ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం - విభజన సజావుగా జరుగుతుందా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,987; 104 తత్వాలు (Tatvaalu) and views 225,010.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే, కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది, అని పుకార్లు వస్తున్నాయి. తెలంగాణ లో 8 జిల్లా ల నుంచి దాదాపుగా 33 జిల్లా లు పెంచినందు వలన, ఎంత ఉపయోగం జరిగిందో తెలీదు, ఆ అదనపు ఖర్చు తో. అదే లెక్క లో చేసిన, 40 పైగా చిన్న చిన్న జిల్లా లు వస్తాయేమో.

ఉదాహరణకు ఇప్పుడు ప్రకాశం లేదా ఇతర జిల్లాలో జాయింట్ కలెక్టర్ లు ముగ్గురు దాకా ఉన్నారు. రెవెన్యూ డివిజన్లు కు ఆర్డీవో లు ఉన్నారు. అలాగే సబ్ డివిజన్ డీఎస్పీ లు ఉన్నారు. బహుశా ఇంక ఇవన్నీ రద్దు లేదా తగ్గుతాయి. ఇక నేరుగా ఒక కలెక్టర్, ఎస్పీ, ఒకరు లేదా రెండు డీఎస్పీ, ఒకరు లేదా రెండు రెవెన్యూ ఆఫీసర్ లు ఉంటారు అని అనుకుంటున్నారు.

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం, ఒక్కో జిల్లాగా మారబోతోంది అంటున్నారు. మరి అది ఎలా ఉత్తమం అవుతుందో తెలీదు. ఎందుకంటే పార్లమెంటు స్ధానం పరిధి, జనాభా ని బట్టి, మరలా మరలా విభజన జరుగుతూనే ఉంటుంది. ఇతర జిల్లాల్లో ని ఊర్లు, అటూ ఇటూ కలుపుతూనే ఉంటారు.

అంటే ఉదాహరణకు ప్రకాశం జిల్లా ఊర్లు, గుంటూరు జిల్లా లో కలుస్తాయి, అలాగే మిగతా జిల్లా ల లో కూడా. చారిత్రాత్మక మార్పులు జరుగుతాయి, కొన్ని ఊర్ల లేదా నాయకుల ఉనికి పలుకుబడి, పెరగవచ్చు తరగవచ్చు.

అలా కాకుండా, అదే జిల్లా లో అడ్డంగా లేదా నిలువుగా లేదా ఊళ్ల దూరం ను బట్టి లేదా రెవెన్యూ డివిజన్ ప్రకారం విభజించిన, కొంత మేర అదే జిల్లా వారసత్వ ఉనికి ఉంటుంది.

ఉదాహరణకు ప్రకాశం జిల్లా ను ఒంగోలు మరియు మార్కాపురం/ కనిగిరి జిల్లా లు గా విభజిస్తే, లేదా చీరాల ఒంగోలు మార్కాపురం కనిగిరి జిల్లా లు గా విభజిస్తే, పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, పక్క జిల్లా ల తో చీలికలు కలపడం ఉండవు అని భావిస్తున్నారు కొంతమంది.

పార్లమెంటు స్ధానం ప్రకారం అంటే, ఇప్పుడున్న 13 జిల్లాలు షుమారు 25 జిల్లాలు అవుతాయి అంటున్నారు. దీనిపై ఈ నెల జరిగే మంత్రివర్గ సమావేశంలో, ప్రకటిస్తారని వినికిడి.

ఇలా జరిగిన, ప్రతి కొత్త జిల్లా కలెక్టర్ మరియు ఎంపీ, ఇక ఒకే స్ధాయి లేదా ఒకే ప్రాంతంకు నాయకులు అవుతారు. రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుంది. లాభం తో పాటుగా నష్టం కూడా ఉంటుంది.

ఇప్పుడు ఉన్న పరిస్థితి లో, ఒక జిల్లా లో రెండు మూడు పార్లమెంటు స్ధానాలు ఉంటాయి కాబట్టి, కలెక్టర్ ప్రాముఖ్యత పట్టు పరిధి ఎక్కువ ఉంటుంది, ఎంపీ కి కొంత వరకే పట్టు ఉంటుంది.

అయితే ఈ జిల్లాల విభజన సజావుగా జరుగుతుందా? అధికార వైసీపీలో నే, వ్యతిరేక గళాలు వినిపిస్తాయా? మరి ప్రతిపక్ష నేతల ఆలోచన ఎలా ఉంది, అనేది ఆసక్తికరంగా మారింది.

జగన్ మరి ఈ పరిస్తితిని ఎలా ఎదుర్కొంటారు. ప్రజల మన్ననలు పొందుతారా లేక అనవసర తలకాయ నొప్పి అని మానేస్తారా, చూడాలి. ఇంకా జిల్లా పేర్లు తో కూడా సమస్యలు ఉన్నాయి.

ఎందుకంటే అప్పుడే నెల్లూరు, శ్రీకాకుళం చిత్తూరు జిల్లా నాయకుల వాదనలు ప్రారంభమైనాయి. ఏం జరుగుతుందో చూద్దాం.

వాట్సాప్ లో తిరుగుతున్న, కొత్త జిల్లాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1) అరుకు

130. కురుపాం
131. పార్వతీపురం
132. సాలూరు
146. మాడుగుల,
147. అరకు లోయ
148. పాడేరు
172. రంపచోడవరం
2) శ్రీకాకుళం

120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.
3) విజయనగరం

126. ఎచ్చెర్ల,
128. రాజాం
129. పాలకొండ హ
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.
4) విశాఖపట్నం

135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140.తూర్పు విశాఖ
141. దక్షిణ విశాఖ
142. ఉత్తర విశాఖ
143. పశ్చిమ విశాఖ
5) అనకాపల్లి

144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పయకరావుపేట
153. నర్సీపట్నం.
6) కాకినాడ

154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.
7) అమలాపురం

161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం
164. రాజోలు
165. గన్నవరం
166. కొత్తపేట,
167. మండపేట
8) రాజమండ్రి

159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు
174. నిడదవోలు,
185. గోపాలపురం
9) నరసాపురం

175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.
10) ఏలూరు

182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం
187. చింతలపూడి
189. నూజివీడు
192. కైకలూరు
11) మచిలీపట్టణం

190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. ఉయ్యూరు,
197. పెనమలూరు
12) విజయవాడ

188. తిరువూరు
198. భవానీపురం,
199. సత్యనారాయణ పురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ
203. జగ్గయ్యపేట
13) గుంటూరు

205. తాడికొండ
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ
14)నరసారావుపేట

204. పెదకూరపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల
15)బాపట్ల

208. వేమూరు
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.)
16)ఒంగోలు

221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి
17) నంద్యాల

253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్
18)కర్నూలు

256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు
263. యెమ్మిగనూరు,
264. కౌతలం,
265. ఆదోని,
266. ఆలూరు
19) అనంతపురం

267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు
20) హిందూపూర్

271. సింగనమల
275. మడకసిర
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి
21) కడప

243. బద్వేల్
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు
22)నెల్లూరు

228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ
242. ఉదయగిరి.
23) తిరుపతి

238 సర్వేపల్లి,
239. గూడూరు
240. సూళ్ళూరుపేట
241. వెంకటగిరి,
286. తిరుపతి,
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు
24) రాజంపేట

244. రాజంపేట
246 కోడూరు
247. రాయచోటి
281. తంబళ్ళపల్లె
282. పీలేరు
283. మదనపల్లె
284. పుంగనూరు
25) చిత్తూరు

285. చంద్రగిరి,
289. నగరి,
290 గంగాధరనెల్లూరు
291 చిత్తూరు,
292 పూతలపట్టు
293 పలమనేరు,
294 కుప్పం.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,987; 104 తత్వాలు (Tatvaalu) and views 225,010
Dt : 12-Jul-2020, Upd Dt : 12-Jul-2020, Category : General
Views : 1060 ( + More Social Media views ), Id : 595 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : new districts , andhra pradesh , division go smoothly , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content