పంచభూతాల శిక్షణకు దూరం, ముదుసలి వయస్సులో దేవతలు గా పూజింపబడే అవకాశం- మీకు మంచిదే కదా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,300; 104 తత్వాలు (Tatvaalu) and views 226,475.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Far from the training of Panchabhut, possibility of being worshiped as gods in old age - good for you?

*దీనివలన, మీరు పంచభూతాల శిక్షణకు దూరం అవుతారు. ముదుసలి వయస్సులో, సొంత పిల్లలు లేదా నమ్మకం అయిన వారి దగ్గర, దేవతలు గా పూజింప బడే అవకాశం పెరుగుతుంది. అది మీకు మంచిదే కదా?*

ప్రశ్న/ స్పందన - ఏవండీ 5 ఏళ్ళు పై గా మీ సందేశాలు అందుకుంటున్నా, అలాగే స్టేటస్ చూస్తున్నా. ముందు ప్రొఫైల్ ఫోటో లేకపోవడం, రీడ్ రిసీప్ట్ ఆపే దొంగ బుద్ది, స్పందన లేని లెక్కలేని తనం నిర్లక్ష్యం ఉండేది, కానీ ఇప్పుడు బుద్దివచ్చి ఆ చెడు లక్షణాలు మానేసాము. పిల్లల/ ఇంట్లోవారి ప్రవర్తనలో అవే చెడు ప్రతిబింబిస్తున్నాయి, భయం వేసింది. ప్రొఫైల్ ఫోటో కూడా మీరు చూసే ఉంటారు. చిన్నగా, మార్పు వస్తున్నది మాలో.

మధ్యలో పైన గ్రహాల మార్పుల, మానసిక బలహీనముతో, తప్పుడు దోవలో వెళుతూ, చదవకపోయినా, జవాబు లేకపోయినా, మిగతా సమయాల్లో తప్పక చదువుతాము. మా అమ్మ నాన్నకు కూడా, ఇన్ని వేరు వేరు విషయాలు ఆధ్యాత్మికత అరిషడ్వర్గ అష్టవ్యసన సాధన, ఇంత బాగా సాక్ష్యం తో ఉదాహరణలతో చెప్పే ధైర్యం ఓపిక సమయం లేదు, చెప్పినా వినము, సోది అని.

అందరి ఇళ్ళ పరిస్తితి ఇదే. ప్రపంచం చెడిపోయింది అంటామే గానీ, మన ఇల్లు ఒళ్ళు మనసు కుటుంబం ఎంత చెడిపోయింది, అని ఎవరికి వారు చూసుకోవాలి. అప్పులకు వ్యామోహాలకు కపట నటనలకు బానిసలము. సిగ్గు శరం లేకుండా, పులి నక్క పాములకే మేము సపోర్ట్/ ఓటు. పూజకు మాత్రమే ఆవు, మా బుద్ది ప్రకారం. మేము మారాలి, లేకపోతే, ముదుసలి తనం, నరక యాతనే. మీరు చెపుతున్నది అదే, మనల్ని మనం తెలుసుకుందాం.

తప్పో ఒప్పో స్పష్టముగా ఒకవైపు స్తిరంగా ఉందాము, అది చెడైనా మంచైనా, నటన వద్దు 2 నాల్కలు వద్దు అని స్పష్టముగా చెప్పారు. తల్లి దండ్రుల కపట నటన నిర్లక్ష్యం లెక్కలేనితనం బాధ్యతారాహిత్యం అహంకారం, వారి కుటుంబములో ప్రతి ఒక్కరి లో కనిపిస్తుంది, పిల్లలు అవే నేర్చుకుంటారు, అందరినీ పతనం వైపు నడిపిస్తుంది. మీరు చెప్పినది 100 శాతం నిజం.

కానీ మీవి వచ్చినప్పుడల్లా, ఒక వణుకు వస్తుంది, ఈ రోజు, ఈ వారం, ఏదైనా అరిషడ్వర్గ అష్టవ్యసనం లో పడ్డామా, అలాంటి తప్పుడు పని చేసామా, అని రాత్రి ఒక సారి ఆలోచన చేస్తాము. మమ్మల్ని ఒక్కోసారి, దీర్ఘ ఆలోచన భయములో ఉంచుతుంది, గతములో చేసిన తప్పులు గుర్తుకు వచ్చి. ఆ ఆత్మావలోకం, ప్రతి మనిషికి సహజముగానే ఉండాలి. అవసరం లేనిదే మా ఇంట్లో వారు, స్నేహితులు, బంధువులు కూడా, ఇన్ని విషయాలు పంపరు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో, జన్మలకు బాకీ ఉంటాము.

అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ, ఈశుని కొలువనిపించాలి, ఆ పాట బాగా నచ్చింది, మీ గొంతులో చాల మార్పు వచ్చింది ఏడాది ముందు కన్నా. అందరిలో గుడి ఉంది అన్నది, మీ ఇంట్లోనే స్పష్టముగా కనపడుతుంది. 77+ తల్లి ని కూతురులా సజీవ గురువు లా చూసుకునే వారిని, రోజూ తానే చేతి కర్రలా మారి నడిపించింది, నేను ఎక్కడా చూడలేదు, వినలేదు. అలాగే ఏలినాటి శని దశలో, తల్లి దైవముగా మారి, మీకు అండగా ఉండి, కాపాడారు. మీరు అన్ని స్టేటస్ లోనే పెడుతున్నారు. అవి చూడని వారికి, మా మాటలు కూడా అర్ధం కావు. ధన్యవాదములు, ఇంకా మానసిక నియంత్రణ ప్రయత్నిస్తాము, మా పురోగతి చెపుతాము. ఈ వారం లో పంపిన ప్రశ్నలకు, మా దగ్గర సరైన జవాబు లేనదుకు, సిగ్గు పడుతున్నాము, ఎందుకంటే వాటి ఫలితాలు మేము, మా కుటుంబమే అనుభవించాలి.

జవాబు - ధన్యవాదాలు. అందరికీ చెపుతాము, మేము దేవునికి మనసిక రాత గాత్ర మాట నైవేద్యం పెట్టి, భక్తులకు పంచుతున్నాము, అది మీరు స్వీకరిస్తారా లేదా మీ ఇష్టం. 3 గురు పొగిడితే, 7 గురు తిడతారు. ఎందుకంటే, వారి ఇంట్లో మానసిక పరిస్తితి అదే. మనం జాలి పడటం తప్ప, ఏమీ చేయలేము, చేయకూడదు. వారికి బుద్ది, వారి ఇంట్లో వారే చెపుతారు, సత్యం తప్పదు.

మీకు పంపకపోయినా, ఇంటర్నెట్ లో ఎవరో ఒకరు నేరుగా వెళ్ళి చదువుతారు. మేము కూడా స్వయంగా పంపడం ఆపేయవచ్చు ఏ రోజు అయినా అని, మీకు అన్ని లింక్ లు ఎప్పుడో పంపాము. స్టేటస్ లో ఎటూ ఉంటుంది.

మావి మీరు చదివారా లేదా అన్నది, మనకి పెద్దగా ఉపయోగము/ నష్టం లేదు. మేము మిమ్మల్ని నిస్వార్ధముగా, ఏళ్ళుగా తలచుకున్నామా లేదా, గతములో మీరు చేసిన మంచికి లేదా మీరు మంచికి భవిష్యత్ లో మారతారు అన్న ఆశకు, అది మాత్రమే ముఖ్యం.

అదే పని, మీరు ఎవరికైనా చేయగలరా/ పంపగలరా? మీ సొంత మాటలు, పాటలు, రాతలు, ఆత్మ జ్ఞానం, ముదుసలి తల్లి తండ్రి సేవ, పిల్లల సంస్కార పెంపక ఫలితాలు? చేయలేనప్పుడు, ఇంక దేవుని పూజకు అర్ధం ఏముంది? మన భవిష్యత మనకు స్పష్టముగా తెలుసు కదా? అహంకారములో, రాసుకుంది మనమే కదా? అవ్వ, మరలా దేవుడిని ఆడిపోసుకోవడం ఎందుకు.

కానీ ఏది, మాకు మరియు మీకు ఉపయోగము అంటే, మీ గురించి మీరు స్పష్టముగా తెలుసుకుని, మార్చుకుందాము అనుకుంటున్నారు చూసారా, అది ఇతరులతో పంచుకోవడానికి మనసు అంగీకరించింది చూసారా, అది గొప్ప. అదే మాకు కావల్సినిది, మీ జవాబు/ పురోగతి, ప్రాపంచిక వ్యామోహంలో లేము అన్న మాట, మాకు ముఖ్యం.

దీనివలన, మీరు పంచభూతాల శిక్షణకు దూరం అవుతారు. ముదుసలి వయస్సులో, సొంత పిల్లలు లేదా నమ్మకం అయిన వారి దగ్గర, దేవతలు గా పూజింప బడే అవకాశం పెరుగుతుంది. అది మీకు మంచిదే కదా? మా గురువు గా, మీకు ఉత్తమ స్థానం వస్తుంటే, మాకు సంతోషమే కదా. మాకు అండ గా ఉన్నట్లే కదా?

అందరిలో దేవుడు ఉన్నారు, మీలో కూడా. కాకపోతే, దుమ్ము పడిన మనసును శుభ్రం చేయాలి. అది 80 శాతం మందికి ఇష్టం ఉండదు, కష్టం అనుకుంటారు, కామ క్రోధ మోహ మద లోభ మాత్సర్యాలతో. మనకు 20 ఏళ్ళ లో ఎంతో మంది అలా కలిసారు, ఈనాటికీ మనతోనే ఉన్నారు, ఇవి అందుకుంటూ కూడా. 80 శాతం మోహములో ఉన్న వారితో పోల్చుకుని, పతనం కావద్దు. మన సాధన మనము చేసుకుంటూ వెళ్ళాలి, విష్ణు మాయను దాటాలి, ముక్తికి దగ్గరకు చేరాలి. ఇవన్నీ మన ఆలోచన, మాట, పనులు ను బట్టి స్పష్టముగా గురువులకు/ ఇతరులకు అర్ధం అవుతుంది. మీరు విజయవంతముగా మార్పులతో మంచి వైపు నడవండి, ఎక్కడైనా ఇబ్బంది వస్తే, వెంటనే మీకు నిస్వార్ధముగా పలకడానికి మంచి వైపు దోవచూపడానికి మేమున్నాము దేవుని అండతో. ధన్యవాదములు, నమస్కారములు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,300; 104 తత్వాలు (Tatvaalu) and views 226,475
Dt : 22-Jun-2023, Upd Dt : 22-Jun-2023, Category : General
Views : 285 ( + More Social Media views ), Id : 1811 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : far , panchabhut , training , possibility , worshiped , gods , old , age , parents , children , sadhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content