పాటతో పరమార్ధం - గులాబీ పువ్వై (భక్తి పేరడీ) - అన్నదమ్ముల అనుబంధం - ఎన్టీఆర్, కాంచన, బాలకృష్ణ, లత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,305; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Gulabi Puvvai (Bhakti Parody) - Annadammula Anubandham - NTR, Kanchana, Balakrishna, Latha

మన గాత్ర, వ్రాత, మానసిక, శారీరక నైవేద్యం సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం

మన మనసు ఎలా ఉండాలి, దేవునికి పనికి వచ్చే స్వచ్చమైన పువ్వులాగా ఉండాలి సాత్విక బుద్దితో. మనకు జగమంతా దైవం కనపడాలి. మనము కేవలము సాక్షీభూతులము, జరిగేవి గమనిస్తూ ఉండటమే, మనల్ని మాట సాయం అడిగినప్పుడు, వారి మానసిక ధైర్యం పెంచడానికి, వారి పతనం ఆపడానికి సలహా ఇవాలి. అదే భక్తి సాధన, మనసు పరుగును ఆపి, వారికి అంటుకున్న మాయను బాపు. ఆత్మనే అంటే స్వస్వరూపాన్ని, మరచిపోవొద్దోయి, జీవా అని గుర్తు చేయడం వరకే మనపని, మాట రాత పాట చిత్రము వీడియో నైవేద్యంతో.

ప్రపంచమోహం మీ/ మన కోసమే, ఖుషిగ వస్తుంది, కపట నటనల చలాకినవ్వు చిందించుచు, మత్తును గమ్మత్తును తెస్తుంది. ఆ మాయ బ్రమలన్ని మీ/ మన బుద్దిని, పతనం చేసేను. అవి విషములాగా మీ/ మన గుండెలో, నాటుకుపోయేను జాగ్రత్త జీవా. అందుకే సాధనే పెంచి, త్యాగమే పంచి, హ్రుదయములోని దైవముతోనే, నడవాలి ప్రతి రోజు, జీవా.

మరి సాధన ఎలాగా, మరీ మరీ దైవ నామాలను, ప్రతి నిత్యం స్మరణం చేసేము. పదే పదే ఆ దేవుని గీతాలకు, పల్లవి పాడేము. ఎన్ని యుగాలకైనా, ఆచరణలో వేద నాదాలమై, మనమే వుంటాము. అనంతకాలం, దైవ రూపమే, మదిలో స్మరించుకుందాము. మనసు మీదే, సాధన నేర్పే బాధ్యత మాదే, రేయిపగలు, మాలో మీలో వున్నది, దైవం అని మరువకు.

గులాబిపువ్వై, ఉండాలి మనసు.
జగాన దైవం, నిండా.లిలే..
ఇలాంటి వేళ, పాడాలి భక్తిగా..
ఇలాగె సాధన, ఉండా.లిలే..
మనసు ఆ..పి, మాయ బా..పి
ఆత్మనే, మరచిపోవొద్దోయి, జీవా... ||గులాబిపువ్వై||

ప్రపంచమోహం మీకోసమే, ఖుషిగ వస్తుంది
చలాకినవ్వు చిందించుచు, మత్తును తెస్తుంది
బ్రమలన్ని మీ బుద్దిని, పతనం చేసేను
విషములాగా మీ గుండెలో, నాటుకుపోయేను
సాధనే పెం.చి, త్యాగమే పం.చి
దైవముతోనే, నడవాలిరోజు, జీవా.||గులాబిపువ్వై||

మరీ మరీ దైవ నామాలను, స్మరణం చేసేము
పదే పదే ఆ గీతా.లకు, పల్లవి పాడేము
యుగాలకైనా, నాదా.లమై, మనమే వుంటాము
అనంతకాలం, దైవ రూ.పమే, స్మరించుకుంటాము
మనసు మీ.దే, సాధన మా.దే
రేయిపగలు, మాలో వున్నది, దైవం..||గులాబిపువ్వై||

Original

గులాబిపువ్వై, నవ్వా.లి వయసు.
జగాన వలపే, నిండా.లిలే..
ఇలాంటి వేళ, ఆడాలి జతగా..
ఇలాగె మనము, ఉండా.లిలే..
మనసు దో.చి, మాయజే.సీ
చెలినే, మరచిపోవొద్దోయి రాజా, రాజా. ||గులాబిపువ్వై||

వసంతరాణి నీకోసమే, ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు, హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర, నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో, కాపురముంటాను
వలపు పెం.చి, మమత పం.చి
విడిచిపోనని, మాటివ్వాలి రాజా, రాజా.||గులాబిపువ్వై||

మరీ మరీ నీ అందా.నికీ, సలాము చేసేను
పదే పదే నీ గీతా.నికి, పల్లవి పాడేను
యుగాలకైనా, నాదా.నివై, నీవే వుంటావు
అనంతకాలం, నీ రూ.పమే, వరించుకుంటాను
మనసు నీ.దే, మమత నీ.దే
రేయిపగలు, నాలోవున్నది నీవే, సోనీ..||గులాబిపువ్వై||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,305; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424
Dt : 09-Feb-2024, Upd Dt : 09-Feb-2024, Category : Songs
Views : 145 ( + More Social Media views ), Id : 2016 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Gulabi , Puvvai , Bhakti , Parody , Annadammula , Anubandham , NTR , Kanchana , Balakrishna , Latha , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content