పాటతో పరమార్ధం- గాలిలో నాబ్రతుకు, తేలిపోయినదోయి(భక్తి ఆధ్యాత్మికం)- ఘంటసాల ప్రైవేట్ ఆల్బమ్ నుండి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,807; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Gaalilo Naa Brathuku(Devotional Spiritual) - From Ghantasala Private Album

మరి ఈ పాటకు అర్ధం, రోగాన ప్రమాదాన బాధలో, ఆఖరి క్షణాలు లో అనుకోవాలేమో. ఇన్ని రోజులు మంచి మర్యాద లేకుండా, ఎవరినీ లెక్కచేయకుండా, గాలికి తిరిగిన మనం, మనలోని గాలి (ప్రాణం) బయటకు పోయే సమయం వచ్చింది అని తెలిసే సరికి, ఎక్కడ లేని దయ జాలి మానవత్వం మన మీద మనకే వస్తాయి. ఆస్తి, అందం, బలగం, పదవి, అధికారం ఏవీ మనల్ని కాపాడలేవు అని అప్పుడు అర్ధం అవుతుంది.

జీవితము అంతా, మన కళ్ళ చుట్టూ, సినిమాలా తిరుగుతుంది. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఎన్ని తప్పులు చేసామో, ఎంత తప్పుగా మాట్లాడామో మనకు అవగతము అవుతుంది. కానీ చేయగలిగింది ఏమీ లేదు, దేన్నీ అప్పుడు మార్చలేము. మంచికి ఏనాడు అండగా బాసటగా నిలవలేదు అని అప్పుడు తెలిసివస్తుంది.

కన్నీరు మున్నీరుగా ఎంత ఏడ్చినా, ప్రాధేయపడినా, ఒంట్లో నరాలు సత్తువ సహకరించవు, ఇంట్లో మనుషులు గౌరవించరు, ప్రపంచములో పంచభూతాలు కనికరించవు. చూడండి అతని ఆవేదన, ఎంత వేదాంతముగా చెపుతున్నారో, తన అంతములో.

లోకాన్ని వీడిపోయే సమయం వచ్చింది, ఓ పంచ భూతములారా, మీరైనా పలుకరింపగరారే, నా మొర ఆలకించగ రారా?

రావోయి, నాదరికి రావోయి, నన్ను పట్టుకోవోయి, ఇంకాసేపు లో ఆరిపోవును యేమో నా చిన్ని వెలుగోయీ, నన్న కాపాడవోయి అంటే వినేది ఎవరు? ఇన్ని రోజులు మనం ఎవరి మాట విన్నాము?

కరుణ గిరుణాలేని (మనకు లేదు ఇన్నాళ్ళు మరువద్దు), కాల దేవత నుండి, కాపాడ రావోయి, గాలిలో నా బ్రతుకు, నిలుపంగ రావోయి (మనము ఎవరి గోడు వినలేదు బిజీ బిజీ అంటూ) అంటూ కన్నీరు కార్చినా, వినేది, ఆదుకునేది ఎవరు?

ఇన్నాళ్ళు మానసిక సాధన లేని, మన మనసు ఇంకా బలహీన పడిపోయి, అల్లాడుతుంది. అయ్యో, దేవుడు ఇచ్చిన బంగారు జీవితాన్ని, ప్రాపంచిక వ్యసనాలలో, వ్రుధాగా గడిపితినే అంటూ, చివరి క్షణాలు ఎంత అత్యంత భయంకర క్షణాలు, అవే రేపటి దుర్భర జన్మను నిర్ణయించేవి. అందుకే నేటి నుండే మేలుకో, మనల్ని మనం తెలుసుకుందాము, పుణ్యం పెంచుకుందాము, మానసిక బలం నియంత్రణ సాధించుదాం.

గాలిలో...,
గాలిలో. నా.బ్రతుకు, తేలిపో.యినదో.యి
నీలిలో కలసిం.ది, మాలినా. బ్రతుకో..యి. ||గాలిలో||

పంచభూ.తములా.ర, రాయంచగిరులా.ర
నాపం.చజేరరే.., పలుకరింపగరా.రే. ||గాలిలో||

రావోయి, రావోయి,
రావోయి, రావోయి, నాదరికి రావోయి,
ఆరిపోవును యే.మో
నా చిన్నివెలుగో.యీ 2 గాలిలో..|

కరుణ గిరుణాలేని, కాల దేవత నుండి
కాపాడ రావో.యి, గాలిలో నా బ్రతుకు - 2 సార్లు
నిలుపంగ రావో.యి, గాలిలో నాబ్రతుకు ||గాలిలో||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,807; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446
Dt : 14-Jun-2023, Upd Dt : 14-Jun-2023, Category : Songs
Views : 289 ( + More Social Media views ), Id : 1793 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Gaalilo , Brathuku , Devotional , Spiritual , Ghantasala , Album
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content