Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Janmasthanam Title Song - Janmasthanam - Saikumar, Pavani, Vandemataram Srinivas
కాదది కాదది, నర పిశాచాలు సంచరించే, రుద్రభూమి కాదది, అది మానవ మాత్రుభూమి
- మన గాత్ర నైవేద్య సేవ. దయచేసి వీడియోలో భక్తి, ఆరోగ్యం, మనస్సు నియంత్రణ, ఆయుర్వేదం, సాఫ్ట్ స్కిల్స్ స్లైడ్‌లను ఒక్కొక్కటిగా చూడటానికి మిస్ అవ్వకండి. Our Gatra Naivedya Seva. Please don't miss to watch devotional, health, mind control, ayurveda, soft skills slides in the video, one by one.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
సత్వ గుణముతో మంచి సంతానన్ని కనమని దేవుడు ఆడ మగ జాతిని స్రుష్టిస్తే, ఒకరిపై ఒకరు తమ ఆధిపత్యాన్ని సాగిస్తూ, ఒకరిని ఒకరు నమ్మలేని స్తితికి తెచ్చారు ఈనాడు. మగువలు కూడా, మేము తక్కువ కాదు అని, మగజాతి ని వీలైన దోవలో మత్తెక్కించి మడతపెడుతున్నారు. మరి మగజాతి నీచముగా పిల్లలు, ముదుసలి వారు అని చూడకుండా, కామముతో కళ్ళు మూసుకుపోయి, చేసే అరిష్టాలను ఆపడానికి, ప్రతి ఇంట్లో ఒక హోం ఆర్మీ ఉండాలి, తగిన జాగ్రత్తలు శిక్షలు వెయ్యాలి అని ఉద్భోధించే చిత్రం ఇది.
ఇద్దరికీ ఇష్టం అయితే మేము ఏమి చేయలేమని కోర్టు తీర్పులు. మరి ఇష్టం లేనప్పుడు, నీకుందని మగతనం, మదమెక్కి దోస్తావా మానధనం? మానసిక నియంత్రణ లేని బలహీన నీకోర్కెల కొలిమికి, కాదుర స్త్రీ ఇంధనం అని కొడుకులకు/ కూతుళ్ళకు తల్లిదండ్రులు ఎప్పుడు నేర్పుతారు?
కాదది కాదది, మదమెక్కిన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలైన నర పిశాచాలు సంచరించే, రుద్రభూమి కాదది, అది మానవ మాత్రుభూమి, అది స్రుష్టికి ఆశ్రు భూమి అని సొంత తల్లి, చెల్లి, అక్క, పిన్ని ఎందుకు చెప్పరు చిన్నప్పటి నుంచే? ఎందుకు మానసిక నియంత్రణ నేర్పరు? వారికి తెలీకపోయినా, మనం ప్రతి వారం, మానసిక సాధనలు నేర్పుతున్నాము కదా. పాట వినండి, మీరూ పాడండి, మగ/ ఆడ/ మానవ జాతి పిల్లలకు మానసిక నియంత్రణ నేర్పండి.
ఆఖరికి పెళ్ళైన వారు కూడా, 2 వ ఇల్లు 3 వ ఇల్లు, లేదా సుగర్ డాడీలు / మమ్మీలు గా మారుతూ, యువతరాన్ని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. మానసిక బలహీనులైన ఆ పిల్లలు, తమ అవసరాలకు తమనే తాకట్టు పెట్టుకుంటున్నారు.
+ + +
జన్మస్థానం, జన్మస్థానం, కాదది కీచక మైదానం ..
జన్మస్థానం, జన్మస్థానం, కాకూడదు మానవతా దహనస్తానం..
కాకూడదు మానవతి స్మశానస్తానం.
నీకుందని మగతనం, దోస్తావా మానధనం
నీకోర్కెల కొలిమికి, కాదుర స్త్రీ ఇంధనం
కాదది కాదది, నర పిశాచాలు సంచరించే, రుద్రభూమి కాదది,
రుద్రభూమి కాదది..,
అది మానవ మాత్రుభూమి, అది స్రుష్టికి ఆశ్రు భూమి
వాట్ వియ్ నీడ్ ఈస్ - హోం ఆర్మీ(ఇంటి సైన్యం).., హోం ఆర్మీ.., హోం ఆర్మీ..
వ్యాసునికి నమస్కరించి., పవిత్రాణా.య సాధ్వీనాం.
వినాశాయ చ దుష్క్రుతాం., అని మార్చి
కలియుగ ఆకలియుగ, కామాకలియుగ మగ మ్రుగ ఖర్మము, ఖండిస్తూ.. ఖండిస్తూ
మగువ ధర్మ సమ్రక్షణార్ధాయ, సంభవామి యుగె యుగే.
అని వెలసిన యుగ ధర్మీ - హోం ఆర్మీ.., హోం ఆర్మీ.., హోం అర్మీఆర్మీ.
కన్నకొడుకులే, కాలకూట విషసర్పాలైపోతే, కామకేళీ విషసర్పాలైపోతే
కాలికింద నలిపేసే కాళికలై, త్రిశూల జ్వాలికలై
కఠోర దీక్షా కంకణ బద్ద, ధీర మాతలుగా మారాలని ..
హోం ఆర్మీ.., హోం ఆర్మీ.., హోం ఆర్మీ..
పసుపుతాడు కట్టినోడు, పశువులాగా మారిపోయి
గాలినూరి చెలరేగి, అచ్చోసిన ఆంబోతై, విచ్చలవిడిగ
కన్న కూతురు పైనే కొమ్ము విసురుతుంటే..
హద్దుతప్పే భర్తలనే, నర ఎద్దుల నరం కొట్టి
ముకుతాడేసేందుకు ముదితలే.., అబల మాన కవచాలవ్వాలి
హోం ఆర్మీ.., హోం ఆర్మీ.., హోం ఆర్మీ..
అసురులుగా మారిపోయి, కన్నె ఉసురు పోసుకునే
అన్నలైన, తమ్ములైన, మామలైన, మరుదులైన, ఎవడినైన
ఆకు కూర తరిగినట్టు, కాయ చెట్టు తీసినట్టు
మదమెక్కిన మగతనాన్ని, మసిచేసి
మగువ మాన రక్షకులౌ వ్వా.లనే ..
హోం ఆర్మీ.., హోం ఆర్మీ.., హోం ఆర్మీ..
అత్యాచారం సలిపే ఆలోచన వస్తే., బొడ్డు కింద ముచ్చెమటలు పట్టించే, ఈ నరకాసుర నరమే.ధం
నెల రోజులు చాలు, పది ఘటనలు చాలు
ఈ కాముక నా కొడుకు/ రాక్షసులంత, ఖామోషై పోడానికి
అభిరాజన లోకమంత, అర్ధరాత్రి ఒంటరిగా, స్వేచ్చగా. ఇల్లు చేరడానికి
మహాత్ముడు కోరుకున్న, స్వతంత్రేచ్చ తీర్చడానికి
హోం ఆర్మీ.., హోం ఆర్మీ.., హోం ఆర్మీ..
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2268 General Articles and views 2,585,483; 104 తత్వాలు (Tatvaalu) and views 276,153
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments