పాటతో పరమార్ధం - జన్మమెత్తితిరా అనుభవించితిరా - గుడి గంటలు - ఎన్టీఆర్, కృష్ణ కుమారి, జగ్గయ్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,838; 104 తత్వాలు (Tatvaalu) and views 238,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Janmamettiti Raa - Gudi Gantalu - NTR, Krishna Kumari, Jaggayya

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నిర్మూలన పాట గా దీనిని పేర్కొనవచ్చు. భూలోకములో మానవునిగా జన్మమెత్తితిరా, జీవితములో కష్ట సుఖాలు అనుభవించితిరా. బ్రతుకు సమరములో పండిపోయితిరా, అయితే మంచి తెలిసి, మానవుడుగ మారినానురా అని స్పష్టముగా చెప్పారు.

ఏనాటి కైనా మార్పు తప్పదు, అది మంచి మాటలతోనా, లేక సొంత వారి చెప్పు దెబ్బలతోనా సూటీ పోటీ ఛీత్కారాలతోనా అన్నది కాలమే నిర్ణయం చేస్తుంది మిత్రమా. చూస్తున్నాము కదా, సొంత భాగస్వామి పిల్లలు మామ బాబాయి తల్లి దండ్రులకే వెన్నుపోటు పొడుస్తున్నారు సొంతవారు.

మనలో క్రోథ లోభ మోహములే, పడగలెత్తెరా అంటే, అవి బుసలు కొట్టి, గుండెలోన విషముగక్కెరా అంటూ, మన ప్రాపంచిక వ్యామోహ పరిస్తితిని చక్కగా చెప్పారు ఈ పాటలోనే.

మరి మనిషిగా ఎలా మారావు అంటే - ధర్మజ్యోతి, తల్లివోలే, ఆదరించెరా, నా మనసే, దివ్య మందిరముగ, మారిపోయెరా అని చెప్పారు. మరి అది మొదటి నుంచే చేద్దాము అని, మీకు శనివారం సాధనలు పంపుతుంది. ఇప్పుడైనా మొదలు పెడతారా?

చాలా మంది అడుగుతారు, మీరు దేవుడా ఇవన్నీ చెప్పి భయపెడతారు అని అమాయకముగా. అన్నా, అక్కా ఇవి ఎప్పుడో పురాణాలు ఉపనిషత్తులలో రాసారు. అవే పాటలుగా కధలుగా సినిమాలు ఎన్నో వచ్చాయి, మన తాతలు ముత్తాలు ఎప్పుడో చెప్పారు మన రాబోయే బతుకులు. మన ఇళ్ళ చుట్టూ ఇలాంటి కన్నీటి గాధలు ఎన్నో. కాబట్టి మనము కొత్తగా కల్పించి రాసి, భయపెట్టాల్సిన పని లేదు.

పంచభూతాలు, అలాగే మన పిల్లలే మనకు, బుద్ది జ్ఞానం కల్పిస్తారు అని నచ్చ చెపుతాము. ఓ పిచ్చి నవ్వు నవ్వుకుంటారు ఏమిటో అమాయకుడు అని, కాలం దగ్గర కొచ్చిన తర్వాత, వారినే వారి ఇంట్లో వారు, పిచ్చివారి గా చూసారు, చూస్తున్నారు, చూడబోతారు - ఒంటరిగా ఇంట్లో లేదా అనాధాశ్రమాలలో ఉంచుతూ.

స్వార్థమను పిశాచి మదిని, స్వారి చేసెరా, స్థలం కట్టుకోవడానికి, ఇళ్ళు అద్దెకు దొరకడం లేదు, సోనా మసూరి బియ్యము, కూరగాయలు కూడా దొరకడం లేదు. రోగం తో ఆసుపత్రికి వెళితే, ఇంక చేతిలో పైసా మిగలదు. అప్పుడు, బ్రతుకంతా చెలరేగిన, ప్రళయమాయెరా, అంటూ తన అనుభవాలను మనతో పంచుకున్నారు.

మరి ఎలా మారావయ్యా అంటే, దైవశక్తి మృగత్వమునే సంహరించెరా అని చెప్పారు. మరి దాని వలన ఉపయోగం ఏమిటి అంటే, సమరభూమి నా హృదయం, శాంతి పొందెరా అని చెప్పారు. మరి మనము అది ముందే చేస్తే, ఈ నరకయాతన ఉండదు కదా? అన్నా, అక్కా ఆలోచన చెయ్యండి.

మట్టియందే మాణిక్యం, దాగియుందురా, మనిషియందే మహాత్ముని, కాంచగలవురా అని ఎంత స్పష్టముగా చెప్పారు. ఏలినాటి శని నుంచి మనల్ని కాపాడింది ఎవరు? అమ్మనే, అమ్మ మనిషే కదా? ఆ అమ్మకు చేతి కర్రలా ఉండి రోజూ మైలు నడిపిస్తూ, మీ అందరినీ అరిషడ్వర్గాలకు బానిసలై పతనం కావద్దు అని రోజూ వేడుకుంటున్నది ఎవరు? తోటి మనిషే కదా?

మరి మన నిస్వార్ధ మనిషి గా మారితే, ప్రతి గుండెలో, గుడి గంటలు, ప్రతిధ్వనించురా, ఆ దివ్య స్వరం, న్యాయపధం, చూపగలుగురా అని ఆ పెద్దాయన తన అనుభవాన్ని స్పష్టముగా చెప్పారు. మరి నిర్ణయం మీదే.

జన్మమెత్తితిరా.., అనుభవించితిరా..2
బ్రతుకు సమరములో.., పండిపోయితిరా..2
మంచి తెలిసి, మానవుడుగ మారినానురా... ఆ.. ||జన్మమెత్తితిరా||

స్వార్థమను పిశాచి మదిని, స్వారి చేసెరా .
బ్రతుకంతా చెలరేగిన, ప్రళయమాయెరా.. - 2 సార్లు మొత్తము
దైవశక్తి మృగత్వమునే సంహరించెరా.. 2
సమరభూమి, నా హృదయం, శాంతి పొందెరా ||జన్మమెత్తితిరా||

క్రోథ లోభ మోహములే, పడగలెత్తెరా..
బుసలు కొట్టి, గుండెలోన విషముగక్కెరా - 2 సార్లు మొత్తము
ధర్మజ్యోతి, తల్లివోలే, ఆదరించెరా.. 2
నా మనసే, దివ్య మందిరముగ, మారిపోయెరా ||జన్మమెత్తితిరా||

మట్టియందే మాణిక్యం, దాగియుందురా..
మనిషియందే మహాత్ముని, కాంచగలవురా - 2 సార్లు మొత్తము
ప్రతి గుండెలో, గుడి గంటలు, ప్రతిధ్వనించురా..ఆ.ఆ 2
ఆ దివ్యస్వరం, న్యాయపధం, చూపగలుగురా.. ||జన్మమెత్తితిరా||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,838; 104 తత్వాలు (Tatvaalu) and views 238,249
Dt : 28-Jul-2023, Upd Dt : 28-Jul-2023, Category : Songs
Views : 324 ( + More Social Media views ), Id : 1859 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Janmamettiti , Raa , Janma , Methithira , Gudi , Gantalu , NTR , Krishna , Kumari , Jaggayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content