కళ్లు - తెల్లారింది లెగండోయ్‌ కొక్కురోక్కో - సిరివెన్నెల, రఘు, గొల్లపూడి, శివాజీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1728 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,275,082; 90 తత్వాలు (Tatvaalu) and views 175,315.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

తెల్లారింది మెలుకువ వచ్చింది అంటే, ఇంకా మనకు భూమిపై నూకలు ఉన్నట్లే. ఆ నిద్రలోనే, శాశ్వత నిద్రకు వెళ్ళినది ఎంతమందో తెలిస్తే, మనకు ఇంక నిద్ర పట్టదు. తెల్లారింది అంటే, కేవలం రాత్రి నిద్ర నుంచే కాదు సుమా, జీవితము లో ఎక్కిన ప్రాపంచిక మత్తు నుంచి కూడా, బాగుపడటం కోసం, ఆత్మ జ్ఞానం కోసం, ఎందుకంటే రేపు మనకు తెలీదు, మన చేతిలో లేదు.

ఆత్మ జ్ఞానం కోసం, మనల్ని తట్టి నిద్ర లేపే వారు, జీవితము లో మనకు ఒకరో ఇద్దరు మాత్రమే తగులుతారు, వారి చేయి పట్టుకోకపోతే, ఏనాటికీ ఈ ప్రాపంచిక మత్తు విడువలేము.

ఈ సినిమాలో చూపేది అదే, కళ్ళు లేని వారు లేవని బాధపడుతూ, వస్తే బాగుండును అని ఆరాటపడతారు, వచ్చాక అరాచకము మొదలుపెడతారు, మరలా కళ్ళు పోతాయి. మన సౌకర్యాలు సుఖాలు ఆస్తులు పదవులు అంతే, ఈ నాడు అధికార అహంకారం చూపామా విర్రవీగామా, మరుజన్మలో మొత్తము కట్, నేల మీద నుంచి మొదలు పెట్టాలి.

చీకటి మోహ మత్తు, భయం లేదు లెగవండి, తెల్లారింది. పాములాంటి చీకటి మాయ పడగ దించింది. చావు లాంటి రాత్రి, మన ఇంటి చూరు దాటింది పోయింది. ముడుచుకున్న పిట్ట కూడా, ఉత్సాహముగా చెట్టును విడిచింది.

లెగండి, మొద్దు అవతారాల్లారా, మంచాలు దిగండి, బద్దకాన్ని వీడండి, దేవుని స్తోత్రం తో మంచి రోజును ఉత్సాహముగా మొదలు పెట్టండి. చమటే చమురుగా సూర్యుడినే వెలిగించాలి, అగ్గిపూలు పూయించాలి. లేవండి, దొంగలపనికి దొంగలు, దొరల పనికి దొరలు, మా లాంటి మానసిక నిద్రలేపే కాకుల పని, మేము చేయాలి, యముని పిలుపు రాకముందే.

ఉదయం 5 కల్లా నిద్ర లెగవని వారి, జీవిత సంస్కారం, మానసిక నియంత్రణ, మనశ్శాంతి ఆరోగ్య సమస్యలు గమనించండి, మీకే తెలుస్తుంది, ఎందుకు పొద్దున్నే లెగవమన్నారో మన పెద్దలు.

చిత్రం ఏమిటి అంటే, అన్ని రోగాలు ఉన్నా, మరల వారు రోజూ లేటు గా 7 తర్వాత లెగిచి, వారి కుటుంబానికి అన్యాయం చేసి వెళుతున్నారు లేదా ఆసుపత్రులను పెంచి పోషిస్తున్నారు.

అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు, సొంత కుటుంబ ద్రోహులు ఎక్కడో లేరు, మన ఇళ్ళలోనే ఉన్నారు, 5 కి లెగవనివారు. రాత్రి 10 కి పడుకోవాలి. చదువుకునే వారికి, 4-5 బ్రహ్మముహూర్తము లో చదివినది, జీవితాంతం గుర్తుండి పోతుంది. రాత్రి అంతా మేల్కొని చదివినా, తర్వాత మరుస్తారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసి, స్వయంగా పాడిన ఈ పాట, కళ్లు చిత్రంలోనిది. సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1988 లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ ఎం.వి. రఘు. శివాజీరాజా, భిక్షు, కళ్లు చిదంబరం నటించారు.

కళ్ళు ఎం.వి.రఘు దర్శకత్వం వహించిన మొదటి సినిమా. గొల్లపూడి మారుతీరావు రచించిన కళ్ళు నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. అంతేకాదు ఈ సినిమాను ఆస్కారు అవార్డుల నామినేషనుకు కూడా ఎంపికచేయబడింది. ఈ సినిమాలో నటుడు చిరంజీవి, తన కనిపించని పాత్రకు మాటలు అందించాడు. కళ్ళు చిదంబరం పేరుకు ముందు ఉన్న కళ్ళు, ఈ సినిమా నుండే వచ్చాయి.

తెల్లారింది లెగండోయ్‌.., కొక్కురోక్కో.
మంచాలింక దిగండోయ్‌., కొక్కురోక్కో.
పాములాంటి సీకటి, పడగ దించి పోయింది
భయం నేదు, భయం నేదు, నిదర ముసుగు తీయండి
సావు లాటి రాతిరి, సూరు దాటి పోయింది
భయం నేదు, భయం నేదు, సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి, పిట్ట సెట్టు ఇడిసింది 2
మూసుకున్న రెప్పలిడిసి, సూపు లెగరనీయండి ||తెల్లారింది లెగండోయ్‌||

సురుకు, తగ్గిపోయింది, సెందురుడి కంటికి.
చులకనై, పోయింది, లోకం సీకటికి
కునుకు వచ్చి, తూగింది, సల్లబడ్డ దీపం
ఎనక, రెచ్చి పోయింది, అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా.., సూసే కన్ను
ముసురుకోదా మైకం.., మన్నూ మిన్ను
కాలం కట్టిన, గంతలు దీసి, కాంతుల ఎల్లువ, గంతులు ఏసి||తెల్లారింది లెగండోయ్‌||

ఎక్కిరించు, రేయిని సూసి, ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి యిసిరిందా, సూరీడి సూపుల, బాణం
కాలి బూడిదైపోదా, కమ్ముకున్న నీడ
ఊపిరితొ నిలబడుతుందా, సిక్కని పాపాల పీడ
సెమట బొట్టు సమురుగా, సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు సెట్టు కొమ్మల్లో, అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ శక్తుల, కత్తులు దూసి, రేతిరి మత్తును, ముక్కలు సేసి

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Kallu - Tellarindi Legandoi Kokkurokko - Sirivennela, Raghu, Gollapudi, Shivaji  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,275,082; 90 తత్వాలు (Tatvaalu) and views 175,315
Dt : 10-Oct-2022, Upd Dt : 10-Oct-2022, Category : Songs
Views : 143 ( + More Social Media views ), Id : 1577 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kallu , tellarindi , legandoi , kokkurokko , sirivennela , raghu , gollapudi , shivaji
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content