తెలుగు గురువు ల నే మరచి, పరాయి గురువు ల, మోహంలో పరుగులు, బాధ్యత మనసు లేని - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,433; 104 తత్వాలు (Tatvaalu) and views 238,172.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి, భవిష్యత్తు కాల జ్ఞాన బ్రహ్మ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన లాంటి మహా గురువులు యోగులు, జీవిత సత్యాలను తేట తెలుగు లో, మన చెవులకు ఇంపుగా ఇచ్చారు. సొంత తెలుగు గురువు ల నే మరచి, పరాయి గురువు ల వెంట, మోహంలో పరుగులు తీసే, బాధ్యత మనసు లేని, తెలుగు వారా మేలుకో.

సొంత అమ్మ మర్యాద తర్వాత నే, పిన్ని కి ఇచ్చే గౌరవం మర్యాద కు విలువ. అమ్మ ను మరచి విడిచి, పిన్ని ని అందలం ఎక్కిస్తున్నట్టు, గుర్తు చేసుకున్నట్లు, పూజిస్తున్నట్లు నటిస్తే, ఏ ఉత్తమ పిన్ని కూడా స్వీకరించదు, మన కపట గౌరవాన్ని.

తన అక్క కు అంటే మన అమ్మ కు అంటే మన తెలుగు గురువు కు, ముందు వందన నమస్కారం మరియు 9 వారాల గురు పూజ చేయమని చెబుతుంది, తన దగ్గర నటించే వారందరికీ.

ఏ తల్లి అయినా ఒకటే అంటే అర్థం, ముందు సొంత తల్లి ని పూజించమని, తర్వాత మిగతా అందరినీ అలాగే గౌరవించమని. అలాగే ఏ గురువైనా ఒకటే అంటే, ముందు తెలుగు గురువు కు, 9 వారాల పూజ చేయాలి కదా? చేస్తున్నామా? అంటే మనమే అందరు గురువు లు ఒకటి కాదు, వ్యామోహం లో మాయ మాటలు నమ్మి, మనము అనుకున్నదే కరెక్టు అంటున్నాము, మన తప్పు ఒప్పుకున్నాము కదూ?

అందుకే కన్నతల్లి దండ్రులు పై, ప్రేమ ను గాలికి వదలి, దూరంగా విడిచి, ధనం విదిలించి, జీవిత భాగస్వాముల దగ్గర, అవసరార్ధం కపట ప్రేమతో నటిస్తూ ఉంటే నే, వారూ అదే వ్యామోహం లో ముందు నమ్మబట్టే, ఇద్దరూ ఆ తర్వాత మోసపోయి మేలుకుని, కోర్టు లు లాయర్లు ఖాళీగా లేకుండా చేస్తున్నారు, ప్రజా సమస్యలకు.

రోజు రోజుకు పెళ్లిళ్ళు సంఖ్య ను మించి పోతుంది విడాకుల సంఖ్య, దేవుడా. ఎందుకంటే ఇద్దరు కూ, మంచితనం గుణం సంస్కారం అవసరం లేదు, కేవలం ఐశ్వర్యం అందలం అధికారం అవసరం అవకాశ వాదమే కావాలి కాబట్టి.

గురువు దైవం మనలో నే ఉన్నారు, మన తల్లి దండ్రులు లోనే ఉన్నారు, అన్నది సత్యం నిత్యం. బయట వెతకనవసరం లేదు. నిద్ర పోతున్న మనలోని, గురువు ను దైవం ను తట్టి లేపి, చూడు. మన చుట్టూ జరుగుతున్న జగత్తు నాటకాలు మాయలు భ్రమలు మోసాలు చూసి, మనమే నవ్వు కుంటాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,433; 104 తత్వాలు (Tatvaalu) and views 238,172
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 1156 ( + More Social Media views ), Id : 959 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : forgot , telugu , guru , brahmam , vemana , raghavendra , running , after others , fascination
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content