పాటతో పరమార్ధం - ఇది పాట కానే కాదు (పేరడీ) - తలంబ్రాలు - రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, జీవితం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,047; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Idi pata kanekadu (Parody) - Talambralu - Rajasekhar, Kalyan Chakravarthy, Jeevitha

ఇది లేదా మనము ఇప్పుడు దాకా పంపినవి పాటలు కానే కాదు, ఏ రాగం కూడా మాకు రాదు. కానీ ప్రాపంచిక బ్రమలులో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, తోటి మానవులు అకాల బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, మరణాలు, అప్పులు, వెన్నుపోటులు, గుండెపోటులు, ద్రోహాలు, మోసాలు, చీత్కారాలు, రోగాల తో పొవడం భరించలేక, వేదన శృతిగా, రోదన లయగా, సాగే గానాలు, వ్రాత నైవేద్యంలు ఇవి, ఆ దేవునితో పాటుగా, దైవ సంతానానికి, అంటే మీకు.

ప్రతి నిత్యం టీవీలో, పేపర్లో, సోషల్ మీడియా లో ఎన్నో ఘోరాలు, నేరాలు, మోసాలు, ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతున్నాయి అని. ఏంటో ఈ లోకం అంతా, ఇలా విలువలు లేకుండా దిగజారిపోయింది, మా సంస్కార ఇంట్లో తప్ప, అని బాధ/ బ్రమ/ మాయ ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబములో.

1) ఇంతలో ఒక కుటుంబ తల్లి దండ్రులు, వేరే ఊరికి వెళ్ళారు. వారి 19 ఏళ్ళ 2 వ కూతురు, పరాయి మత ప్రియుడితో, ఇంట్లో అర్ధరాత్రి దోపిడీకి, పధకం వేసింది. అక్కతో కలసి బిర్యాని తిని, మందు తాగి నిద్రపోయారు. రాత్రి ప్రియుడు వచ్చారు, నగలు దొంగి లించ బోయారు. అక్క వద్దని ప్రతిఘతించింది ఆ మత్తులోనే. ఆమెను హత్య చేసి, అందినంత దోచుకుని పోయారు. తర్వాత పట్టుబడి జైలు. అంటే, తమ పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎలా వారి గుణాలు మారుతున్నాయో, గమనించే స్తితిలో మన కుటుంబాలు లేవు. ధన సంపాదనలో, భోగ భాగ్యాలలో, భార్య భర్త బిజీ. ఇక్కడ కూడా, అవసరం, అవకాశవాదం, అధికారం/ ఉద్యోగం, ధనం, లెక్కలేని తనం.

2) ఇంతలో ఒక మామ, తన కూతురుని ఇచ్చి, ఒక అబ్బాయికి పెళ్ళి చేసాడు. కోట్లు తో పాటుగా పదవి ఇచ్చారు. కానీ వంకర గుణం రేపు తననే వెన్నుపోటు పొడుస్తుంది అని మోహములో గమనించలేకపోయారు. తాను కూడా, 2 వ పెళ్ళికి, ఒక కుటుంబాన్ని చీల్చి పెళ్ళి చేసుకున్నారు. కనీసం తన సొంత పిల్లలు కూడా, తనకు అండగా నిలవకుండా, చీత్కరించారు, పెళ్ళికి ముందు అలాగే తర్వాత అల్లుడి కోసం. ఇన్నాళ్ళు తన ఎదురు నటించిన వారు, అందరూ ఎదురు తిరిగారు, చాటుగా వెన్నుపోటు పొడిచారు. ఒంటరి అయ్యారు. ఆ గుండె బాధ తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక, కుళ్ళి కుళ్ళి తన పతనాన్ని తానే కోరి కొనుక్కున్నారు. మోహం, అహంకారం, అధికారం, ధనం, లెక్కలేని తనం, మనల్నే మట్టి కరిపిస్తాయి, మన సొంత వారిచే, అని తెలుసుకోలేకపోయారు. నువ్వే మాగుణాలకు సరిపోయే ఉత్తములు అని, జనం అల్లుడుని ఎన్నుకున్నారు. బావని, మెంటల్ సర్టిఫికేట్ తో కాల్పుల కేసునించి కోర్టులో పోరాడి తప్పించారు, నాయకుని గా జనం ఎన్నుకున్నారు.

3) ఇంతలో తండ్రి అనుకోకుండా పోయారు, చెల్లి తో ఆస్తి పంపకాల గొడవ, 50 గదుల ఇళ్ళు వీలైన చోట్లల్లా. కేసులతో జైలు కు వెళ్ళి వచ్చారు. నువ్వే మాగుణాలకు సరిపోయే ఉత్తములు అని, జనం అబ్బాయిని మెజారిటీతో ఎన్నుకున్నారు. బాబాయి తోడు నీడ గా ఉన్నారు. అవసర అవకాశాలతో అందరూ కలసి మెలసి బాగున్నారు. ఒక రాత్రి బాబాయికి గుండె పోటు వచ్చింది పోయారు అని ఒకరు, కాదు గొడ్డలి పోటు అని ఇంకొకరు, ఎవరి సాక్ష్యాలు వారు చూపించారు. ఇక్కడ కూడా, అవసరం, అవకాశవాదం, అధికారం, ధనం, లెక్కలేని తనం.

4) ఒక ఉత్తమ జాతి ఉంది - ఇది ఎప్పుడు కూడా, ఆవులను, ఉచితముగా ఓట్లు వేసి గెలిపించదు. మంచిని పాటించదు, చదవదు, ప్రచారం చేయదు, మెచ్చదు. తన గుణాలకు సరిపోయేట్లుగా, నక్క పులి పాము లంతే ఎన్నుకుంటుంది. తర్వాత మరలా నాయకులు మమ్మల్ని మోసం చేసారు అంటుంది. పన్నులు పెంచారు అంటుంది. తన బుద్ది వంకర అని మాత్రం ఒప్పుకోదు. బ్రమ్మం, రాఘవేంద్ర, వేమన లాంటి గురువులు వద్దు, పరాయి మత బాబాయిలు ముద్దు అంటుంది. అందుకే వారి పిల్లలు కూడా, ముదుసలి తల్లి దండ్రులు అత్తమామలు వద్దు అని, ఇంట్లో లేదా ఆశ్రమాలలో ఒంటరిగా వదులుతున్నారు. వీరికి ఇంక జ్ఞానము రాదు. అంతా కరోనా, భూకంపాలు, సునామీ లాంటి పెద్ద గురువులే వచ్చి రాతలు మారుస్తారు అని వీరి ఉద్దేశ్యం.

అన్నిటిలో కామన్ గా ఉన్నది, అవసరం అవకాశం, నమ్మక ద్రోహం, నిర్లక్ష్యం, బద్దకం, లెక్కలేని తనం, ఆశ, దురాశ, అంతా నేనే నాకే ఉండాలి అన్న కాంక్ష. ప్రతి ఇంట్లోనూ ఉంది 80 శాతం. పాలు కల్తీ, అన్నం కల్తీ, వైద్యం కల్తీ, విద్య కల్తీ, న్యాయం కల్తీ, రక్షణ కల్తీ, ప్రేమ కల్తీ, బంధం కల్తీ. కానీ వారెవ్వరు ఒప్పుకోరు. వారికి తెలుసు, పెళ్ళి కూడా, ఆత్మలను అమ్ముకుని/కొనుక్కుని మాత్రమే జరిగింది అని, కానీ తప్పు ఒప్పుకోరు. తమ ముదుసలి తల్లి దండ్రులను, భాగస్వామిని ఇచ్చిన అత్త మామలను చూడరు, అలాగే తమ పిల్లలు చూడరని తెలుసు, అయినా తప్పు ఒప్పుకోరు. పండగకు, శనివారానికి, దేవాలయాల నిండా జనం, జనం - వీరంతా నిజ భక్తులు. ఇది నేటి సమాజం. అందరమూ అందులో పతనము అవుతాము.

మన ప్రతి పాటతో పాటుగా ఎన్ని విన్నపాలు జనాలకు చేరుతున్నాయో చూడండి, వారి ముదుసలితనం భవిష్యత్ రాతను బట్టి వారు చదువుతారు/ చదవరు, ఆచరిస్తారు/ చీత్కరిస్తారు, స్పందిస్తారు/ స్పందించరు - 1. మన శని వార సాధనలు 2. గాత్ర వ్రాత నైవేద్యం మీరు పెట్టమని ప్రోత్సాహం 3. ముదుసలి తల్లి దండ్రి అత్త మామలను దగ్గర ఉంచి చూసుకోమని విన్నపం 4. పిల్లలకు సంస్కారం నేర్పితే మనకు ఉండి, మనల్ని ముదుసలి తనములో, దేవతలు గా కొలుస్తారు అని మేల్కొలుపు 5. నాయకులది తప్పు లేదు, వారిని ఎన్నుకున్న మన నక్క, పాము, పులి గుణాల ఓటర్లు దే మొదటి తప్పు, 6. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడండి, లేకపోతే పంచభూతాల శిక్షణ తప్పదు, ఇలా ఎన్నో విన్నపాలు జాగ్రత్తలు కూడా వెళుతున్నాయి, మరువద్దు సుమీ.

ఇది పా.ట కానే. కాదు, ఏ రా.గం. నాకు రాదు 2
వేదన శృతిగా, రోదన లయగా.. సాగే గానమిది ...
ఆ......ఆ....ఆ....ఆ....ఆ...
ఇది పా.ట కానే. కాదు, ఏ రాగం. నాకు రాదు 2

ఒంటరిగా తిరుగాడు జీవినొక, మనిషి చూసినారు..
చెంతకు చేరదీసినారు
అభము శుభము తెలియని జీవి, వారిని నమ్మిందీ..
తన హృదయం తెరిచిందీ
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ...
తను బలియై పోతిననీ..

ఆ జీవిగుండె కోత.., నా గాధకు శ్రీకారం..
నే పలికే ప్రతి మాటా, జీవ జాతికి సందేశం..
ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ||ఇది పా.ట||

ఇప్పుడు కూడా నయవంచకులు, కపటులు ఉన్నారు...
కాలరాస్తూ ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు, బలి ఔతున్నారు...
జీవులు బలి ఔతున్నారు
నిప్పులు చెరిగే ఈ అమానుషం, ఆగేదెప్పటికీ...
చల్లారేదెప్పటికీ..

ఆ మంటలారుదాకా.., నా గానామాగిపోదు..
ఆ రోజు వచ్చుదాకా.., నా గొంతు మూగపోదు.. ||ఇది పా.ట||

Original

ఇది పా.ట కానే. కాదు, ఏ రా.గం. నాకు రాదు 2
వేదన శృతిగా, రోదన లయగా.. సాగే గానమిది ...
ఆ......ఆ....ఆ....ఆ....ఆ...
ఇది పా.ట కానే. కాదు, ఏ రాగం. నాకు రాదు 2

ఒంటరిగా తిరుగాడు లేడినొక, మనిషి చూసినాడు..
చెంతకు చేరదీసినాడు
అభము శుభము తెలియని లేడి, అతనిని నమ్మిందీ..
తన హృదయం పరిచిందీ
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ...
తను బలియై పోతిననీ..

ఆ లేడి గుండె కోత.., నా గాధకు శ్రీకారం..
నే పలికే ప్రతి మాటా, స్త్రీ జాతికి సందేశం..
ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ||ఇది పా.ట||

ఇప్పుడు కూడా నయవంచకులు, ఇంద్రులు ఉన్నారు...
కామాంధులు ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు, బలి ఔతున్నారు...
అబలలు బలి ఔతున్నారు
నిప్పులు చెరిగే ఈ అమానుషం, ఆగేదెప్పటికీ...
చల్లారేదెప్పటికీ..

ఆ మంటలారుదాకా.., నా గానామాగిపోదు..
ఆ రోజు వచ్చుదాకా.., నా గొంతు మూగపోదు.. ||ఇది పా.ట||

ఇది పాట కానే కాదు - చిత్రం: తలంబ్రాలు (1986) - సంగీతం: సత్యం, గీతరచయిత: రాజశ్రీ, నేపధ్య గానం: సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,047; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380
Dt : 22-Mar-2024, Upd Dt : 22-Mar-2024, Category : Songs
Views : 99 ( + More Social Media views ), Id : 2063 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Idi pata kanekadu , Idi Paata Kane Kadu , Idi pata kane kadu , Talambralu , Rajasekhar , Kalyan Chakravarthy , Jeevitha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content