వారానికి రెండు రోజుల అద్దె పిల్లల పలకరింపు గా ఉంటే, ఆ పిల్లల భవిష్యత్తు దేవుని కెరుక - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,406; 104 తత్వాలు (Tatvaalu) and views 225,595.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చూడండి, గురువు గారి మాటలు, కింద ఉన్న చిత్రములో, భార్యను ఎలా చూసుకోవాలి, ఎంత గౌరవించాలి అని.

ప్రేమ వివాహం చేసుకున్న వారికి, భాగస్వామి ని నిందించే అర్హత ఏ మాత్రము లేదు. ఎందుకంటే తన ఎంపికే కాబట్టి, తప్పు అయినా ఒప్పు అయినా పూర్తి బాధ్యత తనదే గాబట్టి.

ఏ విధమైన పెళ్ళి అయినా అంటే ప్రేమ లేదా పెద్దలు కుదిర్చినా, ఒకవేళ కుదరకపోతే ఇమడలేక పోతే, పిల్లలు రాకముందు ఏమైనా పర్లేదు అంటే తన్నుకున్నా తిట్టుకున్నా విడిపోయినా పర్లేదు ఇమడలేక పోతే, అదీ మొదటి రెండు సంవత్సరములు మరియు పిల్లలకు ముందు. కానీ పిల్లలు వచ్చిన తర్వాత, అన్ని సర్దుబాటు చేసుకుని, పిల్లల భవిష్యత్తు కోసం, ఇష్టం లేకపోయినా చచ్చినట్టు కలసి ఉండాలి, వారు గనుక ప్రేమ బాధ్యత సంస్కారం కలిగిన వ్యక్తులు అయితే.

అలా కాకుండా, కేవలం అహంకారం, ఆధిపత్యం, కామం, మూర్ఖత్వం కలవారు అయితే, పిల్లలు ఉన్నా, విడిపోయి దూరంగా ఉంటున్నారు. లేదా రెండో వివాహం చేసుకుంటున్నారు. ఎదైనా పిల్లల పెంపకము నీతి నియమాల మీద ప్రభావము ఉంటుంది.

అక్కడ ద్వితీయ వివాహమైనా లేక ఒట్టి బంధమైనా, మరలా అదే కధ పునఃప్రారంభం, అవే తగవులు, అవే వాదనలు. ఎందుకంటే మనము మారనిదే, మన చుట్టూ పరిస్తితులు మారవు కదా.

రోజు మొత్తం పక్కన ఉండి చెపుతుంటేనే, పిల్లలు మా మాట వినడం లేదు, అని ఒకరి వాదన.

మరి దూరంగా ఉండి, వారానికి రెండు రోజుల అద్దె పిల్లల పలకరింపు గా ఉంటే, ఆ పిల్లల భవిష్యత్తు దేవుని కెరుక, అని ఇంకొకరి వాదన.

రెండు పడవల మీద కాలుపెట్టినట్లు రెండు ఇళ్ళలో చిందులు వేస్తుంటే, ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, అని ఇంకొకరి వాదన.

ఈ వారంలో, భారతం లోని, ఓ తెలుగు నగరంలో, ఓ తెలుగు జంట, రెండవ బంధం నిలపడము గురించి, ఇరు వర్గాలకు సర్ది చెపడానికి, వాళ్ళ పెద్దలుతో కలిపి, గంటలు గంటలు పట్టింది.

ప్రస్తుతానికి నిలిచింది, కానీ భవిష్యత్ తెలీదు నమ్మకము లేదు. ముందు ఆమెకు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ఆమెకు ముగ్గురు పిల్లలు.

కొత్త కాపురాన్ని కూల్చాలని ముందు కాపురం వారు, ముందు బంధము తెంచాలని ఇప్పుడు వారు, అటు ఇటు మాటలతో ఎగదోయాలని పక్కల వారు, ఇలా ఎవరికి వారు, తమ శాయశక్తులా చలి కాచుకుంటున్నారు అందరూ. అందరూ అందర్నీ తమ అవసరాలకు వాడుకుంటున్నారు.

అన్ని కధలు దాదాపు గా ఒకటే గదా. హీరో లేదా స్నేహితుని చేతిలో మోసపోయిన సావిత్రి సినిమా చూసాము, తర్వాత వంద సినిమాలు వచ్చాయి, అనుష్క ఇలియానా దాకా. ఏ కధలో అయినా, ఏ కుటుంబము లో అయినా, మూల కధ గొడవలు అసూయలు మామూలే కదా, ఒకటే గదా.

త్వరలో కధ గా చూద్దాం, కేవలము ఎవరికీ తెలియని పాత్రలు గా, వారి సమ్మతితో. మన కధకు పేరు, ఆయనకు ఇద్దరు వారికి ఐదుగురు - తేడా వస్తే ఐదుగురు భవిష్యత్?

ఇది ఎవరినీ ఎగతాళి చేయడానికి కాదు, ఇంకొకరి బ్రతుకు నవ్వులపాలు కాకుండా ఉండటానికి, ఇంకొకరు జాగ్రత్త పడటానికి మాత్రమే.

జాగ్రత్తలు, పసి పిల్లల భవిష్యత్తు తో ఆడుకోవడం, మహా పాపం. ఇద్దరిని కలిపే పనిలో మన ఉండవచ్చు కానీ, విడగొట్టే పనిలో మాత్రము, మనము వేలు పెట్టకూడదు. ఆ బిడ్డల ఉసురు మనకు తగులుతుంది. ఎంత డబ్బు ఇచ్చినా, పక్కన ఉండి చూసే తల్లి దండ్రుల ప్రేమకు సమానము కాదు కదా.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,406; 104 తత్వాలు (Tatvaalu) and views 225,595
Dt : 07-Mar-2020, Upd Dt : 07-Mar-2020, Category : General
Views : 1229 ( + More Social Media views ), Id : 387 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : respect , husband , wife , care about kids , him , wise , tough , indian marriage , children , future , issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content