుందో పనుల గురించి చూడండి.

మా అలాగే మీ ఊరు, పంచాయితీ అలాగే మున్సిపల్ అధికారులు కూడా, ప్రజలలో వార్డులలో తిరుగుతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలి.

కేతిరెడ్డి గారూ, మీరైనా, గ్రామ పట్టణ అధికారులను, తమ పర్యటన వివరాలను, సోషల్ మీడియాలో పెట్టమని చెపితే, ఇంట్లో నుంచే, మీరు మరియు ఇతర అధికారులు, తమ సిబ్బంది సేవలను చూడవచ్చు.

నాయకులు బయటకు రాలేని పరిస్థితిలో, ఆన్లైన్ వారి సేవలను తనిఖీ చేయవచ్చు. ప్రజలకు మంచిది కూడా, ఈ పద్ధతి.

మా ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు, ఒంగోల్, గుంటూర్ జిల్లా బాపట్ల ఎమ్మెల్యేలకు అలాగే ప్రజలకు చెప్పినా కూడా, అధికారుల చేత, సోషల్ మీడియా పెట్టించి, స్థానిక అధికారుల పర్యటన వివరాలు, నమోదు చేయించలేకపోతున్నారు, వారి వల్ల కావడం లేదు.

మీరైనా, మొదలు పెడితే, మా వాళ్ళ కు అది ఆదర్శము గా ఉంటుంది. ఇలా వార్డుల వెంట తిరగడం, అధికారులను ప్రజల మధ్యలో నిలదీయడం, ప్రజలకు మంచి చేయడం, మా ఎమ్మెల్యేలకు తెలీదు, తెలుసుకోరు, చేయరు.

అందుకే గతములో జగనన్న ను కోరాము, ధర్మవరం కేతిరెడ్డి గారి వీడియోలు, 175 మంది ఎమ్మెల్యేలకు చూపించాలని, తమ విధుల గురించి తెలుసేటట్టు చేయాలని.

జగనన్న కు మంచి పేరు తెచ్చే, ఆదర్శ ఎమ్మెల్యే మీరు మాత్రమే, శభాష్.

దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. వాలంటీర్ లకు ఇచ్చిన విధంగా, ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు ఇవ్వాలి.

175 ఎమ్మెల్యేలు అలాగే 25 మంది ఎంపీలు లో, ఇలా ప్రజల వెంట పడుతూ, అధికారులు ను నిలదీస్తూ, వార్డులు తిరిగే వారు ని, వేరొకరు ను చూపగలరా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,872,716; 104 తత్వాలు (Tatvaalu) and views 225,518
Dt : 23-Apr-2021, Upd Dt : 23-Apr-2021, Category : General
Views : 809 ( + More Social Media views ), Id : 1130 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dharmavaram , kethireddy , ideal , public , mla , woman , questioned , panchayat , secretary
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content