ఒక్క మాట అడుగుతా, దేవుడు మీ ఇంటికి వచ్చినా, ఉదయం 5 కే లేపేటట్లు? పాపం, దేవుడుని కూడా వదలరా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,602; 104 తత్వాలు (Tatvaalu) and views 239,952.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Just asking, do you wake up God at 5 am even if God comes to your house? Oh God, even you don't leave God? ఒక్క మాట అడుగుతా, దేవుడు మీ ఇంటికి వచ్చినా కూడా, ఉదయం 5 కే లేపేటట్లు ఉన్నారు? పాపం, దేవుడుని కూడా వదలరా?*

*స్పందన* - ఏమండీ, మీ మాటలు చదువుతుంటే, మనసుకు బలం వస్తున్నది ఉత్తేజం కలుగుతున్నది. మేము ఎందుకు చేయలేము? మా కుటుంబం మాత్రం ఎందుకు సత్వ గుణం నేర్చుకోలేని చవటలమా, దద్దమ్మలమా, బలహీనులమా, సోంబేరులమా, రాక్షస సంతానమా/ వంశమా మేము అని. తోటి వారు చేసినప్పుడు, మేము మా బిడ్డలు చెయ్యగలము అని ఒక ప్రగాఢ నమ్మకం కలుగుతున్నది.

తల్లి ప్రేమ, బాధ్యత, క్రుతజ్ఞత, విశ్వసనీయత, సత్వ గుణం, త్యాగం, సహనం, ఓర్పు నేర్పడం చూస్తుంటే, తానూ 4.30 లెగిచి 78+ ఏళ్ళ వయసులో అదీ 11 కి పడుకుని, కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతున్నాయి. మిమ్మల్ని ఏమని మెచ్చుకోవాలో నోట మాట రావడం లేదు. ఇన్ని ఏళ్ళలో, షుమారు 40 ఏళ్ళుగా, ఇలాంటి మాటలు కూడా, మా చుట్టూ ఉన్న మాయా మోహ ప్రపంచ మంద లో వినలేదు/ అక్షరాలు గా చదివే భాగ్యం కలగలేదు. మీకు తల వంచి నమస్కారాలు, అమ్మ పాదాలకు ప్రణామాలు.

సత్వ గుణ తల్లి పెంపకం అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. అందుకే మా అమ్మ కూడా అనేది, దొరికితే సత్వ గుణవతి ని మాత్రమే చేసుకోరా లేదంటే గమ్ముగా ఉండడం మేలు అని, ఇప్పుడు అమ్మ లేదు, ఆనాడు సేవ మేము సొంత చేతులతో చేయలేదు, కానీ డబ్బు/ వీసా/ ఆస్తి/ అధికారం/ అందం కు ఆత్మను అమ్ముకుని అమ్ముడు పోయాము, ఫలితం అనుభవిస్తున్నాము. భాగస్వామి తో పాపం పంచి, పిల్లలతో పాపం పెంచాము, ప్రపంచం పైకి వదిలాము బరితెగించిన పశువులుగా, ఆ పాపాల చక్ర వడ్డీ మాదే.

మా ఇంటి, మానసిక బలహీన, బద్దకపు నిర్లక్ష్యపు, దున్నలు/ పందులు/ దొంగలు, ఒక చిన్న సైజు స్వార్ధ జంతుశాల సర్కస్ అనవచ్చు, రాతి బండలు, నిర్దయ క్రూర మ్రుగాలు అనవచ్చునేమో, ఎవరి మాట ఎవరు వినరు, ఎవరూ ఎవరినీ లెక్క చేయరు, ఎవరి గురించి పట్టించుకోరు, గౌరవం మర్యాద అంటే తెలీదు. నోట్ల కట్టలతో భోజనం, రోగాలతో సహజీవనం, పతనం అని తెలిసినా, తలవంచి చేయిచాచి అప్పులతో ఆస్తులు పెంచడం మానము.

డబ్బు కోసం ఎంత గడ్డి అయినా, ఎన్ని మోసాలు ద్రోహాలు అయినా రెడీ. నోరు తెరిస్తే అబద్దం, స్తిర మాట ఉండదు. తొక్కలో మానవత్వం లేని సొంత ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల సేవ గురించి సొంత పిల్లల సంస్కార పెంపకం గురించి నోరెత్తని సర్కిల్ ఒకటి. రేపు ఆదాయం/ ఆరోగ్యం పోతే, వారూ పలకరు. నక్క పులి పాము కే మా మూర్ఖ మంద సమర్ధన.

ఊరక వచ్చిన సొమ్ముతో, సూర్య దేవుని కూడా లెక్క చేయక, ఉదయం 6-7 దాకా లెగవరు ఎంత తిట్టినా/ చెప్పినా, గంట నటన పూజ తర్వాత, రోజుకు 6 రోగ బిళ్ళలు మింగుతున్నా, ఆసుపత్రుల చుట్టూ గస్తి తిరుగుతూ ఆస్తి కరిగిస్తున్నా, శరీరం కుంగి క్రుసించి కుంగిపోతున్నా, మొఖములో చావు కళ తాండవం చేస్తూ కనపడుతున్నా, సిగ్గు బుద్ది జ్ఞానం రాదు. అంతా కపటం నటన 2 నాలకలు. పుట్టుకతో వచ్చింది, పుడకలతో పోదు అంటే ఇదేనేమో.

గుడిలో నైవేద్యాలు, నూనెలు, యాత్రల, యాగాల తో ఎంత నటిస్తున్నా, వీరి మానసిక మురికి గబ్బు బలహీనత 20-40 ఏళ్ళుగా వదలలేదు. భగవద్గీత చదువుతారు, కానీ ఆచరించరు. శ్రీరామ నవమి, క్రిష్ణాష్టమి చేస్తారు, కానీ వారి గుణాలు, వారి స్తిరత్వం, ఒక్కటీ అబ్బ లేదు, కుటుంబములో ఒకరికైనా.

త్వరలో మా వల్ల కాకపోతే, మీకే అప్పగిస్తా, వరసబెట్టి అందరికీ ఫోన్ క్లాసులు పీకండి గంటపైన, కూర్చొబెట్టి వినిపిస్తా, మేమేమి అనుకోము. మీ ఇష్టం 4 బాదినా, బళ్ళో పంతులుగా. ఫీజ్ కావాలన్నా చెప్పండి, ఎంతైనా ఇస్తాము. హైదరాబాద్ లో మానసిక రోగులకు, బద్దకస్తులకు, కౌన్సిలింగ్ అని లక్షల ఫీజ్, ముక్కుపిండి వసూల్ చేస్తున్నారు. వాళ్ళ బొంద, మీలాగా కూడా చెప్పరు, సేవ చేయరు. ఆ గుళ్ళు పూజలు అని వ్రుధా ఖర్చు కన్నా, మీకు ఇచ్చేది తక్కువే కదా.

మీరు చెప్పినది కరెక్ట్, దేవుడు రాయిలో లేడు, మనలో ఉండాలి అని. మీవి అన్ని చెప్పి, చదివిస్తున్నా. అందరిలో 3 గుణాలు ఉన్నా, ఎవరు వేటిని పెంచుకుంటారు, అన్న వారి కుటుంబ సంస్కారాన్ని బట్టి, సత్వ రజో తమో గుణాలు పెరుగుతాయి.

మొన్న చదివినప్పుడు, కనీసం 5 గంటలు నిద్ర ఎలా సరిపోతుంది, పడుకోవాలి కదా 7 దాకా అని అనుకున్నా. కానీ మీ మాటలు విన్నాక, నిస్వార్ధ కర్తవ్యం నియమ పాలన మాత్రమే ముఖ్యం. నిద్ర తర్వాత, ప్రజా క్షేమం ముఖ్యం. కేవలం ఆధ్యాత్మికత, ఆరోగ్యం కే వర్తిస్తుంది. ఇది ఉద్యోగం/వ్యాపారం ధనం కోసం ఆశతో చేసే వారికి వర్తించదు.

ఆ మాత్రం కష్టం ఓర్చుకోకపోతే, జీవిత సమస్యలు ఎలా ఓర్చుకుంటారు? భాగస్వామి పిల్లలను, సంస్కారం నీతి నియమాలు గా, ఎలా నడుపుతారు? పిల్లలు బయట చెడిపోకుండా ఉండాలి అంటే, ఈ మాత్రం సాధన మానసిక బలం ఉండాలి.

మీకు చెడిపోవడానికి అన్ని దోవలు హంగులు అవకాశాలు ఉన్నా, మీరు స్తిరంగా 78+ ఏళ్ళ అమ్మకు చేతి కర్రలా నిలబడటం, చేయి పట్టుకుని నడిపించడం, అదీ రోజూ మైలు 10 ఏళ్ళు, వామ్మో, మా లాంటి వారికి చేతకాదు, అసంభవం.

మా వర్గం, పక్క వర్గం లో, 10 ఏళ్ళుగా వెతుకుతున్నా మీకు పోటీగా, మీకు సమానమైన వాడిని పట్టుకుని చూపాలి అని. మా వారికి కోట్లు ఉన్నాయి, కంపెనీలు, మంది మార్బలం, ఆడంబరాలు సోకులు పతనాలు, వెన్నుపోటు గుండెపోటు, పనికిమాలిన రాక్షస అవలక్షణాలు, అన్ని ఉన్నాయి. 100 మందిని కొంటారు కొడతారు పతనం చేస్తారు, కానీ సొంత ముదుసలి వారి సేవ కూడా ఉచితముగా చేయరు. ముదుసలి తనములో వెన్నుపోటు గుండెపోటు మాకు, అలాగే మా పిల్లలకు తప్పవు.

బుద్ది జ్ఞానం క్రుతజ్ఞత విశ్వసనీయత త్యాగం సంస్కారం మాత్రం, మా మంద లో లేవు. తల్లి తండ్రి చేయి పట్టుకుని, కనీసం 1 మైలు, కనీసం 6 నెలలు/ వారాలు/ రోజులు నడిపిన వారు లేరు, 10 ఏళ్ళు సంగతి దేవుడెరుగు. ఇక 50 వారాల 108 ప్రదక్షిణలు లేవు. కనీసం ఏడాది శాఖాహారం లేదు. చాప నిద్ర అసలు మా వలన కాదు. అసలు మీ శనివార లిస్ట్ లో ఏ ఒకటి మా వలన కాదు, మేకప్పు లేకుండా, మాకు మేమే చూసుకోలేము, తూ పాడు బతుకు.

మీరు చెప్పినట్లు గా, రామన్న రాజన్న, జయలలితమ్మ, సావిత్రమ్మ శ్రీదేవమ్మ, కోడెలయ్య జీవిత చివరి సందేశాలను చూసినా, డబ్బు అధికారం కుటుంబం స్నేహితం మన ప్రాణాలు కాపాడవని, మాలాంటి వారికి బుద్ది జ్ఞానం రావు, తాము పతనం అయినదాకా. వచ్చే జన్మ ఇంకా నరకం.

మమ్మల్ని పని మనిషిని పెట్టి, లక్షలు కట్టి, ఇంట్లో లేదా ఆశ్రమంలో వదులు తారు అంట. వాళ్ళు మాత్రం సేవ చెయ్యరు అంట, దబ్బు కట్టడమే గొప్ప అంట మా మొఖాలకు, అదే నేటి పతన ట్రెండ్ అంట. ఒంటరి పిల్లలది అదే కూత, పెళ్ళైన శారీరక సుఖ దాసులకు అదే మంట. మేము నేర్పిన, ధనం ముఖ్యం సంస్కారం కన్నా అన్న పదాలను, మాకే చెప్పు తీసుకుని కొట్టి చూపుతున్నారు, మా బడుద్దాయిలు, ఆడ మగ తేడా లేకుండా. మా ఖర్మ, మేమే చెప్పుతో కొట్టుకోవాలి.

సరదాకు ఒక్క మాట అడుగుతా, దేవుడు మీ ఇంటికి వచ్చినా కూడా, ఉదయం 5 కే లేపేటట్లు ఉన్నారు? పాపం దేవుడుని కూడా వదలరా? తప్పు మాట్లాడితే, మన్నించండి, జవాబు చెప్పకపోయినా పర్లేదు.

ఈ మా ఘాటు కడుపు మంట, చేతగాని సొంత మనుషులనే మార్చలేని కన్నీటి మాటలు, అందరికీ పంపండి కధలాగా, నష్టం లేదు. వారికి భవిష్యత్ పతనం అర్ధం కావాలి. ధనం ఆస్తి అధికారం అందం బలగం, పంచభూతాల నుంచి సొంత పిల్లల/ భాగస్వామి/ బంధువుల/ స్నేహితుల శిక్ష/ వెన్నుపోటు/గుండెపోటు ల నుంచి కాపాడదు.

*జవాబు* - మన గురించి మనం తెలుసుకోవాలి, అన్న దానిని బాగా వంటబట్టించుకున్నారు. మీరే నిజమైన, నమ్మకమైన దైవ భక్తుడు. తప్పులు అందరమూ చేస్తాము, కానీ తప్పు అని ఒప్పుకుని, మారే ప్రయత్నం చేయడానికి ఎంతో గుండె ధైర్యం మానసిక బలం కావాలి.

ఇప్పటికీ బ్రమ్హం గారు, వేమన, రాఘవేంద్ర స్వామి ఫోటోలు లేని ఇల్లు ఉండి, ఇతర మత బాబాయిల ఫోటొలతో ఇల్లు నడిపే దౌర్భాగ్యులు మన చుట్టూ ఉన్నారు. వారి కుటుంబ పతనం తప్పదు అని తెలిసినా, మానసిక బలహీనతతో, నిశ్చేష్టులుగా ఉంటున్నారు, భవిష్యత్ కాల శిక్షణ కోసం.

20 ఏళ్ళుగా పూజలు అని నటించే వారికి కూడా, ఈ ధైర్యం లేదు, తమ సొంత తప్పులను ఒప్పుకోవడానికి. రామన్న కూడా, ఈ రోజున, తన పిల్లలే తనకు వెన్నుపోటు పొడిచారు అని సత్యాన్ని ఒప్పుకోలేరు, వారి పిల్లలు ఒప్పుకోరు. మీరెవరు అసలు మీస్తాయి ఏమిటి, మాలాగా మెంటల్ సర్టిఫికేట్ ఉందా అంటారు. అదే మాయ, అదే మానసిక బలహీనత, అదే మరుజన్మ, ఎక్కువ కష్టాలు.

20 ఏళ్ళు గా ఎంతో మందికి ఎన్నో గంటలు మానసిక ధైర్యం ఇచ్చాము, వాటికి ఫీజ్ లు తీసుకుంటే, ఇప్పటికి 3 ఇళ్ళు వచ్చేయి. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడు పడవోయ్ అన్నది ఆచరణలో చూపాము. మీ వాళ్ళకు అయినా, ఉచితమే కౌన్సిలింగ్.

మీకు తెలుసు కదా, మీ నుంచి రూపాయి తీసుకోవాలి అన్నా, మీరు అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులు కాదు అని, మీకు మీరే నిరూపించాలి. మీ జవాబు లోనే, అరిషడ్వర్గ దాసులు అని మీరే చెప్పారు ఒప్పుకున్నారు కాబట్టి, ఒక్క పైసా కూడా వద్దు. తీసుకుంటే, ఆ పాపాల లో మేము పాలు పంచుకోవాలి, మరలా వాటికోసం ఇంకా ఎక్కువ సాధనలు చెయ్యాలి, వచ్చే జన్మలో కూడా.

దేవుడు అయినా దెయ్యము అయినా, నీతి నియమము ఒకటే. దెయ్యము అయినా 5 కే లెగవాలి. అదేమిటీ మేము దెయ్యాలము, రాక్షస జాతి మాకు నియమాలు ఉండవు అంటే, మన జవాబు ఇది.

ఇప్పటికైనా, ఆ దౌర్భాగ్య దెయ్యం రూపం అశాంతి పోయి, ఉత్తమ జన్మ తో మనశ్శాంతి రావాలి అంటే, మేము చెప్పింది చెయ్యాలి అంతే. లేదంటే, ఇంటి బయట చెట్టు పై ఉండు, ఇంక దెయ్యం గా ఉంటావు, ఎల్ల కాలం, ఎవరికీ పనికి రాకుండా. అంతే, ఏది మంచో చెడో నీకు, నువ్వే తేల్చుకో. అది సాత్విక దెయ్యం కాబట్టే మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మన మాట విని, నీతి నియమాలు పాటిస్తుంది. రజో, తమో గుణ దెయ్యాలు మన దరిదాపులకు కూడా రావు, వీడితో తలనొప్పి ఎందుకు, వీడు మనకే దెయ్యము అంటే దెయ్యాలకే దెయ్యము అవుతాడు, టైం వేస్ట్ అని.

ఇంక దేవుడు అయినా 5 కు లెగవాల్సిందే. ఇదెందిరా, తిరుపతిలో నిద్ర లేక నీ దగ్గరకు వస్తే, నన్ను ప్రశాంతముగా పడుకో నీయవా అంటే?

సూర్యనారాయణుడు మీ స్వరూపమే. మీరు పెట్టిన నియమాలు, శాస్త్ర సాంప్రదాయం ప్రకారం, ఆయనను గౌరవించాలి. ఆయన రాకముందే 5 కి లెగవాలి. మిమ్మల్ని మీరే గౌరవించకపోతే ఎలా, మాకు ఆదర్శముగా ఉండాలి కదా, మంచి తండ్రి లాగా? లేకపోతే రోగాలకు నిలయం. దేవుడి కే సుస్తి చేస్తే, ఇంక ప్రపంచాలు అల్లాడతాయి కదా?

దేవుడిని మరి నేను కూడా లెగవాలి అని, శాస్త్ర ప్రమాణం ఉందా అంటారు? దేవుడు కపట నటన సూత్రధారి, మన జ్ఞానాన్ని సున్నితముగా పరీక్ష చేస్తారు.

శాస్త్ర ప్రమాణం ఉంది స్వామి. కారడవులలో రాముడు గా తిరుగుతున్నప్పుడు, కటిక నేల పై పడుకున్నప్పుడు, తెల్లవారు ఝామున, విశ్వామిత్రుడు నిద్ర లేపారు - కౌసల్యా సుప్రజా రామా, లెగువు, తెల్లారబోతున్నది, నీ కర్తవవ్యాన్ని పూర్తి చేయాలి అని. గుర్తు లేదా స్వామి? ఈనాడు మా ఇంట్లో కనీసం చాపైనా ఉంది, దానికన్నా ఇది సుఖం. మరి అప్పుడే తెల్లవారుఝామున లెగిచినప్పుడు, ఇప్పుడు లెగవలేరా?

ఓరి దేవుడా, నీలాంటి వారితో మాట్లాడి గెలవడం కష్టం. మరి నేను దేవుడిని కదా, ఎవరికి పూజ చేయాలో అదీ నువ్వే చెప్పు.

రాముడు, క్రిష్ణుడు కూడా, శివయ్యకు పూజ చేసారు. మీరు ముగ్గురూ ఒకటే, కాబట్టి ఈ రోజు సోమవారం కాబట్టి శివయ్యకే ఈరోజు పూజ చేద్దాము.

సరే నువ్వే మంత్రాలు చదువు, పద్యాలు పాటలు పాడు, నేను వింటాను గమ్ముగా ధ్యానం తో. సరే స్వామి, అని మధ్యలో, ఈయనకు కూడా మానసిక పూలు చల్లుతాము. దైవ పూజకు రూపాయ ఖర్చు లేదు, మానసిక పూజ చాలు.

1 గంట తర్వాత, ఒరే ఎందిరా ఇంత సేపు గది దద్దరిల్లింది, కంచు కంఠముతో నాభి నుంచి గొంతు, బాగానే నేర్చావే. ఇంతకీ ఇవన్నీ పాడావు సరే గానీ, ఏమీ ఫలము/ కోరికా అడగవే, ఏనాడూ. సతి, సంతానం, కార్లు మేడలు అధికారం, సుఖాలు బోఘాలు, ఏమీ వద్దా? కనీసం తెలుగు సంఘం లో పదవి అయినా వద్దా? కోరుకో ఏదైనా ఇస్తా.

మాయలో ఇరుక్కుని, చివరికి వాటి అన్నిటితో, గుండెపోటు వెన్నుపోటు నే కదా స్వామి. ఏమీ వద్దు, నలుగురికి సేవ చేసే, మానసిక బలం నేర్పే, జ్ఞానం పట్టుదల ఇచ్చావు, అది చాలు. ఇది ఎవరూ దొంగిలించలేరు, ఇది ఏనాటికీ తరగదు. నా సేవ పూర్తికాగానే, ఆ ప్రజ్ఞను మీరు సునాయాసం గా తీసివేస్తారు. మరు ఉత్తమ జన్మకు దాచి ఉంచుతారు.

మరి నేను తీసుకుని వెళితే, వస్తావా పై లోకాలకు, ఈ క్షణమే? లేదు స్వామి, అమ్మను కూడా తీసుకుని వెళ్ళాలి చెయ్యి పట్టుకుని, పైకి కూడా. మీరు అవును అంటే, తప్పకుండా ఈ క్షణమే వెళదాము. మరి నీ సంపద, ఆ 4 రూపాయలు? వస్తా ఉత్త చేతులు తో వచ్చా, పోతా ఉత్త చేతులు పోతా, నాది అన్నది ఏమి ఉంది ఈ బ్రమల ప్రపంచములో, అన్ని తెలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు స్వామి.

ఒరేయ్, ఎక్కడ నేర్చావు రా ఈ మాటలు, అఖరికి దేవుడు అని భయం లేకుండా, తెలివిగా సరిగ్గా సంస్కారముగా నా మాటకు కూడా ప్రతి మాట చెపుతున్నావు. ఇద్దరి రాతలు వేరు, ఆమెకు ఇంకా సాధన కావాలి. ఇప్పటికే చాలా మార్చావు. ఇంకా సాగాలి సాధన.

తండ్రి దగ్గర బిడ్డకు భయమెందుకు, వేదాంత మే కదా నేను చెప్పింది. మా తెలుగు గురువులు బ్రమ్మం గారు, వేమన, రాఘవేంద్ర అదే చెప్పారు, ఆత్మ జ్ఞానం. అలా అయితే రాలేను తండ్రి మన్నించాలి, ఆమె తుది శ్వాస వరకు సేవ చేసి, ఆమె వెళ్ళిన తర్వాతనే వస్తాను.

అంతేనంట్రా? నా మాట వినవా? దేవుడిని నేను పిలిచినా రావా, నీకు మోక్షం వద్దా?

స్వామీ, మాత్రు దేవోభవా అంటూ సేవ కన్న, ఇంకా వేరే మోక్షం ఏముంది, ఎక్కడ ఉన్నది?

సరెరా, నీ ఇష్టం, ఆమె తర్వాతనే రా, నీ శ్వాస నీ చేతిలో నే ఉన్నది. మీ బ్రహ్మmu గారే చూపించారు, చక్రాల సాధన. మిగతా రజో తమో గుణాల వారికి కూడా, మానసిక ధైర్యం ఇస్తున్నావు కాబట్టి, చేసేది ఏమీ లేక అయిష్టముగా వెళుతున్నా.

నీ కఠిన కరమాల ఎన్నో వారాల 108 ప్రదక్షిణాలకు నచ్చే, ఏలినాటి శని సమయములో, అమ్మ కాలు జారి నేలమీద పడుతున్నా, నిన్ను వెనక్కి తిప్పి చూపించి, పరుగులు తీయించి, నీ చేతులే అమ్మ తలకు అడ్డుపెట్టి కాపాడినా. ఇప్పుడు అర్ధం అయ్యిందా క్రిష్ణ చైతన్యమే పంచభూతాలలో, అందరికీ తోడుగా నీడగా ఉంటున్నది.

3+ ఏళ్ళు పైగా రూపాయి ఆదాయం లేకపోయినా, నువ్వు ఎవరి ముందు అప్పు/ తాకట్టు/ అమ్మకం లేకుండా, అమ్మ సౌకర్యాలు కించిత్తు తగ్గకుండా, గర్వముగా ఆ స్తితిని ఎదుర్కొనే అండ నీకు 20 ఏళ్ళు గా ఇచ్చాను.

కరోనా మీ ఇద్దరినీ తాకకుండా, అలాగే తాకినా క్షణం నిలవనీయకుండా పారిపోయేలా చేసాను, మీతో 20+ పైగా మూలికలతో సొంత ఆయుర్వేదం అలవాటు చేసి. అమ్మ బరువు బీపీ షుగరు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా, అర టాబ్లెట్ దగ్గర ఆపాను. ఇవన్నీ నీకు మానసిక బలం పెంచి, నీతోనే చేపించాను. నాకు, మంచి మనసు పని ముట్టుగా దొరికి నందుకు, సంతోషపడుతున్నాను. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ వలన నష్టాలను వివరిస్తూ, దానిని ఎదుర్కొనే మార్గాలను ఆచరణలో చేసి చూపిస్తూ, నా బంగారు బిడ్డవు అనిపించావు.

భగవద్గీతను చెప్పడమే కాదు, ఆచరణలో నిత్యం సజీవ గురువు సేవ గా 10 ఏళ్ళు చేసి చూపించావు, అందరూ ఆశ్చర్యపోయేలా. నీకు నేను అండ, నిన్ను నమ్మిన వారికీ, నీతో నడిచే వారికి, నేనూ అండనే. ఎందుకంటే నువ్వు ఆదరించావు ఎవరినైనా అంటే, వాడు సామాన్యుడు కాదు, సత్వ గుణం వైపు నడిచే స్తిరబుద్ది కలవాడు, కష్టాలకు కన్నీళ్ళకు నీతి నియమాలు తప్పనివాడు.

సరే చాలా సమయం అయ్యింది, మీ అమ్మ లక్ష్మీ దేవి ఎదురు చూస్తున్నది. ఇప్పటి దాకా భూదేవితో ఉన్నాను అని చెపుతా, మీతో పాటుగా చాప నిద్ర అంటే అదేగా. కానీ రేపు ఆమె కూడా చెపుతుంది, నా దగ్గరకూ రాలేదు అని. మా బాధలు ఎవరి చెప్పాలి.

మరలా ఆనాడు వైకుంఠము నుంచి అలిగి వెళ్ళినట్లు వెళ్ళిందంటే, నానా తిప్పలు పడి, ఇంకో తిరుమల వెతుక్కోవాలి. శ్రీదేవి లేదు అంటే, తిరుమల కళ ఉండదు, కలెక్షన్ ఉండదు, అప్పు తీరదు. వస్తా రా మరి.

ధన్యవాదములు తండ్రి, ఈ ప్రాపంచిక బీద వారి దగ్గరకు వచ్చి మాతో నే చాపపై శయనించినందుకు. అమ్మతో సమస్య ఉంటే చెప్పండి, అమ్మకు కూడా ఇంకో పద్యం పాట పాడి శాంతింప చేస్తాను, శ్రీసూక్తం దుర్గాసూక్తం కూడా వచ్చు, పాడి వినిపించనా. అష్టలక్ష్మి పాటకూడా వచ్చు.

ఒరే బాబూ ఉండరా నాయనా, ఇందాక గంట చదివి ఆ శివయ్యను నన్ను మురిపించావు, మరలా లక్షీ స్తొత్రాలు మొదలు పెడితే ఇప్పుడే పూర్తి కావు. నీతోనే సరిపోతే, ఇంకా లోకాలను పాలించాలి కదా, వస్తాను. అమ్మ జాగ్రత్తలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,602; 104 తత్వాలు (Tatvaalu) and views 239,952
Dt : 29-May-2024, Upd Dt : 29-May-2024, Category : General
Views : 187 ( + More Social Media views ), Id : 2106 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wakeup , god , 5am , house , spandana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content