Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. A drop of water cannot touch lotus in the water. Rajo, tamo guna moha slaves around us?
షుమారు 7030 అడుగులు వస్తుంది మనము చేస్తున్న 108 ప్రదక్షణాలు ప్రతి వారం, మొత్తము 242 వారాలు, ఉత్త పాదాలు తో సాక్స్ చెప్పులు లేకుండా కొండ రాయి మీద, స్టేటస్ వీడియోలో నేల కూడా చూసారు, 25+ ఏళ్లుగా సుకుమారంగా ఏసీ లో కూర్చుని పనిచేసే మాలాంటి సన్నాసులకు, అలా పాదాలు కాయలు కాచేలా నడవడం, అదీ చలికి ఎండకు వానకు, అదీ మేము ఉన్న చోట ఎంత బద్ధకం నిర్లక్ష్యం ఎంత మత్తు మాయ. ధనం పెడితే, దొరకని పతన దోవ ఏమున్నది ఇక్కడ?
ఉత్త పాదాలతో, గంటా పావు సమయం, ఊళ్ళో గుడిలో మామూలు బండపై తిరిగి చూడు ఎంత కష్టం నో. మానసిక నియంత్రణ అంటే అర్థం అయిందా?
భాగస్వామి ఉన్నోడే, నియంత్రణ లేక బలహీన మనసు తో 2, 3, 4 తో పోతున్నారు. మన చుట్టుపక్కల ఎన్ని అవకాశాలు లేదా కొనుగోలుకు? అది నియంత్రణ.
డాక్టర్ చెప్పారు అని, 1 2 3 4 పెగ్గులు తాగే బడుద్దాయిలు ఉన్నారు. పొగ తాగుతారు, విందులు చిందులు చేస్తారు. వాటి జోలికి వెళ్ళకపోవడం, అవకాశం ఉన్నా, అదీ నియంత్రణ.
10+ ఏళ్లుగా, చేయి పట్టుకొనిదే అసలు బయట నడవలేని తల్లి ని మైలు నడిపిన వాడు, ప్రపంచ ఉత్తమ వైద్యం, అలాగే సొంత ఆయుర్వేదం తో ఉన్నారా, అదీ 3+ ఏళ్లుగా ఆదాయం లేకపోయినా, ఒక్క సౌకర్యం తగ్గకుండా? అదీ నియంత్రణ.
చూసారు కదా నిన్న, దిల్ రాజు అలాగే హీరోయిన్ అందరూ ఉన్నా కూడా, అలాగే గతం లో ఆలీ, అనసూయ, బాలయ్య, నాయకులు, మంత్రులు, ఇంకా ఎందరో వచ్చినా కూడా, వారితో ఒక్క ఫోటో దిగలేదు, విలేఖరి గా హక్కు అందుబాటులో ఉన్నా. రేపు మీ పిల్లలు సినిమాలో ఉన్నారు అంటే, మనము ప్రచారం చెయ్యాలి కదా, సినిమా మనకు వంటబట్టకపోయినా, విలేఖరిగా.
తామరాకు ను నీటి బొట్టు తాకలేదు నీళ్లు లో ఉన్నా కూడా. మన చుట్టూ రజో, తమో గుణ మోహ దాసులు, ప్రాపంచిక మోహాలు, నక్క పులి పాము గుణ సంపన్నులు, ఉన్నా కూడా, వారిని ఆవుగా సత్వ గుణం వైపు మారుస్తామేమో గానీ, పంచభూతాల శిక్షణ నుంచి తప్పించ గలమేమో గానీ, మనము మాత్రం అటువైపు పోలేదు 20 ఏళ్ళుగా ఆ దేవుని దయతో, మీలాంటి మంచి వారి అండతో.
మగాడు, స్ధితప్రజ్ణుడు, బ్రాహ్మణోత్తముడు, దైవపుత్రుడు, పంచభూత శిష్యుడు అంటే, సజీవ గురువు సేవకుడు అంటే, సాధకుడు అంటే, కోతి లాంటి మనసు ను బుజ్జగించి సాధన నేర్పి మంచి దారిలోకి తెచ్చి నియంత్రణ చేసి, దాని చేతనే ఆటలు ఆడించేవాడు.
కష్టాలు ను నవ్వుతూ ఆస్వాదించేవాడు. కొండంత సంపాదన కరిగిపోతున్నా, మంచి కార్యం ఆపని వాడు, 10 ఏళ్ళుగా 78+ ఏళ్ళ ముదుసలి తల్లికి సేవలు తరగనివ్వని వాడు. ఎవరు ఉన్నారు మన చుట్టుపక్కల, చూపించు?
ఏ యాగాలు, యాత్రలు, పూజలు అవసరము లేదు, ఇలా మన మనసునే దైవానికి నైవేద్యం గా అర్పిస్తే, అదే భగవద్గీత చెప్పింది.
ప్రపంచంతో నడువు, ప్రపంచం లో ఉండు, నష్టం లేదు, కానీ మాయా ప్రపంచాన్ని నీలోకి అంటే నీ మనసులోకి రానీయకు, దానికి బానిస కాకు, కేవలం సాక్షీభూతుడు గా ఉండు. ఏదీ నాది కాదు, ఇది అంతా మాయ, నేను ఇక్కడ శాశ్వతం కాదు, నేను దేనికీ కారణం/ కర్త కాకూడదు, అంతా పరమాత్మ లీల, మనము కేవలం పనిముట్టు.
అందుకే మన ఫోటో గానీ, పేరు గానీ ఉండదు. కేవలం దోవ చూపు, ఫలితం నాకు వదిలేయ్, వారి రాత వారిని ముందుకు తీసుకువెళుతుంది.
చూస్తున్నారు కదా, కేవలం ఒక వ్యక్తి సామాన్యుడు మధ్యతరగతి వ్యక్తి ఎన్ని పనులు చేస్తున్నారో, శనివారం లిస్ట్ లో.
ఇవన్నీ గొప్పలకు కాదు చెపుతున్నది, మా ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు అని మీరు జవాబు ఆత్మజ్ఞానం తో చెప్పాలి లేదా సాధన మొదలు పెట్టాలి అని, ఆరోగ్యం గా, మానసిక బలం గా ఉండాలని, చిత్తశుద్దితో దైవ పూజ చేయాలని, మీ పిల్లలు మిమ్మల్ని ముదుసలి తనములో ఇంట్లో దేవతలుగా కొలవాలని సదుద్దేశము తో మాత్రమే.
90 శాతం, మనసు కు, ఆశలకు లొంగి, వారే తైతక్కలాడతారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలుగా, సొంత కుటుంబం ను, చుట్టూ సమాజం ను నాశనం చేస్తున్నారు. మరలా చివరకు మా పిల్లలు ఒంటరిగా ఇంట్లో లేదా ఆశ్రమములో వదిలారు అని, వారే లోలోన కుళ్ళిపోతున్నారు, జీవితం వ్రుధా అయినది అని.
ఆ స్తిర సత్వ గుణము నకే, ఆనాటి మానవత్వం ఉన్న రాజులు తలవంచే వారు, నమస్కరించేవారు, మమ్మల్ని మంచి దోవలో నిత్యం నడిపించమని, మా అహంకారాన్ని అణచమని.
మనము దుష్టులు అనుకునే కౌరవులు కూడా, దండం పెట్టి, విదురుని పక్కన పెట్టుకున్నారు, అన్ని సౌకర్యాలు ఇచ్చి, ఆయన మాటలు పాటించకున్నా కూడా. కానీ ఆయన విడిగా, చిన్న ఇంట్లో నే ఉన్నారు.
ధర్మ మూర్తి అయిన, ధర్మ రాజు కూడా, జూదం ఆడే బలహీనత ఉండి, క్రిష్ణునే తమ సలహాదారులుగా పెట్టుకున్నారు. కానీ జూదం కు వెళ్ళేది, క్రిష్ణుని అనుమతి తీసుకుని వెళ్ళలేదు. అంటే ధర్మరాజు కూడా, అరిషడ్వర్గం కు లోను అయ్యాడు, ఫలితం అనుభవించాడు. జాగ్రత్తలు మిత్రమా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,633; 104 తత్వాలు (Tatvaalu) and views 239,953 Dt : 10-Jun-2024, Upd Dt : 10-Jun-2024, Category : General
Views : 147
( + More Social Media views ), Id : 2110 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
drop ,
water ,
touch ,
lotus ,
water ,
Rajo ,
tamo ,
guna ,
moha ,
slaves Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments