పాటతో పరమార్ధం- ఈ అనంత కాల గమనంలో - సంధ్య - సుజాత, చంద్రమోహన్, శ్రీధర్, గీత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,923,281; 104 తత్వాలు (Tatvaalu) and views 229,693.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ee anantha kala gamanamlo - Sandhya - Sujatha, Chandra Mohan, Sridhar, Geetha

ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో, ఈ నాటక కపట ప్రపంచములో, అందరు నీవారూ లాగే బ్రమలు లో అనిపిస్తుంది, కానీ ఎవరూ నీ వారు కాదు, నీకు తోడుగా రాలేదు తర్వాత కూడా రారు, చివరకు మిగిలేదెవరు లేరు అంటే నమ్మరు కదూ? రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, ఇంకా మన ఇళ్ళలో ఎందరో . . .

కొంతమంది ఇతరుల కోసమే జీవిస్తారు. అలాంటి బాధ్యత ముందు చూపు తో, పరోపకారం చేసే, అన్న అమ్మ నాన్న అక్క లాంటి పెద్దలు, చాలా మంది మన ఇళ్ళ లో ఉంటారు. వీరు అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు బానిసలు కారు. కొవ్వొత్తిలా ఇతరులకు వెలుగు ను ఇస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తూ, తామేమి ఆశించక, తాము మైనపు ముద్దలా కరిగిపోతారు, కాల గర్భం లో కలసి పోతారు.

కానీ కొంత మందికి ఆశ ఉంటుంది, తమ తమ్ముళ్ళు చెల్లెళ్ళు పిల్లలు, తమకు అండగా నిలబడతారు అని. కానీ వారు ఒంటరిగా విడేచిసిన తర్వాత, నమ్మక ద్రోహం చేసిన తర్వాత, గతాన్ని ఆనాటి మొహాన్ని తలచుకుంటూ, మనందరము ఈ పాట పాడుకోవాలి. మరి మీరు గొంతు సవరిస్తారు కదూ ఆరోగ్యం కోసం?

ఇందులో తమ్ముడు అన్న పదము తో పాడితే అక్క బాధ అవుతుంది, పిల్లలూ అని పాడితే తల్లి దండ్రుల మనోవేదన అద్దం పడుతుంది. చూడంది ప్రతి చరణములో ఎంత అర్ధం ఉందో - అందరి నొసలు ఒకటే కానీ అందలి రాతలు వేరు, కొందరి బ్రతుకులు అందరికోసమని, రాసిని వాడికే తెలియాలి, కధ ముగింపు, వాడే తేల్చాలి అంటాము.

కానీ మన ముగింపు మనమే రాసుకుంటాము అని మొదటినుంచి తెలిసినవాడే, ప్రాపంచిక మోహాలకు లొంగక సాక్షీభూతముగా నిశ్చలముగా ఉన్నవాడే, నిజమైన ఆత్మ జ్ఞాని, అతనిని విడువద్దు, ముక్తికి ద్వారం వదలద్దు.

ఈ అనంత కాల గమనంలో.., ఈ రవ్వంత జీవన పయనంలో..
అందరు నీవారూ...2
చివరకు మిగిలేదెవరు లే..రు.
ఈ అనంత కాల గమనంలో... ఓ...

1. నీ కడుపున చీకటి దాచుకొని.., కన్నీరే చమురుగ చేసికొని.. 2
నీ కొర్కెలు నిలువున కాల్చుకొని ...
వెలుగును పంచావందరికీ ...
నీ వేదన తెలిసిందెవ్వరికి.. 2 ||ఈ అనంత కాల||

2. చేతికి తమ్ముడు అందోస్తాడని.., చెట్టుకు తానొక వేరౌతాడని.. 2
చేసిన త్యాగం చెయిదాటిందా..
రెక్కలు వస్తే అంతేనమ్మా..
నీ రెక్కలే నీకు, శాశ్వతమమ్మా..
నీ రెక్కలే నీకు, శాశ్వతమమ్మా.. ||ఈ అనంత కాల||

3. నీ అలసట తీర్చే ఓడి ఒకటుందని.., నీ అనురాగానికి గుడి తాననుకొని.. 2
వేచావమ్మా ఆశలు దాచుకొని..
దేవుడు తలుపులు మూసడా...అ....
దేవుడు తలుపులు మూసడా...
నీ దీపం నేటితో కొండెక్కిందా.. ||ఈ అనంత కాల||

4. అందరి నొసలు ఒకటేనమ్మా.., అందలి రాతలు వేరౌనమ్మా... 2
కొందరి బ్రతుకులు అందరికోసమని..
రాసిని వాడికే తెలియాలి...
కధ ముగింపు, వాడే తేల్చాలి...
కధ ముగింపు, వాడే తేల్చాలి... ||ఈ అనంత కాల||

EE Anantha Kala Gamanam lo - SP.Balu
సంధ్య (1983) చంద్రమోహన్, సుజాత, శ్రీధర్, గీత
బాలు, చక్రవర్తి, ఆత్రేయ
Sandhya - Sujatha, Chandra Mohan, Sridhar, Geetha  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,923,281; 104 తత్వాలు (Tatvaalu) and views 229,693
Dt : 24-May-2023, Upd Dt : 24-May-2023, Category : Songs
Views : 511 ( + More Social Media views ), Id : 1761 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : anantha , kala , gamanamlo , Sandhya , Sujatha , Chandra , Mohan , Sridhar , Geetha , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content