తాతలు ఇచ్చిన ఆస్తులు కోట్లు విడిగా ఉన్నా, జనం, బంధువుల డబ్బు కు ఆశపడటం ఏమిటో - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,396,589; 104 తత్వాలు (Tatvaalu) and views 258,840.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తమ్ముడు మేఘనాధా, ఎలా ఉన్నావు, ఆరోగ్య మేనా? మన కేబుల్ వ్యాపారం బాగా జరుగుతుందా? ఇప్పుడు అయినా, ఆఫీసు లో కూర్చుని అన్ని పనులు నువ్వు చూసుకుంటూ, తల్లి దండ్రులు కు విశ్రాంతి, మనశ్శాంతి ఇస్తున్నావని ఆశిస్తున్నాము.

తల్లి దండ్రుల ఆస్తుల తో పాటుగా, జనం ను ఏడిపిస్తూ మోసగిస్తూ ఎగేసిన ఎగేస్తున్న అప్పుల బాధ్యత కూడా, నీతిమంతులు తీసుకుంటారు. లేదంటే రెండు, ఆస్తి అప్పు, వదిలేస్తారు. కానీ నీకు ఇంకో మార్గము ఉద్యోగము చదువుతో లేవు.

తాతలు ఇచ్చిన ఆస్తులు కోట్లు విడిగా ఉన్నా, జనం, సొంత బంధువుల, అక్క, పెద్దమ్మ, బాబాయిలు మరియు ముదుసలి వారి డబ్బు కు ఆశపడటం ఏమిటో, ఆ దిక్కు మాలిన మానసిక దౌర్భల్యం దురాశ ఏమిటో, నాయనమ్మ తాతలకే తెలియాలి.

జనం చెమట రక్తం మాంసం కన్నీరు మరిగిన మీరు, ఎదుటివారి ఇబ్బందులు, గమనించరు లెక్క చేయరు. నమ్మిన వారి గొంతు కోయాలన్న, మీ కుటుంబ సిద్దాంతం గొప్ప ఏమిటో తెలీదు, రాజకీయాలు లో రాణిస్తారు బహుశా.

మా అందరి డబ్బులు వడ్డీ ల తో 20 ఏళ్ళ గా బతుకుతూ, ఆస్తులు పెంచి, స్ధలాలు, అపార్టమెంట్ లు, కేబుల్ కొన్నది మీరు, విపరీతమైన వడ్డీ లు తో. చివరకు పెట్టుబడి పెట్టిన వారి నెత్తిన, తెల్ల గుడ్డ, కనపడకుండా వినపడకుండా చదవకుండా దాంకోవడం.

2016 నుంచి కూడా నన్ను నమ్ము, ద్రోహ బుద్ధి మా రక్తం లో లేదు, నా బిడ్డలు మీద ప్రమాణం చేసి చెపుతున్నా అని మీ నాన్న ఇంతవరకు, కాగితం కూడా తిప్పి రాయలేదు. కనీసం ఈ ఇబ్బంది అని కూడా, మీ వాళ్ళు గౌరవం గా ఫోన్ చేసి చెప్పరు. మీ వాళ్ళ ద్రుష్టిలో, దుడ్డు కు విలువ ఎక్కువ, బిడ్డల కన్నా.

2018 ఫిబ్రవరిలో అడిగా, మరలా బిడ్డలు మీద ప్రమాణం, ఆ సంవత్సర జులై లో ఇస్తా తెగనమ్మి, చేతిలో గవ్వ లేదన్నారు.

2020 ఫిబ్రవరి లో అడిగా, ఆదాయం లేదు, తల్లి ఆసుపత్రి ఖర్చు స్ధాయి, మీకు తెలిసిందే కదా అని అడిగా. మరలా బిడ్డలు మీద ప్రమాణం, ఈ జులై లో అని. ఫోన్ ఆపేశారు, గుమస్తా ల జవాబు లేదు.

అబ్బా కొడుకు లు ఆనందముగా, ఎన్నికల నామినేషన్ వేశారు కలసి, పైసా లేకుండా నే, నమ్మక చావలేము కదా. మీ అమ్మ గారు కూడా, తప్పకుండా ఇస్తాము, అని పాత మాటే పాడారు. జులై వచ్చింది, అమ్మ ఫోన్ కూడా ఆపేసింది.

ముదుసలి తల్లి దూర ప్రాంతంలో ఆసుపత్రి ఖర్చులు తెలిసి కూడా, మీ కుటుంబం, 2 ఏళ్లుగా, కనికరం దయ లేకుండా ఉంది అంటే, అది మీ కుటుంబం సంస్కారం మర్యాద కృతజ్ఞత. అది చివరకు మీకే, పిల్లలు ద్వారా బుద్ధి తెప్పిస్తుంది, కాలం విడువదు. ఎటూ జనం ఉసురు ఉంది, కనీసం అక్క, అన్న, బాబాయి, పెద్దమ్మ, ముదుసలి వారి ధనమైనా వెనక్కి ఇచ్చి వడ్డీ తో, కొంత పాపమైనా తగ్గించుకోండి.

అందరం బాగుండాలి. అమ్మ నాన్న లకు అర్థం అయేట్టు గా చెప్పు , జనం బాధ అర్థం చేసుకునే మనసు నీకుండి, ఆ స్ధాయికి ఇప్పుడు అయినా ఎదిగి ఉంటే. భగవంతుడే రక్ష మాకు. అని తన గోడు సోము రాము తో చెప్పుకున్నాడు తన వాళ్ళ నమ్మకద్రోహం గురించి.

గమనిక -

మీకు వడ్డీ రావణుడు కుటుంబం కు పంపగలరు, అదీ పుణ్య మే, ఇంత మంది జనం కన్నీళ్లు తుడవడం లో సహాయం చేసినందుకు.

ధనం పరంగా మనం ఓడి పోయినా భవిష్యత్తు లో, ధనం ఇచ్చిన అందరికీ, ఒక గ్రాము పుణ్యం వస్తుంది ఎలాగైనా. పావు గ్రాము పాపం కూడా, తప్పుడు వారికి అండ గా ఉన్నందుకు, ధర్మ వడ్డీ 2 పైన తీసుకున్న వారికి మాత్రమే.

మనం కూడా తర తరాలు చెప్పుకోవచ్చు, ఈ కుటుంబం, వంశము పిల్లలు మనుమలు, కేబుల్, ఆస్తులు, వాళ్ళ లో ప్రవహించే ప్రతి రక్త బిందు వు లో, మన రూపాయి ఉంది. మన ధనం మన ఉప్పు తోనే, వారి వంశం ఆస్తులు వృద్ధి చెందాయని.

ఒక వంశము మనందరి ధనం మీద బతుకుతూ ఉంది అంటే, మనకు గర్వ కారణం. ఆ అదృష్టం మనందరి కీ కలిగించిన దేవ దేవునికి ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,396,589; 104 తత్వాలు (Tatvaalu) and views 258,840
Dt : 09-Sep-2020, Upd Dt : 09-Sep-2020, Category : General
Views : 838 ( + More Social Media views ), Id : 686 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : grandparent , assets , uncle , people , relatives , money , grab , babai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content