గోపీ, గోపీకల జీవిత భవిష్యత్తు బాగుకు పంచ సూత్రాలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,937; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Five principles (sutra) of future good life of Gopi, Gopika

గోపీ(క) అంటే మనిషి పేరు కాదు సుమీ, మనిషి గుణం మాత్రమే. గోడమీద పిల్లి, అంటే స్ధిరత్వం స్ధితప్రజ్ణత మానసిక బలం లేని, చంచల స్వభావులు, అంటే అవసర అవకాశ వాదులు. తొందరపడి ఈరోజు ఒప్పు అన్నది, రేపు అదే తొందరలో తప్పు అంటారు.

ఈ రోజు నువ్వు గురువు అంటారు, రేపు నువ్వు గొడుగు అంటారు, ఆ తర్వాత నువ్వే గొడవ అంటారు, ఆ తర్వాత తర్వాత నువ్వే మాకు అడ్డు గోడ అంటారు.

కఠిన లేదా సాధారణ సాధనలు వీరికి గిట్టవు నచ్చవు. శని రాహు లాంటి గ్రహ మాయలో ఉన్న కూడా, వీరు ధన పూజల తో, దైవం ను కొనవచ్చు అనుకుంటారు, శూన్యం అని తెలిసినా.

పూర్వ జన్మ సుకృతం పూర్తి అయిన దాకా, వీరు అజ్ఞానంలో విజయవంతంగా ముందుకు వెళతారు, ఎవరినీ పట్టించుకోరు. తమను సరిచేసుకోక పోగా, ఇతరుల మంచి పనులు హేళన చేస్తారు, తమ స్వయం పతనములో బిజీ బిజీ అంటూ.

ఆకాశం లో గాలి మేడలు కడుతూ ఊరేగుతున్న మామకు తన పరిస్తితి ఎప్పుడు అర్ధం అయ్యింది? కేవలం అల్లుడు వెన్నుపోటు పొడిచాకనే కదా. మనమూ అంతే, వ్యాపార మరియు జీవిత భాగస్వామో, పిల్లలో, అల్లుడో, కోడలో, రోగమో, ఖర్మనో, కాలమో, మన తాట తీసిన దాకా, మారలేము.

చిత్తశుద్ధి వాక్సుద్ధి లేని, పూజా పురస్కారం యాత్ర లు సేవలు, అంటూ పబ్బం గడుపుతారు. నిస్వార్థ త్యాగ మానవ సేవ మాధవ సేవ, అని నోటితో అన్నా, చేతలతో చేయలేరు.

వీరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో, మునిగి తేలుతూ ఉంటారు. కానీ కనీసం రాక్షసులు స్ధాయిలో, గర్వంగా ధైర్యంగా అవును మాకు మానసిక నియంత్రణ చేతకాదు, మేము పై వాటికి బానిసలం, అని ఒప్పుకోవడం కు మనసు అంగీకరించదు.

ఇంక వారి పిల్లల పరిస్తితి ఆలోచన చెయ్యండి. తండ్రి ద్రుతరాష్ట్రుడు తల్లి గాంధారి లా కళ్ళు మూసుకుని ఉంటే, 100 మంది పిల్లల అహంకారానికి, స్వయం పతనానికి హద్దు ఉంటుందా?

వీరు రజో తమో గుణాలు మెండుగా కలిగి ఉంటారు. 80 శాతం నేడు, వీరి ప్రాపంచిక భ్రమలు వలననే, పార్టీ లు సంఘాలు కుటుంబం లో, వీరి ఆధిపత్యం ఎక్కువ. నక్క పులి పాము డైనోసార్ కే వీరి ఓటు. ఆవుకు చేటు తెస్తూ, తమ కుటుంబాలకు చేటు చేసుకునే ప్రబుద్దులు.

తమ వలనే ప్రపంచం నడుస్తూ ఉంది అని వీరి భ్రమ. ఆ భ్రమలు లోనే వీరు కాలచక్రం లో పతనం అవుతున్నాం అని వీరు గ్రహించరు. చివరలో రావణ, ధుర్యోధన, శూర్పణఖ, మంధర, లంఖిణీ లా పారి/మారి పోతారు, పతనం అవుతారు, కానీ అలా తమకు కాదని బ్రమలు లో ఉంటారు.

వీరికి ముదుసలి తల్లి తండ్రుల అత్తా మామల సేవ అంటే అసలు పడదు. కృతజ్ఞతలు విశ్వసనీయత అంటే చిరాకు వీరికి. కనీసం తమ సంస్కార సంతానం లో ఒకరైనా, తమను ముదుసలి తనం లో, ఇంట్లో ఉచితం గా పెట్టుకొని, దేవతలు గా పూజిస్తారా అని చెప్పుకోలేని కపటం నాటకం దౌర్భాగ్యం.

అంటే వీరి జీవితం వృధా, కేవలం శారీరక సుఖం మానసిక కోరికల పరుగులుకే, వీరి ఆత్మ దహించబడింది, అని కూడా ఒప్పుకోలేని నిస్సహాయత, రుగ్మత.

అప్పులతో పప్పు కూడు. వీరు భవిష్యత్తు కు ఇవి ఆలోచనలు చేస్తే, వీరు వీరి కుటుంబం అలాగే సమాజం బాగుపడుతుంది. చేయకపోతే నష్టం వీరికి, వీరి కుటుంబం కే.

పురాణాల సారం అర్థం చేసుకునే సామర్థ్యం లేకున్నా, కనీసం కలియుగ ప్రత్యక్ష సాక్షం కూడా వీరు గ్రహించలేని మంద బుద్దులు, కోరికలకు దాసానుదాసులు.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య లాంటి మహానుభావుల, జీవిత చివరి సందేశాలు కూడా వీరికి కనువిప్పు కలిగించవు.

1. ముందు ముదుసలి అమ్మ నాన్న అత్త మామలు ఎక్కడ, ఇప్పుడు, తర్వాత, చివరలో, వారి ముదుసలి తనం సేవ, దగ్గర ఉంచి, సమాన సౌకర్యాలు వైద్య సేవలు తో?

2. తర్వాత చేతులు కాలాయా లేదా ఆకులు ఆపుతాయా, ఏ విషయం లో అయినా? అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం నియంత్రణ? స్ధిరత్వం స్ధితప్రజ్ణత మానసిక బలం? 2 నాల్కల ధోరణి, చాటు మాటు వీడటం? ఎప్పుడు ఇవన్నీ సాధ్యం, 10 జన్మలకా?

3. తర్వాత గోపీ/ గోపిక లను, పెళ్లి/ విడాకులు/ మళ్ళీ పెళ్ళి, చాటు మాటు అల్లిబిల్లి లేదా వ్యసనం ఇంకోటి కి పోనివ్వకుండా ఆపే ధైర్యం, సమర్ధత మనకు ఉందా?

4. సంతానం పెంపక సంస్కారం తో, వారి వీరి మాయలో పడరా, ఆపగలమా? కనీసం తల్లిదండ్రులు అత్తా మామలు స్నేహితులు బంధువులు ను గౌరవిస్తారా? మాతృభాష లో రాయడం, చదవడం, సంస్కారం సాధన, మానసిక బలం తో చేయగలరా?

5. ఇంత చాకిరీ చేసి, ఇంత వెనకేసి/ దోచి, ఇంతమందిని గాండ్రించి శోధించి ముంచి బాధించి, రోగం తో నో ఇంకో పతనం తో నో రోదించి, నిస్సత్తువగా మంచం ఎక్కి తే, గౌరవం గా దేవత పోనీ మనిషి లా పోనీ ప్రాణిలా చూసేది ఎవరు?

శని, రాహు, కాలచక్రం, పంచభూతాలు, వీటికి జవాబులు ఇవ్వబోతోంది లేదా బీజం పడబోతోంది ఈ దశలో, అని తెలిసినా మేల్కొనరు. వీటి గురించి రాయండి భవిష్యత్తు ఊహాగానాలు, 100 సందేశాలు, మన కుటుంబం సంక్షేమం కోసం.

మోదీ, యోగీ లాంటి వారి బాంక్ ఖాతాలు పెరగలేదు అని తెలిసినా, వారి పనులు అంటే నచ్చవు. అదే కేసీయారు, చంద్రన్న, జగనన్న బాంకు ఖాతాలు బరువుతో వంగిపోతుంటే, రాష్ట్రం అప్పులతో కుంగిపోతుంటే, పధకాలకు కుటుంబ పేర్లతో ఉన్నా, మనకు నచ్చుతారు. ఇది గోపీ/ గోపిక ల మానసిక పరిస్తితి.

అంటే ఇంక వారి ఇంట్లో వారి పరిస్తితిలో ఎంత పక్షపాతం, ఎంత అధోగతి, ఎంత పతన దిశనో ఆలోచన చెయ్యండి. మనసులో ధర్మం లేని వీరికి చిత్తశుద్ది గల పూజలు సాధ్యమా?

https://www.youtube.com/watch?v=TsAlL3ekh3s తొలికోడి కూసింది - అందమయిన లోకమని

https://www.youtube.com/watch?v=Wjg_LjUTAy8 కళ్ళు తెరచి కనరా సత్యం - రాజూ పేద

https://www.youtube.com/watch?v=EvUNWOmjuv0 కోడెకారు చిన్నవాడా (పేరడీ) - ముందడుగు

https://www.youtube.com/watch?v=NIN780D6l-I అప్పుచేసి పప్పుకూడు ఏలర ఓ నరుడా

https://www.youtube.com/watch?v=rSz4Q5dukwA పూలరంగడు - చిల్లర రాళ్ళకు, మొక్కుతు ఉంటే

https://www.youtube.com/watch?v=MdyJ7n-hFSo తాగి సెడిపోకుమప్పా, చేతికి చిప్పా, ఇంట్లో దినమే

https://www.youtube.com/watch?v=X7VD5Z7D9fQ సరదా సరదా సిగిరెట్టూ(పేరడీ)- రాముడు భీముడు

https://www.youtube.com/watch?v=Ej_2GuSJmOI చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ(పేరడీ)- మనీ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,937; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500
Dt : 07-Jan-2024, Upd Dt : 07-Jan-2024, Category : General
Views : 140 ( + More Social Media views ), Id : 1982 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Five , 5 , principles , sutra , future , good , life , Gopi , Gopika
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content