Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Kapuram Kotha Kapuram - Kotha Kapuram - Krishna, Bharathi
మనిషికి పలు రకాల బాధ్యతలు అప్పగించారు. ఆదిశంకరులు బ్రహ్మచారిగా దేశానికి హైందవ ధర్మానికి సేవ చేస్తే, బ్రమ్మం రాఘవేంద్ర స్వాములు పెళ్ళి చేసుకుని కూడా, తెలుగు జాతికి విజ్ఞాన గని అందించి వెళ్ళారు.
పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, ప్రపంచానికి పనికి వచ్చే ఇద్దరు జ్ఞాన సంస్కార పిల్లలు వినాయకుడు కుమారస్వామి. తన దంతాన్నే ఊడ పెరికి రాక్షసుని మీదకు ప్రయోగించారు.
సీతా రాముల జంట గురించి ఎంత చెప్పినా తక్కువే. అడవికైనా మీతో తోడుగా వస్తున్నా, మీ కష్టాలను ఆనందముగా పంచుకుంటున్నా అన్న రోజులు, ఇప్పుడు ఎంత దిగజారి పోయాయో మనకు తెలుసు. సహజీవనమైనా సరే, నెలలు రోజులు అయినా ఒకే మిగతావి అన్ని ఉంటే, అంటున్నారు లాయర్ల పంట పండిస్తున్నారు, కుటుంబానికి కన్నీళ్ళు అవమానాలు నిలుపుతున్నారు. ఆ తర్వాత వరుస తప్పటడుగులు వేస్తున్నారు, పతనం వైపు, అదే గొప్ప అనుకుంటారు చివరి నిమిషం దాకా.
ఎందుకంటే, సంస్కార గుణము తప్ప, మిగతా అన్నిటికీ అందరూ అమ్ముడుపోతున్నారు - వీసా, ధనం, ఆస్తి, పదవి, అవసరం, అవకాశం, అందం, . . . దాని ఫలితమే కూలుతున్న కాపురాలు, కష్టాలు కన్నీళ్ళు, పేరుకే కాపురం వేరు వేరు ఒంటరి బతుకులు. ఇలాంటి వారి సంస్కార పెంపకం ఎలా ఉంటుందో, వారు ముదుసలి తనములో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అర్ధం అవుతుంది.
ఎందుకంటే అందరూ ద్రుతరాష్ట్రుడు గాంధారి లాగా, ప్రాపంచిక మోహం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, కళ్ళు మూసుకుని, వాస్తవం మరచి, బ్రమలలో, వ్యామోహ జీవనం సాగిస్తున్నారు.
మరి ఉత్తమ సంస్కార గుణ జంట ఆలోచనలు ఎలా ఉంటాయో నేర్చుకుందామా? బాధ్యతగా ముదుసలి అమ్మ నాన్న అత్త మామ ను దగ్గర పెట్టుకుని చూసే వారే పెళ్ళి చేసుకోవాలి. అప్పుడే వారు పిల్లలకు సంస్కారం బాధ్యత క్రుతజ్ఞత విశ్వసనీయత నేర్పగలరు. ముదుసలి తల్లి దండ్రుల బాధ్యత లేకుండా, కేవలం తమ శారీరక సుఖం కోసం చేస్తుకుంటే, ఇంక ప్రపంచానికి ఏమి మేలు చేస్తారు? జంతువులకు మనకు తేడా ఏమిటి?
పాకలో ఉన్నా, అది పసిడి మేడగా, మండుటెండలో ఉన్నా, మల్లెల నీడగా అనుకోవడమే ఉత్తమ దంపతుల లక్షణం. అప్పు చేసి 2-4-ఎన్నో మిద్దెలు స్థలాలు వ్యాపారాలు కొనమని, ఏ సంస్కార దంపతులకు ఆలోచన రాదు. ఉన్నంతలో చెప్పలేని, తీపిని అందించేది, గోరంతలో కొండంత, తృప్తిని కలిగించేదే ఉత్తమ కాపురం.
చీకటిలో చిరునవ్వులు, దీపాలు గా వెలిగించుకొని, బాధలలో ఆనందం పంచుకొని ఉంటారు ఉత్తమ దంపతులు. ఇతరులు సహాయం చేయలేదని ఏడ్వరు, అప్పులతో పప్పు కూడు తినరు. కలిమిలో పొంగక, లేమిలో కృంగక, వెలుగు నీడలొక్కటిగా కలబోసి చూసేదే, ఉత్తమ కాపురం. అంటే, స్థిర బుద్ది ఉండాలి కష్ట సుఖాలకు అని వీరూ చెప్పారు, చూసారు కదా. మరి అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం, పంచభూతాల శిక్షలను తప్పించుకుందాము.
తన పతియే, కనిపించే దైవమని, తన సతియే, ఫలియించిన పుణ్యమని, సంస్కార గుణ జంటలు భావిస్తారు. ఒకరినొకరు తెలుసుకొని, ఒకటిగా నడచుకొని, బ్రతుకంతా పచ్చదనం పండించుకొనేదే, పదిమందికి అండగా ఉండేదే, ఉత్తమ కాపురం.
కాపురం.., కొత్త కాపురం..
ఆలుమగలు కట్టుకున్న, అనురాగ గోపురం ||కాపురం||
పాకలో ఉన్నా, అది పసిడి మేడగా..
మండుటెండలో ఉన్నా, మల్లెల నీడగా.. - 2 లైన్లు మొత్తము
ఉన్నంతలో చెప్పలేని, తీపిని అందించేది
గోరంతలో కొండంట, తృప్తిని కలిగించేదే.. ||కాపురం||
తన పతియే, కనిపించే దైవమని.
తన సతియే, ఫలియించిన పుణ్యమని.- 2 లైన్లు మొత్తము
ఒకరినొకరు తెలుసుకొని, ఒకటిగా నడచుకొని
బ్రతుకంతా.. పచ్చదనం.. 2, పండించుకొ.నే.దే ||కాపురం||
చీకటిలో చిరునవ్వులు, వెలిగించుకొ.ని..
బాధలలో ఆనందం, పంచుకొని.. - 2 లైన్లు మొత్తము
కలిమిలో పొంగక, లేమిలో కృంగక
వెలుగు నీడలొక్కటిగా, కలబో.సి చూసేదే ||కాపురం||
Movie starring Krishna, Bharathi, RaoGopalRao, Satyanarayana, Allu Ramalingaiah, Prabhakar Reddy, Kanta Rao, Among others. Directed Sekhar Reddy; Produced Shekhar; Music K.V.Mahadevan
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,494,164; 104 తత్వాలు (Tatvaalu) and views 267,481
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments