మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవు అనుకున్నా, కానీ ఇప్పుడు మూర్ఖత్వానికి బద్దకానికి చింతిస్తున్నా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1483 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1518 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇప్పుడు దాకా రాలవు అనుకున్నా, కానీ ఇప్పుడు నా మూర్ఖత్వానికి బద్దకానికి నిర్లక్ష్యానికి చింతిస్తున్నా. 2 నెలలు జీతం/ ఆదాయం లేకపోతే, నా భార్య కన్నబిడ్డలను కూడా దూరంగా ఊళ్ళో వదిలిన దౌర్భాగ్యుడిని. మరి మీరు 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోతే, ఆస్తులు అమ్మక, అప్పులు చేయక, అమ్మకు ఒక్క అసౌకర్యము కలగకుండా నెట్టుకువస్తున్నారు, నాకు ఇప్పటికీ నమ్మకస్యముగా లేదు. మరలా మాకు తెలుగు పేరాల పరంపరలు పంపుతునారు సాక్ష్యాలతో అంటే, నిబద్దతతో త్రికరణ శుద్ది గా ఆచరిస్తే, మంత్రాలకు శక్తి ఉంది అని నమ్ముతున్నాను సజీవ సాక్ష్యము తో.*

జవాబు - గురువు గారు, మనిషి రోజూ తన అంత రంగములోకి చూసుకుంటూ, తన తప్పులు తాను ఒప్పుకుంటూ తానే సరిచేసుకుంటూ ఉంటే, మన అంత రంగమే, మన గురువు, మన దేవాలయం. ఆయనే శివుడు, ప్రతిక్షణం మనల్ని కనిపెట్టుకుని ఉండేది, రక్షించేది, భక్షించేది, తోడు కాటి దాకా వచ్చేది. తప్పులు ఒప్పుకుని, మనిషిగా మారతాను అంటే, ఆయనే దోవ చూపిస్తాడు. వ్యామోహములో ఉన్న పాపాత్ములకు దూరముగా ఉంచుతాడు. ఎప్పుడు దగ్గరకు తావాలో, ఎప్పుడు దూరం గా వేయాలో ఆయనకు తెలుసు.

అయితే కొంత మందికి, సాత్విక లక్షణాలు ఉన్నా, పూర్వ జన్మ వాసనా బంధకాల చేత, ఇది చేయడం కష్టము గా ఉంటుంది, మధ్యలో అటు ఇటు దూకుతా ఉంటారు, పట్టుకోలేక. అప్పుడు, కఠిన సాధన చేసేవారితో సఖ్యత గా ఉంటూ, వారి సూచనల ప్రకారం, నీతి నియమాలతో ఒకే మాట పై ఉంటూ, కఠినమైన సాధనలు ఆచరించాలి, నష్టం కలిగినా.

దేవుడు నష్టం చేస్తున్నారు అంటే, తాను దగ్గర ఉండి, దోవ చూపుతున్నట్లే, పరీక్ష పెట్టి నీతి నియమానికి నిలబడగలమా లేదా అని.

* బంగారం, రూపం పొంది ఆభరణం కావాలి అంటే, అగ్నికి కాలాలి సుత్తి దెబ్బలు తినాలి కదా? అంతే గానీ, నాకు పొలం లో పంట వేయడం రాదని చెప్పి, వ్యవసాయం వేస్టే అంటే, మనకన్నా మూర్ఖుడు ఇంకొకరు ఉండరు.

* ఇది తెలీని మూర్ఖులు, దేవుడు లేడు, మంత్రాలు అనవసరం, నోరు వాడం అది రోగాలకే గొడవలకే అబద్దాలకే తప్పుడు పనులకే మెక్కడానికే, అలాగె ప్రదక్షిణలు దండగ అంటారు.

* కానీ తాము కష్టపడి చెమతోడ్చి, 30 ఏళ్ళు కష్టాలు పడి సాకిన పిల్లలే నడిరోడ్డున లేదా ఒంటరిగా మమ్మల్ని వదిలేసారు, పిల్లలు దండగ, మా ఇన్నేళ్ళ జీవితం వ్రుధా అని మాత్రము చెప్పరు, 60 ఏళ్ళకి మంచము లో ఉంటే ఒక్కరు లేరు తోడుగా అని విలపిస్తూ కూడా.

* తాము ఇతరులను మోసం చేసి దోచుకున్న ధనము కూడా కరోనా నుంచి కాపాడలేదు ప్రాణాన్ని అని మాత్రం చెప్పరు, ఎందుకంటే తర్వాత వారి నోరు శరీరం లెగవదు.

* కనీసం 2 నాల్కలు 2 మాటలు 2 వ్యక్తిత్వాలు లేవు అని కూడా చెప్పలేరు.

వీరంతా, దేవునికి దూరం గా ఉంటూ లేదా బయట వెతుకుతూ, తమ సమస్యలు బాధలు తప్పించుకోవడానికి లేదా వచ్చినప్పుడు మాత్రమే, ఇళ్ళు వదలి ఊళ్ళ మీద పడి, వ్రుధా యాత్రలు చేస్తున్నారు, కేవలం సందర్శకులు గా, ఫలితాలు లేకుండా.

తాగితే చాలు మత్తు లో ఊగితే చాలు, మన సమస్యలు ఈ రాత్రికి వెళ్ళిపోతాయి అని నమ్మే వారి మాటలు, అలాగే ఉంటాయి.

మూర్ఖుడు మనస్పూర్తిగా ప్రయత్నం చేయకుండా - గడ్డి తిని పాలు ఎలా ఇస్తుంది? పాలతో పెరుగు వస్తుందా, నేను నమ్మను, ఇది అబద్దం అంటాడు - తను మాత్రం ప్రయత్నం చేయడు త్రికరణ శుద్ది గా. ఏది క్షణము లో గడ్డి తిని పాలు ఇవ్వు, పాలలో ఎక్కడ పెరుగు ఉందో చూపించు అని వితండవాదం చేస్తాడు.

మంత్రం త్రికరణ శుద్ది గా మనసు మీద పని చేస్తుంది. అంటే మానసిక బలాన్ని ఇస్తుంది. అంటే, భవిష్యత్ లో జరగబోయే, విపత్తులకు ఇప్పుడు నుంచే మనల్ని సిద్దం చేస్తుంది. ఆపద ను రానీయకుండా ఆపదు, కానీ దానిని ఎదుర్కునే శక్తి ని యుక్తిని ఇచ్చి, కాపాడుతుంది.

ఎవరిదో ఉదాహరణ చెపితే, అబ్బో అన్ని అబద్దాలు సాక్ష్యం లేదు అంటారు. పోనీ మన గురించి చెపితే, అబ్బో గొప్పలు చెపుతున్నారు అంటారు. అది ఈరోజు ఉన్న కలి సమాజ ధర్మం.

మనకు సొంత ధర్మ సంపాదన మొదలు అయ్యిన దగ్గర నుంచి, ఎటువంటి చెడు సావాసాలకు, అనవసర విందు వినోదాలకు, పోనీయకుండా పొదుపు నేర్పించి, నేడు ఎవరి ఎదురు చేయి చాచకుండా అప్పు లేకుండా, ముదుసలి తల్లికి ఏమాత్రం సౌకర్యాలు తగ్గకుండా, 8 ఏళ్ళు కాపాడింది ఆ మంత్రమే.

ఇతరులు మనల్ని చెడగొట్టాలని చూసినా, రక్షణ కవచముగా ఉండి, ముందే మేల్కొలిపి, వారి నుంచి దూరముగా పెట్టింది, ఆ తారక మంత్రమే. మనకు ధనం లేకపోయినా, రేపు నేను ఉన్నాను, కనీసం తిండి గూడు గుడ్డ ఇస్తాను, నీ సాధనకు భంగము రానీయను అన్నది, ఈ రామ నారాయణ మంత్రమే. తగిన సాత్వికులను కూడా, సమయానికి పంపింది, ఈ మంత్రమే.

మంత్రము అంటే పెద్ద పెద్ద పేరాలు కాదు, కనీసం తేలిక రామ రామ అంటూ, ఆచరణలో కూడా, రాముని గుణాలు లక్షణాలు చూపాలి సుమా.

మన కఠిన సాధనను బట్టి, అది ఎన్నేళ్ళకు ఫలిస్తుంది అని తెలుస్తుంది. కానీ మన అడుగు, మాట, పాట, చేతలలో, సేవ, త్యాగాలలో, కష్టాలలో, పదిమందికి దాచకుండా చెప్పే త్రికరణ శుద్ది లో, అది స్పష్టము గా కనిపిస్తుంది సుమా. అది కనిపించకుండా, నేను 50 ఏళ్ళు ధ్యానం చేసినా, పూజలు చేసినా అంటే ఉపయోగం లేదు అంటే అతనిలో లోపమే కదా?

అందుకే పెద్దలు చెప్పింది, చిత్త శుద్ది లేని శివ పూజలు ఫలించవు అని. మంత్రాలకు శక్తి ఉంది, అది అందుకుని ఆచరించే ధైర్యం యుక్తి శక్తి మనకు ఉన్నాయా?

అది లేనప్పుడు, మన పిల్లలు మనల్ని 60 ఏళ్ళ తర్వాత లేదా మంచాన రోగాన పడ్డప్పుడు స్వయము గా చూస్తారా లేదా తూ నీ బతుకు అని ఆయాలతో ఆశ్రమాలలో వేస్తారా అని చెపుదాము ముందుగా మన నిబద్దతకు.

Do really mantras practice sadhana help for issues? Thought not, But now regrets being lazy with stupidity  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1518 General Articles, 51 Tatvaalu
Dt : 22-Apr-2022, Upd Dt : 22-Apr-2022, Category : General
Views : 263 ( + More Social Media views ), Id : 1364 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mantra , practice , sadhana , help , issues , dhyanam , meditation , regrets , lazy , stupidity
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content