ఎంతో మందికి, సహాయం. చివరకు మమ్మల్నే నిందిస్తూ దూరంగా. ఆఖరుకు చుట్టాలు, భాగస్వామి, పిల్లలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,998; 104 తత్వాలు (Tatvaalu) and views 224,528.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

We helped many people. Finally they blame us and keep us away. In the end, relatives, friends, life partner, even own children also keep us away, why?

ఏవండీ, ఎంతో మందికి, మేము సహాయం చేసాం. చివరకు మమ్మల్నే నిందిస్తూ దూరంగా పెడుతున్నారు. ఆఖరుకు చుట్టాలు, స్నేహితులు, జీవిత భాగస్వామి, సొంత పిల్లలు కూడా దూరంగా ఉంచారు, ఎందుకని?

అందుకే మనము ముందు మన గురించి తెలుసుకోవాలి. మనము చేతలలో ధర్మం వైపా, అధర్మం వైపా? మనది చేతలలో సాత్వికతా లేక రజో తమో గుణ బానిసత్వ బలహీనతా? దానిని బట్టి మన ఫలితాలు. మన శనివార సత్సంగం అదే.

మనము తెలుసుకో లేక పోతే, చుట్టాలు, స్నేహితులు, జీవిత భాగస్వామి, సొంత పిల్లలు కూడా బుద్ది చెప్పి నేర్పుతారు వెన్నుపోటు, గుండెపోటు తో.

మనం ఎవరికి సహాయం చేసినా స్పష్టం గా (పేర్లు అవసరం లేదు) గర్వంగా చెప్పాలి ఇలా, తర్వాత ఫలితాలు మనకే కదా.

1. మనది సాత్విక ధర్మ గుణం కాబట్టి, అహంకారముతో అపాత్రా దానం చెయ్యకుండా, నిస్వార్ధముగా, రామ లక్ష్మణులు సీత లాంటి లక్షణాలు గుణాలు, సజీవ గురువు సేవలు, ఉన్న వారికి సహాయం గా అండగా ఉన్నాము, ఉచితముగా సేవలు చేసాను.

2. మనవి రాక్షస లక్షణాలు కాబట్టి, రజో తమో గుణ ప్రేమికులుగా, మంధర లంఖిణీ కైక శూర్పణఖ రావణ ధుర్యోధన లాంటి లక్షణాలు, అబద్దాలు కపటం నాటకం 2 నాల్కల ధోరణి, ముదుసలి అమ్మ నాన్న అత్త మామలను వదిలేసిన లేదా వారి ధనంతో వారికి సేవలు చేసే/ చేయించే వారికి, తాగుబోతు తిరుగుబోతు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు, పెళ్ళై భాగస్వామి పిల్లలు తో కలసి ఉండని, వారికి అండగా ఉంటాము. ఎందుకంటే వారు మాకు సహాయం చేస్తారు, మా స్వార్ధం మాకు ముఖ్యం, తోడు ఎవరో ఒకరు ఉండాలి కదా, సామాను తెస్తారు, మంచి చెడ్డకు పలుకుతారు, అద్దె ఇస్తారు, కారులో తిప్పుతారు, ఆసుపత్రిలో ఉచిత మందులు ఇస్తారు. ధర్మం మాకు ముఖ్యం కాదు, అవసరం, అవకాశం, బ్రమలు, ధనం, సౌకర్యాలు, గొప్పలు అంతేను.

అని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చెప్పాలి.

* * *

పై 1 వ జాతి వారు, తమకు మేలు చేసిన ఎవరినీ, జీవితాంతం మరువరు, విడువరు. అలాగని వారు తప్పు చేస్తే, సమర్ధించరు. చాలా అవకాశాలు ఇస్తారు మారమని, మారకపోతే, వదులుతారు. తమ లేదా ఇతరులనైనా, ముదుసలి తనములో, దేవతలు గా కాళ్ళు కడిగి, పూజిస్తారు, తమ సొంత బిడ్డలుగా చూస్తారు. ఈ 1 వ జాతి వారు చేసే అన్ని మంచి పనుల ఫలితాలు, ఆ పైన సహాయం చేసిన వారందరికీ దీవెనలు గా, కష్ట సమయములో ఆటోమేటిక్ గా ఆదుకుంటాయి.

చూసారు కదా, పై 2 వ జాతి వారు, తమ స్వార్ధం బట్టి, బుద్ది రంగులు మారుస్తారు. మరి వీరి నీడలో పెరిగిన/ మరిగిన భాగస్వామి, పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు ఏమి చేస్తారు? వారికి అదే స్వార్ధ బుద్దితో, చెప్పు దెబ్బలు వేసి, వెన్నుపోటు గుండెపోటుతో చీత్కరించి, ఒంటరిగా లేదా అనాధాశ్రమాలలో కూర్చో పెడతారు, వారి పాపపు సంపాదనను కొట్టెస్తారు. వీరు ఇచ్చింది స్వార్ధం ప్రపంచానికి, తమ సొంత పిల్లలకు, వారు అదే తిప్పి బహుమతిగా మనము రోగం లేదా ముదుసలి వయసులో ఉన్నప్పుడు తిరిగి ఇస్తారు. ఇదే పంచభూతాల శిక్షణ. శని దేవుని దీవెన.

పై 2 వ జాతి వారు, అరే ఎప్పుడూ, మా మనసు బలహీనత, రాక్షసులు కు సహాయం చేయాలని తహతహ. రాముడు వాలికి రావణునికి అలాగే క్రిష్ణుడు కౌరవులకు దూరముగా ఉన్నా, మేము పూజలు నటిస్తూ, ఇలా దురాశ తో, నెత్తిన సమస్యలు తెచ్చుకోవడం, గట్టిగా జవాబు చెప్పలేకపోవడం, ఇంక మా మనసు కు బలం ఎప్పుడు వస్తుంది? రేపు పిల్లలు లేదా శని ఇవ్వబోయే పరీక్ష ఎలా తట్టుకుంటాం? మనం ఇప్పుడు అయినా మారాలి, లేకపోతే వచ్చే 7 ఏళ్ళు ఏలినాటి శని తట్టుకోలేక పోతాము అని ఈ రోజు అనుకుని, రేపు మరచిపోతారు. ఎందుకంటే, మానసిక బలహీనత, మోహం, బ్రమలు వీరిని స్తిరం గా ఉండనీయవు. అంటే, తమ గొయ్యి తామే తీసుకుంటారు.

వీళ్ళ ఆలోచనలు, వీరి సహాయం ఎలా ఎవరికి ఉంటుందో ఒక ఉదాహరణ. ధనం ఉండి, ఇళ్ళు ఉండి కూడా, స్మశానము లేదా ఆసుపత్రి లేదా గుడి లో ఒక గది దొరికితే, అక్కడే తలదాచుకుని, పబ్బము గడుపుకుంటాము అని అనుకుంటారు. రాత్రి 10 తర్వాత కూడా, పెళ్ళికి వెళ్ళి మరలా రాత్రే తిరిగి వస్తారు, నీతి నియమాలు ఎక్కవు, ఆచరించరు. సరదాగా గాలికి తిరుగుదాము అంతే.

మామూలుగా స్మశానం లో పని చేస్తున్న వారు కూడా బయటనే ఉంటున్నారు. కొంతమంది లోపల ఉన్నా కూడా, వాళ్ళ బతుకు తెరువుకు, తప్పదు, ధనం ఇల్లు లేకపోవడంతో ఉండవచ్చు. ఆసుపత్రి కూడా అంతే కదా. రోగులకు నిలయం లో, ఊరక గది ఇచ్చినా మనం ఉంటామా? అందులో చిన్న/ పెద్ద వయస్సు అసలు ఉండవచ్చు నా, ఉచితంగా అని? నైట్ డ్యూటీ లేదా పొద్దున్నే పనుంది రమ్మంటే, మనం పరుగులు తీయవద్దా?

మనకు ఏం గతిలేక రోగాలతో కాపురం? కక్కుర్తి తో, మైండ్ తమో గుణం లో ఉంటే, బురదే పన్నీరు ధనాశతో? అలాంటి వారిని ఇంట్లో పెట్టుకుని, ఏదో ఒకపనికి తోడుగా ఉంటారు, అద్దె ఇస్తారు అని మనము కక్కుర్తి పడవచ్చునా? మన పిల్లలు, మనుమలు, బయట వారికి, భక్తులు గా మనము ఇచ్చే సమాన స్ధిర సలహా ఇదేనా?

ఇలా కప్పదాటు గా మనం ఉంటే, మనకు ఫలితాలు అవే వస్తోంది కదా. ఏది మనం ఆలోచన చేసిన అదే మనకు లభిస్తుంది. పిల్లలు, అల్లుడు, కోడలు కూడా మనం ఏది అడిగినా, కప్పదాటు జవాబు లే ఇస్తున్నారు/ ఇస్తారు.

అంటే మనకు నీతి నియమం నిజాయితీ స్ధిరం త్యాగం లేదు అని, వారు కూడా మనల్ని లెక్క చేయడం లేదు, గౌరవించరు. ఎందుకంటే మనది చంచల మోహ దురాశ మనసు కాబట్టి. ప్రతి మోహానికి లొంగి పోతుంది, సహాయం దూర్తులకు అనే ముసుగులో.

ఇప్పుడు ఇబ్బందులు ఎవరికి? అందుకే మనసా వాచా కర్మణా, ఏదో ఒకవైపు ఉండాలి. దైవ గుణం లేదా రాక్షస గుణం. మనది రాక్షస గుణం అని పిల్లలు/ కోడలు/ అళ్ళుళ్ళు తేల్చేసారు. మనలాగే దొంగ బుద్ది అని, మనల్ని దూరం పెడతారు, గౌరవం ఎందుకు ఇవ్వాలి అని. ఆ అవకాశం ఇచ్చింది, మన పనులు ఆలోచనలు కర్మలు. మారదాం ఇప్పుడు అయినా. ముందు ముందు చాలా అవమానాలు వెన్నుపోటులు గుండెపోటులు, రాక్షస అండ ఆలోచన కు.

మనం తల్లి మే కదా, ముదుసలి తల్లి కి చేసిన ద్రోహం, మనకు బాధగా అనిపించలేదు కదా. మరి మన సొంత పిల్లలు చేస్తున్నది తప్పులు అని ఎందుకు అంటున్నాము? వాళ్ళ కు భార్య/ భర్త, పిల్లలు సమస్యలు వంద ఉన్నాయి, మనలాగే వారికి దురాశ స్వార్ధం ఉంటాయి కదా, నీతి గా ఎందుకు వారు ఉండాలి మనతో, మహిళ గా అర్థం చేసుకోవాలి కదా?

ఎందుకు కప్పదాటు? మనకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయమా? ఇంకో తల్లి బాధ మనకు అనుభవానికి రావాలి అంటే, దైవం పిల్లల చేత చెప్పుతో కొట్టించి, ఇలా పాఠం చెప్పిస్తున్నారు అని మనము అర్ధం చేస్తుకోవాలి కదా?

మామ మంచి వారు అయితే, అల్లుడు వెన్నుపోటు పొడుస్తారా? బాబాయి మంచి వారు ఇతే, అబ్బాయి గుండెపోటు అంటారా? మన తప్పులు కఠిన శిక్షణ సమయములో మాత్రమే ఒప్పుకుంటాము. ఏది తెలిక, మన సందేశాలతో మారడమా లేక శిక్షణా?

మేము, సమాన కుసంస్కారం గుణం గల, శూర్పణఖ మంధర లంఖిణీ రావణ కే ఆశ్రయం అండ సహాయం ఇస్తానని ఇవ్వు, ఎవరు వద్దు అన్నారు. ఆల్రెడీ మన చుట్టూ వారే ఉన్నారు, అవకాశం అవసరం కోసం. రామన్న అనుభవం చూద్దాం. తర్వాత అంకం మనకు అనుభవం అవుతుంది, పాఠాలు దెబ్బ లతో నేర్చుకోవాలి కదా. కాబట్టి వెన్నుపోటు గుండెపోటు తప్పు కాదు, ఎందుకంటే కొంత మంది అదీ తప్పుడు లక్షణాలు గల వారికి సహాయం కు, మనం ముందు ఉన్నాం కాబట్టి. అదే ముదుసలి తల్లి సజీవ గురువు సేవకు, ఓ మూడేళ్ల సమయం కావాలి.

కోడలు, ఆడబిడ్డ ఆడవాళ్లు కాదా? అల్లుడు, కొడుకులు మగ బిడ్డ లు కాదా? సమాన ప్రేమ అందరిపై ఉండదా? అంటే మన ప్రేమ ద్వేషం, గుణం ధర్మం న్యాయం మంచిని బట్టి కాదు, వ్యక్తి ని అవసరం అవకాశం ను బట్టి? అది దైవ ద్రోహం అంటేఅ ఆత్మ ద్రోహం కాదా?

కేవలం ద్రోహుల మీదే, ప్రేమ ఎందుకు ఉంటుంది, మన పూజల పరమార్ధం ఇదేనా?

మండోదరికి భర్త మీద ప్రేమ లేదా, తన భర్త దానవుడు తప్పుడు వాడు అని చెప్పిన? క్రిష్ణుడికి ప్రేమ లేదా, తన బిడ్డ సాంబుడు తప్పుడు వాడు అని చెప్పి దూరంగా ఉంచినందుకు?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,998; 104 తత్వాలు (Tatvaalu) and views 224,528
Dt : 18-Feb-2024, Upd Dt : 18-Feb-2024, Category : General
Views : 115 ( + More Social Media views ), Id : 2025 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : helped , people , blame , keep , away , relatives , friends , children , partner
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content