రాష్ట్రం దేశం నాశనం అవడానికి, అన్యాయాలకు మొదటి కారణం, మన ఇంట్లో లేదా? మనం బాధ్యులు కామా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,062; 104 తత్వాలు (Tatvaalu) and views 225,556.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎక్కడ చూసినా మోసం ద్రోహం అన్యాయం దోపిడీ, అని గొంతు చించుకుంటున్నాము కదూ?

మనకు సొంతంగా, మన ఆలోచనతో, తెలుగులో రాయడం కూడా రాని దిక్కు మాలిన స్ధితిలో, ఎవరో పంపిన వందల మెసేజ్ లు బొమ్మలు ఫార్వార్డ్ లేదా కాపీ చేస్తున్నాము కదూ?

చెప్పిన వాడు మరియు పంపిన వాడు, మంచి వాడా లేదా వీటిని పాటించేవాడా, లేదా కనీసం మనం పాటించగలమా అని చూడకుండానే, ఎత్తి రాసేస్తాము లేదా పక్క వానికి నెట్టెస్తాము? అవ్వ.

అన్ని వ్యవస్థ లలో దోపిడీ ఉంది, పద్దతి పాడు లేదు, ప్రభుత్వం లేదు, మంచి నాయకులు మరియు అధికారులు లేరు, అని తెగ లెక్చర్ లు ఇస్తున్నాము కదూ?

ఆసుపత్రి లో మోసం, షాపు లో మోసం, వీధుల్లో మోసం, అంతా ఎటు చూసినా మోసం, కదూ.

మరి ప్రపంచంలో నీతి గలవారు ఎవరూ, మన కుటుంబం మాత్రమే నీతి నియమాలను కలది, మిగతా జనం అంతా మోసమే? రామ చంద్రా?

మరి మన ఇంట్లో మోసం, దోపిడీ, అక్రమం, బద్దకం, అన్యాయం ను ఆపేది ఎవరు? సరిచేసేది ఎవరు?

మన పిల్లలు ను ఉదయం 5 కి లేపే సత్తా దమ్ము మనకు ఉందా? అసలు ముందు మనమే, 7 లేదా 8 దాకా లెగవం, ఇంక పిల్లల కు ఏం చెప్పగలం? బుద్ది ఎలా వికసిస్తుంది?

కరోనా సమయంలో రోడ్డు మీద కు, మనం లేదా మన పిల్లలు వెళ్ళకుండా, ఆపేశక్తి మన కుటుంబం కు ఉందా?

మనకు మన పిల్లల కు 4 శ్లోకాలు, పద్యాలు చెప్పడం రాయడం వచ్చా, చూడకుండానే? సంస్కారం ఆప్యాయత నిబద్దత గౌరవం బాద్యత నేర్పగలమా? అసలు అవెంటో అంటారా?

రోజూ భోజనం, సమయానికి, తినగలమా శాఖాహారం తో వేపుళ్ళూ ఎక్కువ నూనె లేకుండా?

మనకు మన పిల్లల కు వేపాకు, కషాయం, నువ్వుల నూనె, కాకర, పాలతో తోడేసిన సద్ది, రాగి, జొన్న, సజ్జ, లాంటివి అలవాటు చేయగలమా?

బేకరీ, మైదా వంటలు, బయట తిండి, చాక్లెట్, పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీం లు కు దూరంగా పిల్లల ను మనల్ని ఉంచగలమా?

రోజూ అరగంట పూజ, రామాయణం భారతం భాగవతం భగవద్గీత, కనీసం ఒక పద్యం, ఒక పేజీ చదవగలమా?

కేవలం మంచి గుణాలను సంస్కారం ను బట్టి, మన పిల్లల కు పెళ్ళి చేయగలమా? కుదరదు కదూ, ఐశ్వర్యం హొదా అధికారం కులం మాత్రమే ముక్యం, అవునా?

మన ఇంట్లో, మన బజారు లో జరిగే, మోసం దగా కుట్రలను ఆపగలమా? కనీసం ప్రశ్నించగలమా?

ఓటు అమ్ముకోవడం అంటే ధనం, వర్గం, అవకాశం, అవసరం, ఏదైనా ఒకటే. మరి, మన గుణ సంపన్నులకు, ఓటు ఉచితంగా వేస్తామా?

ఓటు అమ్ముకుని, బిజినెస్ చేస్తున్న వారి వలనే, దేశం ఇలా తయారు అయింది. అంటే మన వలనే, మరి మన బుద్దులు మారతాయా, మార్చుకునే ధైర్యం ఉందా?

ముందు మన ఇల్లు మార్చుకునే ఓపిక, సహనం, శక్తి, బాధ్యత, నిబద్ధత ఉందా?.

రాష్ట్రం దేశం నాశనం అవడానికి మొదటి కారణం, మన ఇంట్లో లేదా? ఆత్మ విమర్శ చేసుకుందాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,062; 104 తత్వాలు (Tatvaalu) and views 225,556
Dt : 25-May-2021, Upd Dt : 25-May-2021, Category : General
Views : 772 ( + More Social Media views ), Id : 1180 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : reason , bad , state , country , India , telugu , injustices , home , responsible
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content