అలిగిన కాలం ఆగిన మగ్గం - పస్తుల్లో చేనేత కార్మికులు - ముడిసరుకు లేక ఉపాధి కోల్పోతున్న నేతన్నలు - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,274,964; 90 తత్వాలు (Tatvaalu) and views 175,310.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

వేటపాలెం, చీరాల : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, తయారయింది చేనేత కార్మికుల పరిస్థితి. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న చేనేత రంగంపై, ఇప్పుడు కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. పూర్తిగా పని లేకుండా, పస్తులు గడిపే పరిస్తితులు నెలకొన్నాయి. చిన బొంబాయిగా పేరొందిన చీరాల నియోజకవర్గంలో, అధిక శాతం ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి, జీవనం కొనసాగిస్తున్నారు.ఇక్కడి నేత చీరలకు, వస్త్ర మార్కెట్‌లో మాంచి గిరాకీ ఉంది.

చీరాల, గద్వాల్, పోచంపల్లి, ధర్మవరం, ఆరణి, వెంకటగిరి, సిరి సర్ల, కంచి, మంగళగిరి, పోలవరం , పెడన, ఉప్పాడ, పెద్దాపురం, నెల్లూరు, పొందూరు, శ్రీ కాళహస్థి, అంగర, నారయణపురం, కొయ్యలగుడెం, బోగరం, సిరిపురం , చౌటుప్పల్, పుట్టపాక, పోచంపల్లి, ఘట్టుపల్, వెల్లంకి లేదా ఇతర చేనేత అన్నల ప్రాంతాలలో కూడా ఇలాగే ఉంటుంది బహుశా.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, లాక్ డౌన్ 2 విడత నేపథ్యంలో, చేనేత కార్మికుల జీవితాలు, కడు దయనీయమైన స్థితిలో పడ్డాయి. ప్రకాశం జిల్లా, చీరాల ప్రాంతంలో సుమారుగా 12,000 చేనేత మగ్గాలు ఉండగా, ప్రత్యక్షంగా 35 వేల మంది, పరోక్షంగా 25 వేల మంది కార్మికులు, చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

గత 20 రోజులుగా విధించిన లాక్ డౌన్ కారణంగా, చేనేత కార్మికులు పని లేక, ఆర్థిక సమస్యల తోటి, ఆకలి బాధలతో సతమతమవుతారు. ఈ చీరాల ప్రాంతంలో, మాస్టర్ వీవర్ అనే ఒక వర్గం, మొదటినుంచి చేనేత రంగాన్ని శాసిస్తుంది. ఈ నేపథ్యంలో షావుకార్లు చేనేత కార్మికులకు పని కల్పించకుండా, దూరంగా ఉండటంతో కార్మికులకు నూలు, పట్టు, పాగళ్లు అందుబాటులో లేక, వేల చేనేత మగ్గాలు మూగబోయాయి.

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నప్పటికీ, చేనేత కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకునే పరిస్థితులు లేవని, లాక్ డౌన్ కొనసాగినంత కాలం ప్రభుత్వమే, అన్ని విధాల చేనేత కార్మికులను ఆదుకోవాలని, నేతన్నలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు(బియ్యం, 1000 రూపాయలు) కన్నా, చేనేత పని కల్పిస్తే, మేము ఎవరి మీద ఆధారపడకుండా, మా జీవనం సాగించడమే కాకుండా, మేమే మరికొంత మందికి, ఉపాధిని చూపించగలము, అని చేనేత కార్మికులు చెబుతున్నారు.

లాక్‌డౌన్ తో ముడిసరుకులైన నూలు, పట్టు, జరీ దొరకడంలేదు. సాధారణంగా మార్చి, ఏప్రియల్ మాసాల్లో, పెళ్ళిళ్ళ ముహుర్తాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో రాష్ట్రంలోని ప్రజలు, చీరాల ప్రాంతానికి వచ్చి, చీరలు కొంటారు. తద్వరా నేతన్నలకు చేతినిండా పని ఉండేది.

ఇప్పుడు, పట్టు చేరలు కొనేవారు లేక ఇళ్ళలోనే నిల్వలు పేరుకు పోయాయి. ఇక మగ్గాలు నేసే నేతన్నలకు, మాస్టర్ వీవర్స్ మజూరీ ఇవ్వకపోవడంతో, ఆకలితో కుటుంబం అలమటిస్తున్నారు. మాములు రోజుల్లో కుటుంబం అంతా, కలసి పని చేసిన నేతన్న, సరాసరి కూలీ రూ. 150 నుండి రూ. 200 లోపే ఉంటుంది.

అప్పు ఇచ్చే నాధుడులేక, పస్తులతో అల్లాడిపోతున్నారు. అంతేకాక పిల్లల చదువులు కోసం, కుటుంబ పోషణకు, పెళ్ళిళ్ళ కోసం చేసిన అప్పుల భారం ఇంకోవైపు బాధిస్తుంటే, చేనేతలు కుమిలిపోతున్నారు. నియోజక వర్గంలో, 12వేల పైచిలుకు మగ్గాలుంటే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన, చేనేత నేతన్న నేస్తం ద్వారా, రూ. 24వే కు స్వంత మగ్గాలున్న, 6వేల మగ్గాలకు మాత్రమే ఇచ్చింది. కొందరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కూలి మగ్గాలు నేసే నేతన్నలను విస్మరించింది.

చేనేత కుటీర పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. పట్టు బెంగులూరు నుండి, జరీ ఉత్తర భారతంలోని, సూరత్ నుండి దిగుమతి చేసుకుని, మాస్టర్‌వీవర్స్ నేతన్నలకు ఇస్తుంటారు. నూలు రంగుల అద్దకం, డైయింగుల్లో చేస్తారు. అనుభంధ వృత్తుల పరిశ్రమలు మూత పడటంతో, ఒకవేళ ఉన్న రవాణా లేక మగ్గం చప్పుళ్ళు నిలిచి పోయాయి.

ఎవరి దగ్గరైనా లోగడ ఉన్నవి ఇచ్చినా, నేసిన చీర అమ్మడానికి మార్కెట్ లేక, చేనేతలు ఇబ్బందులు పడుతున్నారు. పస్తులతో జీవనం కొనసాగిస్తున్నారు.

సాధారణంగా 3 రోజులకు, ఒక చీర నేస్తే రూ. 600 వరకు కూలీ వచ్చేది. నెలంతా కస్టపడితే, రూ 6 వేలు ఆదాయం వస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా, రూ. 1000 మరియు బియ్యం ఇవ్వడం వలన, ఏమాత్రం నేతన్నలకు ప్రయేజనం లేదని, ప్రభుత్వమే ముడిసరుకు అందేల చూడాలని, జాతీయ్య హ్యండ్‌లూం కార్పోరెషన్ మరియు జౌళి శాఖ ద్వారా, రూ. 10 వేలు రాయితీ ఇచ్చి, ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు.

Kanchi, Mangalagiri, Polavaram , Pedana, Uppada, Peddapuram, Chirala, Venkatagiri, Nellore, Ponduru, Srikalahasthi, Angara, Narayanapuram, Koyyalagudem, Bogaram, Siripuram , Choutuppal, Puttapaka, Pochampally, Ghattupal, Vellanki  
Photo/ Video/ Text Credit : Koti Veeraiah Ch., Vetapalem, Journalist
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,964; 90 తత్వాలు (Tatvaalu) and views 175,310
Dt : 20-Apr-2020, Upd Dt : 20-Apr-2020, Category : News
Views : 2081 ( + More Social Media views ), Id : 510 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : AP Cooperative Society , APCO , handloom weavers , silk saree , Dharmavaram , Chirala , Netanna Nestham scheme , Mekapati Goutham Reddy , AP Minister Commerce

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content