Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. * బాగా బతకడం అంటే, సంపదలతో లేదా లగ్జరీ బతుకు కాదు. పచ్చడి మెతుకులు తో అయినా, ప్రశాంతత తో మనశ్శాంతి తో నవ్వుతూ బతకడం. సమయానికి చీకు చింతా లేకుండా నిద్ర పోవడం. కానీ, ముందు మోహం లో ఒప్పకోలేరు. పరలోకం కు పోయేటప్పుడు మాత్రము, అందరూ ఒప్పుకుంటారు. కానీ సమయము లేదు సరిచేసుకోవడానికి.
* ఎవరి కీడు లోనూ, మన వేలు కూడా ఉండకూడదు. ఎందుకంటే, ఏది మనం ఇతరులకు చేసిన, అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఐదుగురి ధనం దొంగిలించిన వాడు, ఐదుగురు తో లేదా ఎక్కువ మందితో దొంగిలించబడతాడు, వివిధ దశల్లో జన్మలలో వడ్డీ తో సహా. ఎంతమంది పిల్లల కు అన్యాయం చేస్తారో, అన్ని పిల్లల జన్మలో, అవే పాట్లు పడాలి. న్యూటన్ 3 వ సిద్ధాంతము లో కూడా నిరూపించారు.
* ఏదైనా వస్తువు ధనం సహాయం అపాత్రాదానం చేసిన, దానికున్న చెడు ఫలితాలు, దాత కూడా పంచుకోవాలి. తాగుబోతు కు వెయ్యి ఇస్తే, తాగి వెళ్లి భార్య పిల్లలు పక్కన వాళ్ళ ను పెట్టిన బాధలో, పాప భాగం వెయ్యి ఇచ్చిన, దాతకు కూడా చెందుతుంది. అంటే అహంకారం లో ధనమును ఇచ్చి, పాపం రెట్టింపు తో కొనుక్కోవడం. తప్పుడు వారికి సహాయం ఎప్పుడూ, బాధ్యత లేని మోహములో ఉన్న దాత కు ప్రమాదం.
* మనం చేసే తప్పులు కు మనమే బాధ్యులం, అందులో దేవుని పాత్ర లేదు. దేవుని సహాయం ఉండదు, కోట్ల యాగం దానం చేసినా. ఆయన ధర్మం శిక్షలు, మన ధనం హోదా ను బట్టి మారదు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,018; 104 తత్వాలు (Tatvaalu) and views 254,439 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments