ఎన్నికలకు జగన్ సిద్దం - చంద్రన్న యుద్దానికి సిద్దం, పవన్ మరియు వదినతో కలసి - 13 ప్రశ్నలకు మీజవాబులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,236; 104 తత్వాలు (Tatvaalu) and views 226,413.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Jagan Ready for Elections - Chandranna ready for fight, Pawan, Vadina support - Your Answers to 13 Questions*

*2024 మే ఎన్నికలకు 175 అస్సెంబ్లీ స్థానాలకు అభ్యర్దులతో జగన్ సిద్దం - చంద్రన్న ఇంటా బయటా యుద్దానికి సిద్దం, పవన్ మరియు వదిన తో కలసి. ప్రజలు అడిగిన ఈ 13 ప్రశ్నలకు మీ జవాబులు ఏమిటి?* - మీ సలహాలతో మార్పులు, ప్రజా విజయం, మంచి కోసం.

Jagan ready to contest 175 assembly seats for May 2024 polls - Chandranna is ready to fight in and out, along with Pawan and Vadina. What are your answers to these 13 questions people asked? - Changes with your suggestions, public success, for the better.

ప్రశ్న - 1. నీతులు చెప్పే మోదీ మరియు పవన్, చంద్రన్న తో కలవచ్చా? ధర్మం కోసం తప్పదా? నష్టం ఎవరికి? వ్రతం చెడ్డా, ఫలితం ఉంటుందా? పవన్ కి సీయెం యోగం ఉందా? ఎందుకు ఈ నిర్ణయం? రావణ లేదా వాలి పతనం కోసం, వారిలో ఒకరితో కలవచ్చా?

Question - 1. Can Modi and Pawan, who speak morals, meet with Chandranna? Is it for dharma? Who is the loss? Is going away from moral, will it be effective? Does pawan have CM yoga? Why this decision? For the downfall of Ravana or Vali, can we go with one of them?

2. షర్మిల ప్రభావం - వారికా, వీరికా, ఉపయోగం లేదా?
2. Effect of Sharmila- this side or that side, no use?

3. జగన్, ఈ ఎన్నికల యుద్దం లో, అభిమన్యునిడి లా, ఒక్కడే పోరాడి గెలుస్తాడా? ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ, తాకట్టు పెడుతూ, పంచుకుంటూ పోతే, చివరకు సాధించేది ఏమిటి? ఆదాయం పెంచే, అప్పులు తగ్గించే మార్గం ఏది? మద్యం బాన్ ఎప్పుడు?

మడమ తిప్పడమే మంచిదా, అన్ని విషయాలలో? బాబాయి గుండెపోటు, తలనొప్పి మనకెందుకు? కేసులు తేలేది ఎప్పుడు? చంద్రన్న ఏకపక్షముగా, లెక్కలేని తనం గా, పాలించిన ఫలితం, ఇప్పుడున్న అధోగతి. మనకూ భవిష్యత్ లో, అదే గతి ఉండదా? బలవంతుడిదే రాజ్యమా?

3. Jagan, in this election war, like Abhimanyu, will fight alone and win? If government assets are sold, pledged and shared/ distributed, what will be achieved? What is the way to increase income and reduce debt? When will the liquor ban?

Is it better to turn the heel, of all things? Why do we have a headache of babayi heart attack? When are the cases settled? The result of the Chandranna ruling unilaterally, as an unaccountable self, is the present degradation. Will we not have the same fate in the future? Is the kingdom of the strong?

4. ధన, బిర్యాని, మందు పంపిణీ, అవసరం, అవకాశం కు లొంగిపోకుండా, నీతి, నియమం, విలువలు తో, ప్రజలు ఉండగలరా? ఆవును లేదా నోటాను ఎన్నుకోగలరా?

వారికి ఇచ్చినట్లు మనకు 23 సీట్లు ఇస్తే, వారి ఎక్కువ ఉచితాలకు ఆశపడి? ఈ జనం కు ఉచితము, ఎక్కడ నుంచి వస్తుంది అని, ఆలోచన చెయ్యరా? బస్సు పెట్రోల్ ఉచితమా? డ్రైవర్, కండక్టరు కు జీతాలు ఇవ్వకుండానే పని చేస్తారా? మన అన్ని పన్నులు పెరిగి, మన నడ్డి విరుగుతుంది అని అర్ధం కాదా? నాయకుల కంపెనీలలో, ఉచితాలు ఎందుకు ఇవ్వరు అని అడగరా? ఉదాహరణకు, హెరిటేజ్ పాలు, భారతీ సిమెంట్?

4. Can there be people with ethics, rules and values, without giving up to the distribution of money, biryani, alcohol, necessity and opportunity? Can people elect a cow or a NOTA?

If they give 23 seats for us like others, hoping for more freebies? Do people think that, where does freebies come from? Do bus get free patrol? Do driver and conductor work without salary? Doesn't that mean that all our taxes will go up and our money will be depleted? In leaders companies, why don't they give freebies? For example, Heritage Milk, Bharti Cement?

5. నోటా విలువ తెలుసా? నీతిమంతులు ఎవరూ లేనప్పుడు, దీనికి వోటు వేసి, మనము పాపము శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. తర్వాత, చచ్చినట్లుగా మంచివారిని నిలబెడతారు.

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలమైన మనము, ఉచితాలకు లొంగకుండా, ఆత్మను తాకట్టు పెట్టకుండా ఉండగలిగే, మానసిక బలము ఉందా? ధనం ఉన్నవాడు, కనీసం నీతి ఉన్న బీదలకు సహాయం చేయలేరా?

5. Do you know the value of the NOTA? When there are no righteous people, vote for this, and we can escape the punishment of sin. Then, the good will be raised as no other option.

Do we, the slaves of Arishadvarg Ashtavyasan, have the mental strength to refrain from surrendering to freebies and holding the soul hostage? Can't we, who has wealth, help the poor, who at least has morals?

6. తన ఇన్నేళ్ళ తన పాలన అభివ్రుద్ది మీద, మాజీ మంత్రి సొంత బిడ్డ లోకేష్ సామర్ధ్యం మీద నమ్మకం లేక, ఇంతమంది మద్దతు తో కలసి జగన్ తో పోరాడటం అంటే, చంద్రన్న మానసికముగా ఇప్పుడే, ఓడిపోయినట్లు కాదా? పైన నాయకులు కలసినా, కింద కార్యకర్తలు ఓటు వేస్తారా?

ఇక బాలయ్య, మన బ్రీడ్ బ్లడ్ వేరు అని, గొప్పలు ఆపుతారా? రామన్న ఢిల్లీ ని ఓడించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. మరి మీరు 23 సీట్లుకు దించి, ఢిల్లీ లో పడిగాపులు గాసి, రామన్న పరువు తీయలేదా?

6. Not having faith on the development of his rule these manay years and in the ability of his own child ex minister Lokesh, Chandranna fighting with Jagan by taking support of all these people means that Chandranna is mentally defeated right now? Even if the leaders meet above, will the activists below vote?

And Balayya will stop saying that our breed blood is different? Ramanna defeated Delhi and upheld the self-respect of the Telugus. And didn't you reduce it to 23 seats, waited for hours/ days in Delhi and defame Ramanna?

7. ఒకవేళ తెదేపా గెలిచినా, అది సామూహిక గెలుపు అవుతుంది కదా? బీజీపీ, జనసేన, మనల్ని ఆటాడించవా? నాయకుల్ని తయారు చేసేవారు, ఇంకొకరి సహాయం దేబిరిస్తారా? అదీ ఒక్క సీటు లేని వారిని? ఇంతమంది తో గెలిస్తే, లోకేష్ ని సీయెం గా ఎలా నిలబెట్ట గలవు? జగన్, పోరాడి ఓడిన వీరుడు, అభిమన్యుడు గా మిగలడా?

7. If TDP wins, won't it be a collective victory? BJP, Jana Sena, won't play with us? Who make leaders, do they seek the help of others? Those who don't have a single seat? If you win with so many people, how can you keep Lokesh as CM? Will Jagan be the defeated hero, Abhimanyu?

8. ఒకవేళ జగన్ గెలిస్తే, చంద్రన్న పరిస్తితి ఏమిటి? ఇప్పుడైనా, మామకు వెన్నుపోటు, అలాగే బాబాయికి గుండెపోటు తప్పు, అని అందరూ ఒప్పుకుంటారా? నాయకుడు, స్వయం శక్తి తో పదవి పొందుతాడు, పక్కదోవలోకి వెళ్ళకుండా అని చాటుతారా?

తప్పుడు వారు, ఎవరు గెలిచినా, ఎవరు గెలిపించినా, వారి పిల్లలు/ మనుమలు వాటి ఫలితాలను అనుభవిస్తారు అని ఒప్పుకుంటారా? మనము 10 తప్పులు చేస్తే, మన తర్వాతి తరం, 100 తప్పులు చేస్తుంది, మనల్ని చూసి నేర్చుకుని.

8. If Jagan wins, what will happen to Chandranna? Now, can we all agree that uncle's backstabbing and babay's heart attack are wrong? Do you say that the leader gets the position with self-power, without going astray?

Do you agree that, even if the wrong people voted or elected, their children/grandchildren will suffer the consequences? If we make 10 mistakes, our next generation will make 100 mistakes, by learning from us.

9. కరోనా సమయములో, ప్రజలు ఆంధ్రా నుంచి హైదరాబాద్ పరుగులు తీసి, ప్రాణాలు కోల్పోయారు. ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఇప్పుడైనా తగిన వైద్యం ఉందా?

9. During Corona, people ran from Andhra to Hyderabad and lost their lives. Who should be responsible for this? Is there an adequate cure yet?

10. రాష్ట్ర అప్పులు పెంచకుండా ఆపలేకపోయారు చంద్రన్న, జగనన్న. మరి అప్పులు తగ్గించేది ఎవరు, ప్రజల నెత్తిన పన్నుల భారం తగ్గించేది ఎవరు? పధకాలకు, కుటుంబ పేర్లు ఆపేది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, కుటుంబ వారసత్వ పాలన చేసే వారిని, ఆపేది ఎవరు? జగనన్న, చంద్రన్న కంపెనీలలో, ఉచితాలు ఎందుకు పంచరు?

10. Chandrananna and Jagananna could not stop the state debt from increasing. And who will reduce the debts, who will reduce the burden of taxes borne by the people? Who will stop family names for public tax schemes? Who will stop those who make a mockery of democracy and rule by family inheritance? In Jagannanna and Chandrananna companies, why don't they distribute freebies?

11.ఎన్నికలు కూడా లేకుండా ఏకగ్రీవముతో ఎన్నుకునే లేదా ఎన్నికలతో పెత్తనం కొనసాగించాలి అనుకునే, ముఖాముఖి వాదన పోటీ కి భయపడే అధ్యక్షులను రుద్దుకునే/ ఉంచుకునే, ఇతరుల ధనం తో సభ్యత్వం తీసుకుని సంఘం లో చేరే అత్మాభిమానం లేని సభ్యులతో నిండిన, స్వయం మరియు గాడ్ ఫాదర్ ల సేవ లో మునిగే, తెలుగు సంఘాల ప్రభావం ఎన్నికలపై ఉంటుందా?

11. Will election be affected by Telugu Sanghs who elect unanimously without elections or want to continue with elections, rub/keep presidents who are afraid of face-to-face discussion competition, are full of selfless members who join the community by taking membership with other people's money, are immersed in the service of self and godfather?

12. అమరావతి రైతులను, కన్నతల్లి లాంటి, 3 పంటలు పండే నల్ల రేగడి భూమిని, ధన ఆశతో అమ్ముకోమని, కాంక్రీట్ చేసి రాజధానికి ఇమ్మని, ప్రోత్సహించింది ఎవరు? బీడు భూములను, 3 పంటల భూమిగా, మార్చగలమా?

12. Who encouraged the farmers of Amaravati, to sell 3 crops of black regadi land, like Mother, in the hope of money, to build concrete and give to the capital? Can we convert fallow land into 3 crop land?

ఆనాడు చెప్పుడు మాటలు విని, దురాశకు పోయి, ఇప్పుడు వారు దుక్కిస్తున్న, ఆ పాపం ఎవరిది? రాజధానికి పంటపొలాలే కావాలా? రేపు అన్నం దొరకకపోతే, చిల్లర నాణాలు తిని, బతుకుతామా?

On hearing the wrong words, they became greedy, and now they are suffering, whose sin is it? Does the capital need crops? If we don't get rice tomorrow, will we survive by eating money coins?

మనకు రాష్ట్ర రాజధాని ఉందా? ఒకటా, రెండా? అన్ని జిల్లాల రాజధానులూ, రాష్ట్ర రాజధానులా? వాలంటీర్లతో, లాభమా, నష్టమా?

Do we have state capital? One, two, or all district capitals are state capitals? With volunteers, profit or loss?

13. నిజాలు చెప్పాల్సిన పసుపు మరియు బులుగు మీడియాలు, రోజూ అబద్దాలు వండి వడ్డిస్తూ ఉంటే, ఇంక మన పిల్లల/ భాగస్వామి నోటి నుంచి, నిజాలు వినగలమా?

13. If the yellow and blue media, which should tell the truth, are cooking and serving lies every day, can we hear the truth from the mouth of our children/partner?

ముదుసలి సంస్కార తల్లి దండ్రులు అత్త మామలను, ఒంటరిగా లేదా ఆశ్రమాలలో వదిలిన వారిని రక్షిస్తూ, ద్రోహుల సంఖ్య ను పెంచకుండా, ఆపగలమా?

Can we save old parents and inlaws, left alone or in ashrams, and stop from increasing the number of traitors?
* * *

సంస్కారం కలిగిన మీరు మరియు 18 ఏళ్ళు దాటిన మీ పిల్లలు, ప్రతి ప్రశ్నకు, దైవ శిక్షణ ఉంటుంది పాపాలకు అన్న ఆలోచనతో, పక్షపాతము లేకుండా, జవాబు చెప్పగలరు.

You and your children/ grand children above the age of 18, who are cultured, can answer every question, without prejudice, with the thought divine sikshana will be there for sins.

మనము గమ్ముగా ఉంటే, మన బిడ్డల/ మనుమల భవిష్యత్ అంధకారం. మనము మన ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల సేవ చేయలేదు అని ఒప్పుకున్నట్లే. మన పిల్లలు మనల్ని ముదుసలి తనములో దేవతలుగా ఇంట్లో ఉంచి గౌరవించరు, అని మనకు తెలుసు. పన్నుల భారం, అందరమూ మొయ్యాలి.

If we don't speak, the future of our children/grandchildren is blank/ no light/ blindness. It is like admitting that we did not do seva for older parents and inlaws. We know that our children do not respect us at home as gods in our old age. Everyone has to bear the burden of taxes.

మన జీవితాలతో రాహు, శని ప్రభావముతో తగిన ఫలితాలు అందుతాయి అని తెలుసు. రాబోయే రోజుల్లో జరిగే విపరీత ప్రక్రుతి విలయాలకు, కొత్త రోగాలకు, ప్రమాదాలకు, మనము కూడా కారణమే, మరువద్దు.

It is known that with Rahu and Shani influence in our lives, suitable results will be obtained. Let's not forget that we are also responsible for the extreme natural disasters, for new diseases and accidents that will happen in the coming days.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,236; 104 తత్వాలు (Tatvaalu) and views 226,413
Dt : 17-Mar-2024, Upd Dt : 17-Mar-2024, Category : Politics
Views : 170 ( + More Social Media views ), Id : 2055 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Jagan , Ready , Elections , 2024 , Chandranna , fight , Pawan , Vadina , support , Answers , 13 , Questions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content