పాటతో పరమార్ధం - కన్నయ్యా నల్లని - నాది ఆడ జన్మే - ఎస్వీఆర్, ఎన్టీఆర్, సావిత్రి, జమున, హరనాథ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,243; 104 తత్వాలు (Tatvaalu) and views 226,414.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kannayya Nallani - Naadi Aada Janme - SVR, NTR, Savitri, Jamuna, Haranath

మన గాత్ర, వ్రాత, మానసిక, శారీరక నైవేద్యం సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం

కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఎవరూ వినే వారు లేకపోతే, ఆ దేవుడి తోనే చెప్పుకుంటాము. మరి మనము దేవుడే లేదు అనే మూర్ఖులు, రేపు దిక్కు లేకపోతే, ఎవరితో చెప్పుకుంటారో మరి చూద్దాము. మనషి బాహ్య సౌందర్యము, సంపద, పదవి, అవసరం, అవకాశం, ఆస్తి, వీసా, లను బట్టి మన గౌరవాలు నటనలు ఉంటాయి, రేపు మన పతనము వాటితోనే అయ్యినదాకా. ఆ తర్వాత, అయ్యో గుణవంతులు లేరే మనకు తోడు అని కన్నీరు మున్నీరు, పంచభూతాల శిక్షణతో. అందుకే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాము.

నల్లగా ఉన్నారు అనో, పొట్టి అనో, లావు అనో, వైకల్యమనో, చదువు ఆస్తి ఉద్యోగం పదవి అనాగరికం బ్రమలు మోహాలు నాటకాలు మోసాలు ద్రోహాలు వెన్నుపోటులు గుండెపోటులు లేవు అనో, మనుషులను హీనముగా చూడటం అలవాటు, అది ఒకే వర్గమైనా కూడా, సంస్కార హీనుల పని. వీరు ఏటూ రేపు తమ ముదుసలి తల్లి దండ్రులను అత్త మామలను చూడరు. తమ సొంత సంస్కార పిల్లల దగ్గర ఉండలేరు. ఆ బాధ దేవునితో చెప్పుకోవడమే ఈ పాట.

కన్నయ్యా, ఓ నల్లని కన్నయ్యా, అందరూ నిన్ను ప్రేమింతురే, నిన్ను పూజింతురే, మరి నన్ను మాత్రం తోటి దేవుని బిడ్డగా భావింపక, నన్ను గనినంత, నిందితురే? ఎందుకు వీరికి ఈ మానసిక దౌర్భాగ్యం?

సంస్కారం లేని, గుణమెంచ లేనింట పడవేతు వా, నన్ను వెలివేయు వారికే, బలి చేతువా తండ్రీ అని దీనంగా అడగటం. మరలా మన ఖర్మకు, దేవుని నిందించడం, సిరిచూసుకొని నన్ను, మరిచావయ్యా, మంచి గుడి చూసుకొని, నీవు మురిసేవయ్య? రామ రామ ఆయన అడిగాడా, గుడి కట్టమని, మీ హ్రుదయములో చోటు ఇవ్వమన్నారు అంతే కదా?

బంగారు మనసునె, ఒసగినావు, అందు అందాల గుణమునే, పొదిగినావు - చూడండి ఇంత మంచి మనసు ఇచ్చినందుకు దేవునికి క్రుతజ్ఞతలు తెలపాలి. కానీ ఆత్మ జ్ఞానం లేకపోవుటచే, గత జన్మ ఫలాలు వెంటపడతాయి అని తెలియక, ఇలా బాధపడటం అనవసరముగా. మా మోముపై నలుపునే పులిమినావు, ఇట్లు నన్నేల, బ్రతికించ దలచినావు? మరి కన్నయ్య కూడా నలుపే కదా, పిచ్చితల్లి.

కన్నయ్యా.., నల్లని కన్నయ్యా...!
నిన్ను కనలేని, కనులుండునా....

కన్నయ్యా నల్లని కన్నయ్యా....
నిన్ను కనలే.ని, కనులుండునా..
నిన్ను ప్రేమింతురే, నిన్ను పూజింతురే
నన్ను గనినంత, నిందితురే. ||కన్నయ్యా || - మొత్తము 2 సార్లు

గుణమెంచ లేనింట పడవేతు వా, నన్ను
వెలివేయు వారికే, బలి చేతువా.. - 2 సార్లు
సిరిచూసుకొని నన్ను, మరిచావయ్యా.. 2
మంచి గుడి చూసుకొని, నీవు మురిసేవయ్య.. ||కన్నయ్య||

బంగారు మనసునె, ఒసగినా.వు
అందు అందాల గుణమునే, పొదిగినా.వు - 2 సార్లు
మోముపై నలుపునే., పులిమినా.వు.. 2
ఇట్లు నన్నేల, బ్రతికించ దలచినావు.. ||కన్నయ్య ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,243; 104 తత్వాలు (Tatvaalu) and views 226,414
Dt : 08-Feb-2024, Upd Dt : 08-Feb-2024, Category : Songs
Views : 135 ( + More Social Media views ), Id : 2015 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Naadi , Aada , Janme , SVR , NTR , Savitri , Jamuna , Haranath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content