చదువుకుని, వయసు పెరిగినా, బుద్ది పెరగక, తిక్క వాదనలు ఎలా ఉంటాయో చూడండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,374; 104 తత్వాలు (Tatvaalu) and views 226,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండి మూర్ఖపు ఆలోచనలు, అనవసర భయం సందేహం ప్రసంగం ప్రశ్నలు, తప్పు ఒప్పుకోకపోవడం, పదే పదే కాదన్నది వాదించడం, తల నొప్పి పుట్టించడము నకు ఉదాహరణ చూడండి.

** ఎవరైనా మనల్ని గుడిలో పూజారికి మాత్రమే, ఓ కాగితం/ చిత్రము ఇవ్వమన్నారు అనుకోండి, గుర్తు గా ఉంచుకుంటారు అని.

వెంటనే అసందర్భ ప్రశ్న, ఆయన లేకపోతే, అక్కడ ఇంకో 10 మంది పూజారులు ఉంటారు, వారికి ఇచ్చేదా, అంటారు కొందరు.

వారు గుడిలో పూజారులు కాదు, అక్కడ శాశ్వతముగా ప్రతి రోజు ఉండరు, వారు కేవలం దానం తీసుకునే బ్రాహ్మణులు అని తెలిసినా కూడా, అదే వాదన.

ఒక వేళ మీరు తెలివిగా, జీతము తీసుకునేది ఎంత మంది పూజారులు వారిలో అంటే? ఒకరేనని చెప్పి, అతనికే ఇస్తాను అని చెప్పి, మరలా, ఒకవేళ ఆయన లేకపోతే, మిగతా 10 కి అంటారు, అతి తెలివిగా.

మీకు కోపము, తలనొప్పి, విసుగు వచ్చిందా? రాలేదా, తెప్పిస్తా, చూడండి.

ఒకవేళ ఆయన లేకపోతే, పక్కనే ఇల్లు ఉంటుంది, ఇంట్లో వారు ఉంటారు, వారికి ఇవ్వండి, ఆ మాత్రము తెలీదా, అంటారా? అసలు ఈ విషయమే గుర్తు రాలేదు, నిజమే కదా, అని ఒప్పుకుని గమ్ముగా ఉండకుండా, మరలా విసిగించడము, అనవసర ప్రశ్న తో,

అలాగే ఇస్తా, కానీ ఒక వేళ వారూ లేకపోతే, ఆ 10 మంది కి ఇవ్వొచ్చు కదా అంటారు మరలా?

మీకేమైనా పిచ్చా, ఆయనా లేకపోతే, ఇంట్లో వారూ లేకపోతే, సాయంత్రమో రేపో ఎల్లుండో రారా? ఊరు వదిలి వెళ్ళిపోతారా, అంటారా?

నిజమే వస్తారు తర్వాత అయినా ఇవ్వొచ్చు, తొందరలేదు అని ఒప్పుకుని, మరలా ఆ 10 మంది కి అంటారు?

విసుగు పుట్టిందా? కోపము వచ్చిందా? వారివి తెలివైన అవసరమైన మాటలేనా?

** ఎవరికైనా మీరు ఓ కాగితం/ చిత్రము ఎవరికైనా చూపించి, మంచిది ఉంచుకోండి అని ఇవ్వమంటే,

అసలు మన చేతిలో చిత్రము లేకుండానే వెళ్ళి, మనకు మాట్లాడటము రాకపోయినా కూడా, మీకు ఆ చిత్రము కావాలా రేపు తెస్తాను అని అడిగి, వారికి సగము అర్ధము అయ్యి, కొనాలేమో అనుకుని, వద్దులే అంటే, చేతులు ఊపుకుంటూ వెనక్కు రావడం.

అది తప్పు కదా అలా అడగటము అంటే, అవునని ఒప్పుకుని, మరలా,

ఊరికే అడిగాను, కావాలంటే రేపు తెద్దాం, అని జవాబు చెప్పడం.

కావాలని ఎలా అంటారు, అసలు అది ఏమిటో తెలియకుండా, చూడకుండా, మనకు వివరించడం రాకుండా అలా అడిగితే ఎలా అంటే, మరలా ఊరకనే అడుగుదామని అనుకున్నా. మనము తెలివిగా, వారికి చూపించి వివరించి, వారు తీసుకునేటట్లు గా చేసి పుణ్యము సంపాదించాలి కదా అనే, వివేకము జ్ఞానము రాదు.

ఇవే ప్రతి పనిలోనూ కూడా, చెప్పింది అర్ధము చేసుకుని, సరిగ్గ చేయకపోగా, చెప్పనివి 10 రకాలుగా అర్ధం లేకుండా ప్రశ్నిస్తూ, చెప్పనివి కూడా తల తిక్కగా ఇష్టం వచ్చిన విధముగా చేయడము. మీకు ఇలాంటి వారు, చుట్టూ చాలా మంది కనిపిస్తారు.

ఏదైనా, అంటే, ఇంత చిన్న దానికి విసుక్కుంటారు అంటారు, ఇంత చిన్న దానికే ఇన్ని ప్రశ్నలు, అలాగే తల తిక్క గా చేస్తే, ఇంక పెద్ద పనులు మరియు ఇతర పనులు, జీవిత సమస్యలు ఎలా ఎదుర్కొంటామో అని, అలోచన చేయరు, తమను తాము మార్చుకుని, కష్టపడుతూ, ఇతరులకు తలనొప్పి కాకుండా, భవిష్యత్ కు బంగారు బాట వేసుకోరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,374; 104 తత్వాలు (Tatvaalu) and views 226,158
Dt : 26-Feb-2021, Upd Dt : 26-Feb-2021, Category : General
Views : 815 ( + More Social Media views ), Id : 992 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : educated , grow people , arguments , unnecessary questions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content