రాజ కుటుంబ వారసత్వ నాయకులది తప్పా? వ్యామోహం లో ఎన్నుకునే ప్రజలది తప్పా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,048; 104 తత్వాలు (Tatvaalu) and views 224,451.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాచరికపు రాజ కుటుంబ వారసత్వ పాలన, కొనసాగిస్తున్న లేదా తెస్తున్న, నాయకులది తప్పా? లేదా దురాశా నిర్లక్ష్య వ్యామోహం లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, అలాంటి వారిని ఎన్నుకునే లేదా అనుసరించే, ప్రజలది తప్పా?

పాత కాలపు రాజుల మరియు రాజ కుటుంబాల వారసత్వ, బానిస నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది, 5 ఏళ్ళకు ఒకసారి, ప్రతిసారి ఓ కొత్త నాయకుడిని ఎన్నుకుని, అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి, కొత్త కొత్త ఆలోచనలు తో, విజయ పధంలో, ముందుకు పోవాలని, ప్రజాస్వామ్య పద్దతిలో, రాజ్యాంగం రాసుకున్నాము.

కానీ ప్రజల ఆలోచన ధోరణి మారడం లేదు, మరలా కట్టు బానిసత్వం కు లేదా అదే పాత పెత్తందారీ ఐశ్వర్యం కు, వారి చరిత్ర కు, వారి తప్పుడు పనులు కు పధకాలు కు, బానిసలై, కొత్త తరాల నాయకులు కుటుంబాలు వద్దు అనుకొని, మన సవాలక్ష అవలక్షణాల బుద్దులు కు సరిపోయే వారిని, అదే రాజ కుటుంబం ల నుంచి ఎన్నుకుంటూ, అదే రాజుల వ్యవస్థ ను కొనసాగిస్తున్నట్లుగా, అదే మత్తులో అదే బురదలో, సువాసన లుగా భావించి పొర్లాడుతూ, బయటకు రాలేక, అదే భ్రమలలో జీవితాలను పాడుచేసుకుంటున్నాము, చేజేతులా తమ భవిష్యత్తు తరాల బంగారు జీవితం ను కాల రాస్తున్నాము.

అభివృద్ధి లో సింగపూర్, బ్రిటన్, అమెరికా లాగా చేస్తాం అని ఏళ్లుగా అబద్ధాలు చెపుతూ, అక్కడ లాగా కొత్త కుటుంబాలకు నాయకులుకు అవకాశం ఇవ్వకుండా నే, మామల లేదా తండ్రుల పేరు చెప్పుకుని, పిల్లల వారసత్వ రాజ్యాలకు వారు వేస్తున్న పునాదులు కు, మనము అంటే ప్రజలమే గొర్రెల మందలా తల ఊపుతూ, మీ ఇష్టం మే, మా ప్రాప్తం, మన వంశాల కు శాపం అంటున్నాము.

విజ్ఞతతో, ఓటును వజ్రాయుధం గా వాడి, కొత్త తరాలకు లేదా కుటుంబలకు అవకాశం ఇవ్వకుండా, గత వంశ కుటుంబాల కాళ్ళకు మొక్కుతున్నాము, గత బానిస వాసనలు, వదలలేక.

మధ్యతరగతి మరియు బీదవారైన మనము, ఐశ్వర్యము లేని వారిని, పెద్ద పెద్ద వ్యాపారాలు లేని వారిని, మన లాంటి సామాన్య జనాన్ని నాయకులుగా అంగీకరించలేకపోతున్నాము. సినిమా వారికి సోషల్ మీడియాలో ఉన్న అనుచరులు సంఖ్య, నిజమైన మంచి స్థానిక నాయకులకు ఉండటము లేదు. సినిమా వారి గురించి మాట్లాడే సమయము, సొంత ఊరు జిల్లా అభివ్రుద్ది కోసము లేదు.

దేశంలో చదువు కున్న మూర్ఖలు కూడా, వారి కుటుంబ బానిసలుగా, తమ అవకాశ వాదంతో అవసరాలతో, వారిని అనుసరించడం చూస్తున్నాము. చదువు రాని పల్లెల్లో, నిజం ప్రచారం చేయకుండా, ఇతరులను తోటివారిని సొంత వారిని, మోసం చేయడం లేదా మనము? జన్మభూమి కి చేస్తున్న ద్రోహం కాదా అది?

ఓ రాజు, గొర్రెలు అన్నిటికి ఊలు కోటు ఉచితంగా ఇస్తాను అని, ఆ పధకాలు కు కూడా, వెర్రి రాజ వంశ కుటుంబ ఉచిత ఊలు కోటు పధకం అని సొంత పేరు పెడితే, ఆ రాజును గొప్ప వాడిగా పొగిడి, నెత్తికి ఎత్తి ఊరేగింపు చేశారు. ఆ వెర్రి గొర్రెల బొచ్చు నే తెలివిగా వొలిచి, భ్రమలలో ఉంచి, వాటికే ఉచిత కోటుగా అందించారు ఆ రాజు, గొర్రెలను పిచ్చివారిని చేసి. ఆ గొర్రెల ది, స్వార్ధ మూర్ఖపు ఆలోచన, దురాశ కాదా?

అమెరికా, బ్రిటన్, సింగపూర్ లాంటి విదేశాల్లో, కొత్త ప్రభుత్వం కొత్త నాయకత్వం తో, రాచరికపు వారసత్వం కుటుంబ పాలన లేకుండా, ఎలా ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడుతుందో, అక్కడ ఉండి చూస్తున్న, వాటి ఫలాలు అందుకుంటున్న చదువుకున్న మూర్ఖపు వారు కూడా,

స్ధానికంగా నేలపై, తమ చుట్టాలు బంధువులు తల్లి దండ్రులు స్నేహితులు కు, నిజాలు చెప్పక చైతన్య వంతులను చేయకుండా, రాజ కుటుంబ వారసత్వ పాలనలోనే మగ్గమని నాశనం కమ్మని, ఇక్కడ పార్టీలు కు జేజేలు కొడతూ, సంఘాలతో సంఘీభావం తెలుపుతూ, తమ బానిసత్వ బుద్దులు కొనసాగిస్తూ, రాలీలు నిర్వహిస్తూ, ధనం ఇచ్చి ప్రోత్సాహం చేయడం, మరీ విడ్డూరం మూర్ఖత్వం కాదా? దేశ ద్రోహం కాదా? అని విజ్ఞులు అంటారు.

అందుకే ఎప్పుడూ, తెలివైన నాయకులు ది తప్పు కాదు, దురాశ నిర్లక్ష్యం బద్ధకం బాధ్యత రాహిత్యం తో, ముందు చూపు నీతి నిజాయితీ నియమాలు సమానత్వం లేని, తాము కూర్చుని ఉన్న కొమ్మలు నరుక్కొనే, తెలివి తక్కువ ప్రజలది, అంటే మనది మాత్రమే తప్పు కాదా మిత్రమా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,048; 104 తత్వాలు (Tatvaalu) and views 224,451
Dt : 09-Feb-2021, Upd Dt : 09-Feb-2021, Category : Politics
Views : 780 ( + More Social Media views ), Id : 965 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fault , royal family , heritage , political , leaders , wrong , people , voted , elected
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content