పాటతో పరమార్ధం - ఎవరేమన్ననూ తోడురాకున్నా- దొంగలకు దొంగ - కృష్ణ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,229; 104 తత్వాలు (Tatvaalu) and views 226,411.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Evaremannanu todurakunna - Dongalaku Donga - Krishna, Jayapradha

మన జీవితములో ఎన్నో సార్లు ఒంటరి పోరాటాలు చెయ్యాలి. అందులో మన తప్పు లేకపోతే, తప్పకుండా దైవం సహాయం చేస్తుంది. కానీ మన తప్పు ఉంటే మాత్రం, మనము శిక్ష అనుభవించాల్సిందే నవ్వుతూ, ప్రాయశ్చిత్తముగా.

3 ఏళ్ళు ఆదాయం లేకుండా, ముదుసలి తల్లి సేవలు తగ్గకుండా ఉండాలి అంటే, ఎంత కష్టము? ఎవరు వచ్చి ఆదుకుంటారు? సొంత కుటుంబానికే మంచి చెప్పుకోవడానికి సమయం లేని రోజులు, స్వయం పతనములో.

ఇంకొకరి గురించి మంచి చెడు ఆలోచన చేసి, చెయ్యి అడ్డు పెట్టే తీరిక అవసరం ఇంకొకరికి ఉంటుందా? స్వార్ధముతో, మనసు కుంచించుకు పోయి, అలా అడ్డు పెట్టకపోతే, రేపు వారి జీవితము అంతే అని వారికి తెలీదా?

రామన్న, రాజన్న, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, కాఫీడేఅయ్య ఇవే కదా మనకు నిరూపించి వెళ్ళింది.

ఎవరేమన్ననూ, తోడురాకున్నా, ఒంటరిగానే, పొరా బాబు పో, నీదారి నీదే, సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా.

అంతే కదా, ఏమిటి ఈ పిచ్చి, హాయిగా మాలాగా 5 చేతులతో సంపాదిస్తూ, అప్పులతో 3 ఇళ్ళు కొనుక్కోక, 203 వారాలు 108 ప్రదక్షిణాలు ఎందుకు, గంట సేపు ఆ చలిలో ఎండలో వానలో, దేవుడు వస్తాడా కష్టాలు తీరుస్తారా, అనే వారు ఉన్నారు.

మన గమ్యం దైవం అయినప్పుడు, ఆయన ఎందుకు రావాలి, ఎందుకు కష్టాలు తీర్చాలి? మనకు మానసిక బలం, నియంత్రణ పెరిగితే చాలదా? ఆ కష్టాన్ని దాటాము కదా?

వడి వడిగా, తడబడకా, చేయాలెన్నో జీవిత మజిలీలు. దూరమెంతైననూ, భారమెంతైనా, ఆగకుండా, పోరా బాబు పో, అని మనము, మన చుట్టూ ఉన్న వారికి ధైర్యం చెపుతున్నాము.

మరి మనకు ఎవరు ధైర్యం చెప్పారు? ఆ దైవమే, స్తిరముగా నీ మంచి దోవలో నువ్వు ఉండు. ఉచితముగా నీ జ్ఞానాన్ని సాధనను, ఆదర్శమూర్తిగా ఆచరిస్తూ ఇతరులకు పంచు. అర్ధం చేసుకున్న వారు, నీ అంటే దైవ దోవలోకి వస్తారు. తమ జీవితం వ్యర్ధం అనుకున్న వారు, వారి దోవలోనే, తమ సొంత వారిచే జ్ఞానం చెప్పబడతారు బలవంతముగా నైనా. ఎవరూ తప్పించుకోలేరు, ఎన్ని జన్మలైనా ఈ సాధన తప్పదు.

మదిలో జ్వాల రగిలిననాడు, లోకం చూపదు, మన పై జాలీ. నీలో నీకు, నమ్మకముంటే, జగతిని నీవే మార్చాలి. అది మారినా మారకపోయినా, మన ప్రయత్నం మనము చెయ్యాలి. మనకు మార్కులు వేసేది ఆ దైవం మాత్రమే. ఎంత బాధైననూ, ఎంత గాధైనను, వింత గాధైన కూడా, కన్నీరేల పోరా బాబు పో, అంటూ మనము అదే దోవలో వెళుతూ, ఇతరులకు దివిటీలము కావాలి.

మరి మీరు మానసిక నియంత్రణ సాధన మొదలు పెడుతారు కదూ? దైవ గుణాలు, మన రాత, మన పాట, మన చేతలలో అంటే సజీవ గురువు సేవ లాంటి పనులతో, స్పష్టముగా అందరికీ కనపడాలి. వీటితో ఎవరి ఇంటికైనా, ఎవరి మనసులోకి అయినా, మనము ధైర్యముగా వెళ్ళగలము.

ఎవరేమన్ననూ., తోడురాకున్నా..., ఒంటరిగానే..., పొరా బాబు పో..
నీదా.రి నీ.దే..,
సాగిపోరా.., నీ గమ్యం చేరుకోరా.. 2

నడిచిన కం.దే పసి పాదాలూ, కోమల మైనా నీ దేహాలూ
వడి వడిగా.. తడబడకా.., చేయాలెన్నో మజిలీలు - 2 లైన్లు మొత్తము
దూరమెంతైననూ..,2 భారమెంతైనా,
ఆగకుండా, పోరా బాబు పో..
నీదారి నీ.దే., సాగిపోరా..
సాగిపోరా.., నీగమ్యం చేరుకోరా

మదిలో జ్వా.లా రగిలిననా.డు, లోకం చూపదు, నీపై జా.లీ
నీలో. నీ.కు, నమ్మకముంటే.., జగతిని నీ.వే. మార్చాలి - 2 లైన్లు మొత్తము
ఎంత బాధైననూ., ఎంత గాధైనను,
వింత గాధైన , కన్నీరేల పోరా బాబు పో
నీదా.రి నీ.దే..,
సాగిపోరా.., నీగమ్యం చేరుకోరా.. 2
-- ఆరుద్ర,జానకి,సత్యం, దొంగలకు దొంగ 1977  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,229; 104 తత్వాలు (Tatvaalu) and views 226,411
Dt : 08-Sep-2023, Upd Dt : 08-Sep-2023, Category : Songs
Views : 235 ( + More Social Media views ), Id : 1911 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Evaremannanu todurakunna , Dongalaku Donga , Krishna , Jayapradha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content