సొంత లాభం కొంత మానుకుని, పొరుగు వారికి తోడ్పడవోయ్ అన్నారు పెద్దలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,106,045; 104 తత్వాలు (Tatvaalu) and views 238,259.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి తమ్ముడు గా లేదా తెలిసిన వాడిలా, అద్దెకు ఉండే ఓ 60 ఏళ్ల అక్క కోసం లేదా మొన్న చెత్త తీయించడం కోసం, ఎంత మంది తో మాట్లాడానో, ఫోన్ లేదా వాట్సప్ లో, రాత్రి మా టైంలో 11 కి, మీ ఆఫీసు టైం కి.

డాక్టరు, వాలంటీర్, ఇంఛార్జి, సెక్రటరీ, ఎండీవో, ఎంపీడీవో గార్లు, ఇంకా ఎందరో. అక్క కు అడగడం రాదు, పక్కన వారు లేదా బంధువులు ఎవరూ పట్టించుకోరు. ఇంకా కావాలంటే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, సీఐ, డిఎస్పీ, ఎంపీ దగ్గరకు వెళతాను, పదిమంది కి మంచి జరుగుతుంది అంటే. ప్రయత్నం చేద్దాం, కొన్ని ఫలితాలు ఉండకపోవచ్చు.

అక్కడ ఉండి, ఆఫీసుల చుట్టూ తిరిగితే నే, పనులు కావు మనకు. నాకు ఓ సర్టిఫికెట్ ఇవ్వకపోతే, ఓ స్నేహితుడు ఇప్పించారు ఒకనాడు.

ఎక్కడో ఉన్న, నన్ను ఇప్పుడు లెక్క చేస్తారా? పోవయ్యా, మా కష్టాలు మాకు ఉన్నాయి, నువ్వు ఎక్కడ తగులుకున్నావు మాకు, హాయిగా తిని పడుకోక అక్కడ అనరా?

బజారు లో అంతమంది మనుషులు ఉంటే, ఒకరు కూడా కనీసము అర్జీ పెట్టలేదు చెత్త గురించి, వాళ్ళ కు లేని బాధ బాధ్యత వాసన, ఎక్కడో ఉన్న నీకెందుకు అంటే, అనరా? మరి మన జవాబు? కానీ మంచి అధికారులు, అలా అనలేదు అనరు, బాధ్యత గా వీలైనంత త్వరగా చేశారు, ధన్యవాదాలు వారికి వారి మంచితనం కు. ఎందుకంటే, మనిషి పని స్థలము స్థానికము కాబట్టి.

కొంతమంది అంటారు కూడా, అనిపించుకోవాలి పడాలి, మన తప్పు లేనప్పుడు బాధ ఏముంది. అన్నారు కూడా, పడ్డాను. కానీ వదలలేదు. కొన్ని పనులు అవుతాయి, కొన్ని కావు, దైవ సంకల్పము.

కానీ మన ప్రయత్నం, దేవుడు గుర్తు పెట్టుకుంటారు. సొంత లాభం కొంత మానుకుని, పొరుగు వారికి తోడ్పడవోయ్ అన్నారు పెద్దలు.

మరువద్దు, మీరు చేయగలిగిన సాయం ఉంటే , నిస్వార్థంగా, బయట వారికి మీ చుట్టూ ఉన్న వారికి చెయ్యండి.



అధికారులు అంతా ఈ నెలలో తెలిసిన వారే. ఇంతకు ముందు ఎవరూ తెలీదు, కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. చూడండి, వాట్సాప్ మాటల వలన మంచి జరిగిందా?

పలుకుబడి వాడలేదు. అసలు మనం ఎక్కడ ఉన్నామో కూడా వారికి తెలీదు, ఎందుకంటే, వాడింది లోకల్ ఫోన్ నంబర్. అందుకే మీకు ఫార్వార్డ్ అని వస్తుంది విదేశం లో ఉంటే.

రోజూ గంట పూజ చేస్తాను వేదం వచ్చు గుడి లో 108 ప్రదక్షిణలు 39 సార్లు చేశాను అంటే చాలదు, దానితో పాటే ఇతరుల సేవ కూడా ఉండాలి.

పైకి పోతే దేవుడు అడిగే మొదటి మాట, నీకు నీ కుటుంబం బంధువులు స్నేహితులు కాకుండా, బయట వారికి, ఏమీ వెనక్కు ఆశించకుండా, ఏమి చేసావు, నీ కున్న శక్తి యుక్తుల తో? మన దగ్గర జవాబు ఉండాలి సుమా.

మీరూ ప్రయత్నం చేయండి, చేసే శక్తి ఉంటే. మానవ సేవయే మాధవ సేవ.



ఏవండీ పూజ ప్రదక్షిణలు గురించి నేను తప్ప పట్టలేదు, వద్దు అనలేదు. దానితో పాటు, మన బంధువులు లేదా కాని వారికి కూడా ఉపయోగపడాలీ, అంతే.

పూజ ప్రదక్షిణలు చేస్తే మనసు నిర్మలమౌతుంది, పక్కన వారి గురించి ఆలోచన వస్తుంది. నేల మీద నడుస్తాం, మనసు అదుపులోకి వస్తుంది. దేవుని వైపు చూపు మరలుతుంది.

అసలు ఎందుకు పుట్టామో తెలుస్తుంది. మన స్వార్థం చూసుకుని తిని తొంగుంటే, ఇక జంతువుల కు మనకు తేడా ఏముంది. కోడి, బర్రె, కాకి, కుక్క, పిల్లుల కు కూడా సంసారాలు పిల్లలు ఉన్నాయి.

మనం ఇంకొకరి గురించి ఆలోచన చేస్తే, ఇంకొకరు లేదా దేవుడు మన గురించి ఆలోచన చేస్తారు.

స్వార్థం తో ఆలోచన సహాయమునకు ఉదాహరణకు చూడండి. మాకు తెలిసిన ఆయన, జనం ధనం ఎగకొట్టారు లక్షల లో కోట్లు లేదా ఇంకా నానుస్తూ ఉన్నారు ఇవ్వకుండా ఏళ్లుగా.

ఇప్పుడు ఆయన ఓ లక్ష పెట్టి అన్నదానం చేశారు. పేపర్లు అన్నిటిలో అన్నదాత చిరంజీవ అని రాశారు అనుకుందాం, లేదా పదిమంది కి సాయం చేశారు అనుకోండి, లేదా పదిమంది కి ధనం అన్నం పెట్టి, వెంట తిప్పుకుంటున్నారు అనుకోండి.

మరి అసలు నిజం ఏమిటి? ఎగకొట్టిన జన ధనం అని గాని, వారి బంధువులు ఎలక్షన్ లో నిలబడతారు అని గానీ, బయటకు రాస్తారా చెపుతారా? చెప్పరు కదా? ఇవి స్వార్థం తో చేసే పనులు. మన చుట్టూ, ముసుగులో లేదా బహిరంగంగా చాలా మంది ఉంటారు. జాగ్రత్తలు, మోహం లో పడితే, వాళ్ళనే దేవుళ్ళు అనుకుంటాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,106,045; 104 తత్వాలు (Tatvaalu) and views 238,259
Dt : 06-Apr-2020, Upd Dt : 06-Apr-2020, Category : General
Views : 1485 ( + More Social Media views ), Id : 475 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : helping others
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content