కేతిరెడ్డి ట్రెండ్ సెట్, ఆ పౌరుడి లా గట్టిగా అడగాలి, తప్పు కూడా పొగిడి పతనం వద్దు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1617 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1652 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మనం ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, అలాగే తాడిపత్రి హీరోలు జేసీ లను పొగిడాం, కేవలం ప్రజలకు మంచి పనులు, నిబద్ధత, విశ్వసనీయత, పోరాట పటిమ, ఏదైనా మంచి చేయాలనే తపన, తప్పో ఒప్పో ఒక వైపు కట్టుబడి నిజాయితీగా ఉండటం, అంతవరకే. ప్రతిదీ అంటే మిగతా తప్పులు ఫాక్షనిజం, సమర్ధన చేస్తాం అని కాదు కదా.

కొంతమంది అలా రోజూ లేదా వారం తిరగడం, కేతిరెడ్డి అన్న స్క్రిప్ట్ అన్నారు. మన జవాబు ఒకటే, కాసేపు నటన అనుకుందాం. మరి ఆంధ్రా 175 ఎమ్మెల్యేలు లేదా 25 ఎంపీలు, అలా ఎందుకు కనీసం నటించరు, తమ పబ్లిసిటీ కోసం అయినా, వేరే ఊళ్ళో లేదా ఇంట్లో చాటుగా కూర్చుని జనానికి దూరంగా ఉండకుండా? ఓటు వేసిన జనం అంటే భయమా, పనులు చేయలేదని తంతారు అనా? అలా నటించడం లేదా పబ్లిసిటీ కూడా చేతగాని వారిని, మూర్ఖులమైన మనము ఎన్నుకున్నామా?

కాబట్టి కేతిరెడ్డి అన్న చేస్తోంది వంద శాతం, కరెక్ట్. ఆయన వీడియో ఒకటే పెడుతున్నారు, ఇంకా ఫోటోలు కూడా పెట్టమని కోరాము. రాష్ట్రం మొత్తానికి ఒక కొత్త దోవ చూపిస్తున్నారు. ట్రెండ్ ఫాలో కావడం కాదు, తనే ట్రెండ్ సెట్ చేస్తున్నారు, శభాష్. దమ్ము ధైర్యం కృతజ్ఞత నిబద్ధత వంశ చరిత్ర ఉన్న నాయకుడు, ఊళ్ళో ఉండి ధైర్యంగా, ప్రజల వెంట పడతారు, పడాలి.

ప్రజల పన్నుల భిక్ష తో, నెలకు లక్ష జీతం, సౌకర్యాలు, హోదా, ఫించన్ పొందుతూ, ప్రజలు పెట్టకున్న సేవకులు, మన నాయకులు అధికారులు, అని ప్రధానమంత్రి చెప్పారు కదా, కేవలం కాపలాదారులం అని. మనకూ తెలుసు, పబ్లిక్ సర్వెంట్ అని. మన నాయకులు కూడా అంటారు కదా, మేము ప్రజా సేవకులం అని.

కానీ అది మరచిపోతున్నాం మనం, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాము. ఎందుకంటే ధనం, వర్గం, కులం, అవసరం, అవకాశం చూసి ఓటేస్తున్నాం కాబట్టి.

ప్రజలకు తప్పు జరిగితే, వారి నైనా విమర్శలు చేయడానికి వెనుకాడం, వారి వ్యక్తిగత జీవిత ఆరోపణల జోలికి మాత్రం మనం పోము, పోకూడదు విలేఖరి గా లేదా మంచి వ్యక్తి గా.

అభిమానం ఏ పార్టీ అయినా ఒకటే, పర్చూరు తెదేపా ఎమ్మెల్యే ఏలూరు ని, బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన, శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ని, బీజేపీ ఎంపీ జీవీఎల్ అలాగే సోము, వైకాపా ఎంపీ విజయ్ సాయి, మా జిల్లా పెద్దాయన వైకాపా సుబ్బారెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ సీతక్క, గత చిత్తూరు ఇప్పుడు అనంత కలెక్టర్ ని పొగిడాం.

అంటే పార్టీ, హోదా, వర్గాలకు సంబంధం లేదు. కేవలం వ్యక్తిత్వం గుణం విశ్వసనీయత పట్టుదల నిబద్ధత అంతే. వాళ్ళెవరూ మనకు పరిచయం కూడా లేరు.

రేపు మా ఎమ్మెల్యే కరణం బాబాయి, జిల్లా మంత్రి వాసన్న చీరాల జిల్లా సాధిస్తే, వారిని పొగుడుతాం. అది మన కోసం కాదు, తమ్ముడు వెంకటేష్, ప్రణీత్ భవిష్యత్తు కు, అది గొప్ప పునాది రాయి.

అభిమానం అనేది, మన హీరోలు లేదా మంచివారు వారి వారసులు, సౌభాగ్యం గా చిరంజీవులు గా, ఎక్కువ రోజులు వెలుగొందడానికి ఉపయోగపడాలి గానీ, వారు తప్పు చేస్తున్నా కూడా, పొగిడి, వారి పతనం కు మనం కారణం అయి, ఆ పాపం లో భాగం కారాదు.

మొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి, అనంత కలెక్టర్ ను అమానుషంగా విమర్శలు చేస్తే, అది తప్పు అన్నాం. ఎమ్మెల్యే గా లేదా పౌరుడి గా విమర్శలు చేసే హక్కు, ప్రతి వ్యక్తి కి ఉంది. కానీ అమానుషంగా అన్యాయం గా చులకన చేస్తూ, విమర్శలు చేయకూడదు. అలాగే జేసీ ఇంటి మీదకు, పోవడం తప్పు అన్నాం.

మనకేదో ధైర్యం ఉందని కాదు, పిల్లి అన్నా భయమే. కానీ సత్యం నిజం, వారి మంచి భవిష్యత్తు కోసం చెబుతున్నాము, అని మాత్రమే సుమా.

అలాగే చంద్రన్న, జగనన్న పధకాలు కు, సొంత పేర్లు పెట్టడం తప్పు అంటున్నాం. అలాగే రాష్ట్ర బీజేపీ, పవన్ ను అవమానించడం, తప్పు అన్నాం.

ఇప్పుడు అసలు వీడియో చూడండి, కేతిరెడ్డి అన్న జనం మధ్యలో తిరుగుతూ ఉన్నారు, అని మనకు తెలుసు. కొన్ని ఆకస్మిక ఇబ్బందులు తలనొప్పి లు వస్తుంటాయి. అన్ని సక్రమంగా జరగవు కదా.

ఒక వ్యక్తి ఎంత గట్టిగా దబాయించి, తన ఫింఛన్ అలాగే ఏదో రేషన్ స్టోర్ సమస్య చెపుతున్నారు. ఎమ్మెల్యే ఆయన ప్రశ్న సమస్య అర్థం కాక, సమాధానం ఏమీ చెప్పలేక, ఎంత విసుగ్గా ఉన్నారో. చుట్టుపక్కల వారు, తలలు పట్టుకుంటున్నారు.

ఆ పల్లెటూరు పౌరుడి ని చూసి అయినా, చదువుకున్న వారు ధైర్యం చేసి, తమ ప్రాంత సమస్యలు అభివృద్ధి గురించి, తమ ఎమ్మెల్యే ఎంపీలు ని, గట్టిగా ఇలా అడగాలి.

మిమ్మల్ని ఏదో చేస్తారని అంటారని భయం వద్దు, అందరి చేతులలో ఫోన్ కెమెరా వీడియో లు ఉన్నాయి. అవి చంద్రన్న జగనన్న లకు చేరితే, వారు ఎమ్మెల్యే ఎంపీలు ను మందలిస్తారు, మంచి చెపుతారు. జీతాలిచ్చే ప్రజలతో ఎలా మసలుకోవాలో చెపుతారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1652 General Articles, 61 Tatvaalu
Dt : 28-Mar-2021, Upd Dt : 28-Mar-2021, Category : Politics
Views : 487 ( + More Social Media views ), Id : 1056 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kethireddy , trend set , citizen , question , mla , mp , strongly , fall down , support , wrong , jagan , chandranna , jc brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content