Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఏవండీ, మేము సంపాదన గాయకులము లేదా వీర భక్తులము కాకపోతే, పాటలు పద్యాలు ఎందుకు పాడాలి? సమయం వ్రుధా? ప్రతి వ్యక్తి పాడాలా? లాభం? పని సంపాదన లేని వారే లేదా కడుపు నిండిన వారే పాడతారా?*
మంచి ప్రశ్న గురువు గారు, తమో మరియు రాజస గుణము లో ఉన్న, కొంత మందికి ఈ జవాబు చాలా ఉపయోగం. వారు చేయరు, ఇంకొకరు చేస్తే సహించలేరు. కనీసం వారి పిల్లలతో కూడా చేపించరు.
మెచ్చకపోగా, ప్రోత్సహించక పోగా, వెటకారాలు, తమకు తమ సొంత పిల్లలు బుద్ది చెప్పే సమయం వచ్చినదాకా లేదా ఊపిరితిత్తుల కంఠ సమస్యలు వచ్చినదాకా. . .
మన పాటలు చూసి, ఇతరులు ఆసక్తిగా పాడిన పంపిన పాటలు విని, శభాష్ అన్నాము. వారి సాత్విక ప్రవ్రుత్తి కి, ఆరోగ్య జాగ్రత్తకు, వాక్సుద్ది కి, అదొక నిదర్శనం. మాధుర్యం మనకు అవసరము లేదు, గాయకులము కాదు కాబట్టి.
మన ఇంట్లో పాత తరాల తాత అమ్మమ్మ ఉంటే, మనకు చెపుతారు, వారి పెళ్ళి వయసు సమయములో, అబ్బాయి అమ్మాయి పాట తప్పక పాడాలని. శంకరాభరణం సినిమా లో కూడా చూడవచ్చును.
వాక్సుద్ది ఉంటే, తల్లి దండ్రులు తమ పిల్లలను, బాగా వ్రుద్ది లోకి తెస్తారు, మంచి సంస్కార గుణములతో. ఇప్పుడు ఓపిక లేక వదిలేసాము, చిన్నప్పుడే సర్వ రోగాలకు బలి అవుతున్నాము.
మంచి పాట పద్యం శ్లోకం వలన, మనకు సాత్విక ఆధ్యాత్మిక సామాజిక బంధాల శక్తి పెరగాలే గాని, రాజస తమో గుణములో కి పడవేయ కూడదు. అందుకే పిల్లలతో, మంచి సాత్విక పాటలే పాడించాలి, నాట్యాలు చేయించాలి.
నాభి నుంచి మనకు స్వరము వస్తుంటే, అది పొట్ట పేగులు కదలడానికి, ఊపిరితిత్తుల వ్యాయామం కు, జీర్ణ వ్యవస్థలకు బలం ఇవ్వడానికి, కూడా ఉపయోగము. అంటే, నాభినుంచి, ముక్కు నోరు దాకా, పరిపూర్ణ తేలిక వ్యాయామము.
అంతే కాదు, మనము జీవితములో ఎన్నో సమస్యలతో సతమతము అవుతుంటే, మనసు చిరాకు గా ఉంటుంది, మనసు మొద్దు బారినట్లు ఉంటుంది. దానికి కాఫీలు బిళ్ళలు చిరాకు పడకుండ, రూపాయి ఖర్చు లేకుండా, మన సొంత పాట పద్యము తో, మనసును మరలించి, తేలికగా రిలాక్స్ పడవచ్చును, మనశ్శాంతి పొందవచ్చు.
ఎప్పుడైతే, మనము మనకు ఇష్టమైన భక్తి గీతమో, సామాజిక గీతమో మనసుపూర్తిగా పాడుకుంటే, మనసు చాలా తేలిక పడుతుంది కూడా. మానసిక బలం కూడా వ్రుద్ది చెందుతుంది, మనసు అదుపులోకి వస్తుంది.
చిన్నప్పుడు అమ్మ దేవుని పూజ చేస్తూ, శ్రీ వేంకటేశ్వరా దయా సాగరా అని కన్నీళ్ళు తో పాడుతూ ఉంటే, అదేమిటి అమ్మా ఏడుస్తున్నావు, దేవుడు ఏమన్నాడు అని అమాయకముగా అడిగితే, అది తన్మయత్వములో ఆనందభాష్పాలు అంటే, ఓహో అనుకున్నాము.
మరి ఇప్పుడు అలా కన్నీటితో భక్తి గా చేసే చెప్పే, సోషల్ మీడియా 25 శాతం కన్నతల్లి ఉందా? పసి పిల్లాడి చేతిలో ఫోన్ పెట్టి, నోట్లో పాలపొడి పీక పెట్టి, ఆయాతో వదిలి, సీరియల్ చూడటానికే, ఇన్స్టాగ్రాం వీడియోలు డాన్సులు చేయడానికే, సమయం లేదు.
వేదం చదవండి అంటే, మాకు వద్దు అంటారు. కనీసం శ్లోకం పద్యం గద్యం చదవండి అంటే, అబ్బే బ్రహ్మణులు ఉన్నారు అంటారు. వారూ అదే మాట చెపుతున్నారు, మాలో కొంతమందే చేస్తారు, మేము చేయము అని.
అందుకే నాలుక బండబారినాక, వాక్సుద్ది రాదు, మంచి మాటలు పలుకలేము. మనసు స్పందించదు. మాత్రుభాషలోనూ సరిగ్గా రాయలేము. ముదుసలి తల్లి దండ్రులను చూడము.
ప్రాణాయామం యోగా చెయ్యండి అంటే, అబ్బే అది మనది కాదు అంటారు. పోనీ ఉదయం 5 కి లేవండి అంటే, ఉద్యోగం ధనం వస్తే మాత్రమే, లెగుస్తాము అంటారు. సెలవుల్లో లేదా సంపాదన లేకపోతే, బబ్బుంటారు.
వేప కాకరకాయ అల్లం వెల్లుల్లి తినండి అంటే, అది పిచ్చి తాతమ్మ కాలం వారి పని, మేము డాక్టర్లను నర్సులను మందులు షాపులను బతికించవద్దా, మా పాపిష్టి ధనం ఖర్చు కావద్దా, మహా లక్ష్మి దేవిని బయటకు పంపవద్దా అంటారు.
పోనీ కరమాలతో నామ స్మరణ తో 108 ప్రదక్షిణ లు చేయమంటే గుడిలో, మానసిక శారీరకబలం అంటే, మేము పెట్రోలు వ్రుధా చేస్తూ, గ్రౌండ్ కి లేదా జిం కి వెళ్ళి డబ్బులు తగలెయ్యద్దా. పోపో వయ్యా అంటారు.
మరి ఇంక ఏమి చేస్తారు అంటే? టీవీలు సినిమాలు బిగ్ బాసులు ఓటీటీ ఆటలు తాగి తందనాలు డాన్సులు సొల్లు కబుర్లు, సమయం వ్రుధా పనులు ఎన్నో చేస్తారు.
గాయకులు కాని మనకు, గాన మాధుర్యం ముఖ్యం కాదు, గాత్ర శుద్ది ప్రయత్నమే ముఖ్యం. కానీ పాటతో, మాటల స్పష్టత, శ్వాస ఆపుకునే ప్రక్రియ, ముఖ్యం.
ఊపిరితిత్తులు బాగా పనిచేస్తూ, అలాగే కంఠములో కఫము అడ్డు లేకుండా ఉంటుంది. అంటే అన్ని విధాలా ఆరోగ్యం. రోజూ జలనేతి ప్రక్రియ చేయాలి, స్పష్టతకు.
పాత రోజుల్లో, అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ పాటలు వచ్చి ఉండాలి. ఎందుకంటే, అది ఆరోగ్యం, వ్యక్తిత్వం, మననం, గుర్తు ఉంచుకోవడం, ఉచ్చారణ, కళ, సాధన, సాత్వికత, పట్టుదల, సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ భయం పోవడం, కోసం.
అసలు విషయము మరచి, నాగరికత అంటూ, ప్రతి పాత పనిని ఎగతాళి చేసి, పూర్తిగా మానేసాము, సర్వ రోగాలకు దగ్గర అయ్యాము.
మీరూ వీలైంత సాధనతో, ఏదో ఒక పాట పద్యము, పెద్ద గొంతుతో పాడే, ప్రయత్నము చేస్తారు కదూ?
If we are not singers, why sing songs poems? time Waste? Should every person sing ?
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,331; 90 తత్వాలు (Tatvaalu) and views 175,282 Dt : 18-May-2022, Upd Dt : 18-May-2022, Category : Songs
Views : 398
( + More Social Media views ), Id : 1396 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
singers ,
sing ,
songs ,
sloka ,
poems ,
time ,
waste- ,
person Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments