డబ్బు మోహం ఎక్కువై, సంస్కారం బుద్ధి సిగ్గు తక్కువై, పబ్బుల్లో దొరికిన పిల్లలు, బయటపడిన పెద్దల గబ్బు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1618 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1653 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

డబ్బు మోహం ఎక్కువై, సంస్కారం సాంప్రదాయం బుద్ధి సిగ్గు తక్కువై, పబ్బుల్లో దొరికిన పిల్లలు, బయటపడిన పెద్దల గబ్బు

ప్రాపంచిక వ్యామోహం పద్దతులు, తప్పు, ఎవరివి?

సంస్కారం అంటే తెలియని పిల్లల దా, వారి పెంపకం దా?

లేక వాళ్ళ కు సొంతం గా కష్టపడి సంపాదించే మరియు మంచి పనులు చేసే గుణం లేకుండా చేసి, మంద మరియు మందు బుద్దులు గా చేసి, ఖరీదైన మోటారు బండ్లు ఇచ్చి రోడ్డు మీదకు ఊరు మీదకు వదిలి, ఆడ మగ తేడాలేకుండా, తాగి తందనాలు ఆడమని, అర్ధరాత్రి పబ్ లకు వదిలిన, సంస్కారం లేని, తల్లిదండ్రులు దా? వారి గాలి మోసపు సంపాదనదా? మరి ఎందుకు ఇలా?

మా పిల్లల కు సంబంధం లేదు అని పిచ్చి ప్రకటనలు ఇస్తున్నారు, ఇంకా నటిస్తున్నారు, పిల్లల ను పతనం వైపుగా, వీరే నడుపుతూ. పాము తన పిల్లలను తామే నాశనం చేసే విధంగా.

ఉత్తమ పెద్దలు ధైర్యంగా మేము ఇంట్లో ఉగాది పచ్చడి పెట్టకపోతే, చేసుకునే ఓపిక లేక, మా వంశ ఆచారం ప్రకారం, అర్ధ రాత్రుళ్ళు మరియు తెల్ల్వారు ఝామున, మా ఇంటి ఆడ మగ పసి పిల్లల ను, స్వయంగా మేమే ధనమిచ్చి బండి ఇచ్చి, వారి భవిషత్కు ఉపయోగపడే, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కూచిపుడి నాట్యం, ఆయుర్వేద మందు కోసం మాత్రమే, నైట్ పబ్ లకు పంపామని ధైర్యంగా ఎందుకు చెప్పరు?

మా ధనంతో మా కుటుంబం పతనమైతే, మీకు నష్టం ఏమిటి అని నిజాయితీగా అడగరు? భయం ఎందుకు? అందుకు కదా, నటనలేని రాక్షసులు మన కన్నా నయం అంది?

కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, హోం థియేటర్ హోం బార్ లాగా, ఈ కార్యక్రమాలు కూడా, ఇంట్లోనే స్నేహితులతో పెట్టుకుని, పతనానికి బాటలు వేసుకోవచ్చు కదా? మరలా పబ్ కు డ్రైవింగ్, పెట్రోల్, ఎంట్రీ ఫీజ్, తిండి తాగుడు వ్రుధా ఖర్చు, తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు, పోలీసు కేసులు ఎందుకు?

ఆ తర్వాత లంచాలు ఇచ్చి, మీడియా నోరు లేదా ఇంకొకరి నోరు మూయించి, అంతా చాటుగా, క్లోజ్ చేయడమెందుకు. మన వంశ గౌరవం ఒకటి, ఇతరుల వంశ గౌరవం ఇంకోటా? ఇదేనా మన అన్న ఎంటీయార్ కు వారసులు గా, మనం చేస్తున్న మంచి?

తాము చేసిన ఒక తప్పుకు, ఇంకొన్ని తప్పులు కలిపి, ఇంకొంత మందిని నీతి లేని వారు గా చేసి, చివరకు ఆ పిల్లలు మత్తులో డ్రైవ్ చేస్తూ ఏదైనా అయితే, నష్టం ఎవరికి? స్నేహితులు గా వారితో వెళ్ళిన సామాన్యుల బతుకు ఏమిటి? ఆలోచన చెయ్యండి. పిల్లలను సంస్కారవంతులుగా తీర్చి, తెలుగు జాతి భాష దేశ రుణం తీర్చుకోండి.

పెద్దల పాపం, పిల్లల ను పతనం చేయడం అంటే ఇదే ఉదాహరణ, ఎన్ని జరిగినా, ఎంతమంది పరువు పోయినా, ఎంతమంది ప్రాణాలు పోయినా, వీరు మారరు వీరి బుద్ధి మారదు.

జనం ఊసినా పెద్ద వాళ్ళు, తుడిచేసుకుని వెళ్ళి పోతారు, ఎందుకంటే ధనం ఎక్కువ అయే కొద్ది, మనసు మమత జ్ఞానం తక్కువ అవుతుంది. ఏది మంచో ఏది చెడో విచక్షణ పోతుంది.

ఏది ఎక్కువ కాకూడదు, ఎక్కువ అయితే, ఆ వంశం పతనం అవుతుంది, ఒకటి రెండు తరాలలో, ఎందుకంటే బుద్ధి కుంచించుకు పోతుంది. పాయసం పది కప్పులు తాగండి, వాంతి అవుతుంది.

బయట పడిన పేర్లు కొన్ని మాత్రమే, ధనం తో దాచిన పేర్లు చాలా ఉన్నాయి. దేవుని ఆ పిల్లల పెద్దల కర్మ పుస్తకం లో మార్చగలమా?

మనం 5 ఏళ్ళుగా మొత్తుకుంటున్నది ఇదే, పెరగాల్సినది సంపాదన కాదు, సంస్కారం అని.

అబ్బే మేం ఫుల్ బిజీ, ప్రజా సేవలో మరియు ధనం సంపాదనలో. పిల్లలు దే ముంది, వాళ్ళ పతనం వారే పొందుతారు, మన వంశ ప్రతిష్ట ను నాశనం చేయాలి.

పెరుగుట విరుగుట కొరకే. కేసులు లేకుండా, పేపరు లో పేర్లు లేకుండా చేసుకుంటారు. కానీ పంచభూతాల సాక్షం ని తుడపలేరు, భవిష్యత్తు ఫలితాలు ను ఆపలేరు.

మిగతా విషయాలు వివరాలు అందితే, లింకు ద్వారా వెబ్సైట్ లో మన వాట్సాప్ స్టేటస్ లో పెడదాం.

మీకు పిల్లల కు సంస్కారం నేర్పే సమయం లేకపోతే, మన కధనాలు ఉచితం గా చదివించండి, సాధన చేయించండి గురువు లు, పిల్లల పతనం ఆపండి, బాధ్యత మీదే, ఫలితాలు మీకే.

https://www.sakshi.com/telugu-news/crime/banjarahills-pub-drugs-case-minors-allowed-pub-party-against-rules-1446332

ఈ కేసులో ఏ1 అనిల్‌, ఏ2 అభిషేక్‌, ఏ3గా ఎన్టీఆర్‌ కూతురి అల్లుడు అర్జున్‌ వీరమాచినేని, మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు కిరణ్‌రాజ్‌ను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు.

వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్‌బాస్‌ విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ఉన్నారు.

చూడండి సాక్షి లింక్ వివరాలు. దమ్మున్న పత్రికలు, ఆనాడు ఇంద్రజ్యోతి ఇతర పచ్చ మీడియా కూడా ఇలా స్పష్టముగా రాస్తే, లింక్ లు పంపగలరు.

పచ్చ మీడియా ఓ వైపు పూర్తి వివరాలు దాచినా, జర్నలిజం విలువలు వదిలినా, బులుగు మీడియా, కొంత సమాచారం బయటపెడుతుంది.

చంద్రన్న పచ్చ మీడియాకు చెప్పాలి, నటించాలి కాని, మరీ ఇంత బానిసత్వం దాపరికం చూపకూడదు, నిజాల్ని దాచి, ఇక ఎవరు నమ్మరు కొనరు చూడరు అని హితవు పలకాలి.

అందుకే భిన్న ద్రువాల మీడియా ఉండాలి. అందరికీ నిజాయితీ ఉండాలి అమ్ముడుపోకుండా. జనం కూడా, వర్గ రజకీయాలకు బానిసలు కాకుండా, నిజమైన వార్తలు చూడాలి.

అక్కడ దొరికిన 150 మంది పేర్లు కూడా వేసి, వారికి సంభందించిన వివరాలు బంధుత్వం కూడా రాయాలి. ధనం లేక గొప్పవారి బిడ్డలు పబ్బులు నడుపుతున్నారు అని మరియు ధనము ఎక్కువై ప్రసాదానికి అర్ధరాత్రి అక్కడకు వెళ్ళారు, తప్పులేదు మేమే పంపామని అని నిజాలు రాయవచ్చు కదా.

high money lust culture tradition shame low drug children found in pubs, stink of adults out  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1653 General Articles, 61 Tatvaalu
Dt : 03-Apr-2022, Upd Dt : 03-Apr-2022, Category : General
Views : 539 ( + More Social Media views ), Id : 1328 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : money , lust , culture , tradition , shame , drug , case , hyderabad , children , pubs , adults , Radisson
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content