కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - అందమైన అనుభవం Parody - కమల్ హాసన్, జయప్రద, రజనీకాంత్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,489; 104 తత్వాలు (Tatvaalu) and views 225,605.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు అన్న పాట చాలా వరకు ప్రజలలో వ్యాపించింది, వాస్తవము కూడా అదే. కాని ఆ దుందుడుకు చర్యలతో అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వములో, కుర్రకారు మత్తులో ఊగి తేలుతుంది, నాడు నేడు కూడా అని పెద్దలు అంటారు.

మరి వారిని సక్రమ మార్గములో పెట్టాల్సిన బాధ్యత వారి తల్లి దండ్రులకు ఉన్నది. కానీ ఆ బాధ్యతలు 80 శాతం మంది వదిలేసారు. తమ ముదుసలి తల్లి దండ్రులను దూరముగా విసిరేసారు సమాన సౌకర్యాలు ఇవ్వికుండా. పిల్లలకు, రామాయణ భారత భాగవతం భగవద్గీత లలోని, మెళుకువలు నీతి తెలివి ముందుచూపు నేర్పలేకపోతున్నారు.

లెక్కలేని తనముతో ధనము, పలుకుబడి, అధికారం, సౌకర్యాలు, విచ్చలవిడిగా అందిస్తూ, పిల్లల మాటకు పెద్దలు మోహవశులై తలూపుతున్నారు. భవిష్యత్ కష్టాలకు ధీటుగా పెంచలేక, చేతులు ఎత్తేస్తున్నారు. దానికి ఫలితము వారే అనుభవిస్తున్నారు, ముదుసలి తనములో ఇళ్ళలో లేదా అనాధాశ్రమములో ఒంటరిగా.

అలాగే పిల్లలు చెడిపోతూ, 30 ఏళ్ళు వచ్చే సరికే, అమ్మా అయ్యా అంటూ రోగాల బారిన లేదా తప్పుడు మార్గములో పడి, శారీరక బలహీనులు అవుతున్నారు. మానసిక బలం లేక పతనము అవుతున్నారు.

మరి వారిని మంచి వైపు ఉత్సాహపరిచే ఈ చిన్న ప్రయత్నం మీరు ఆశీర్వదిస్తారు కదా?

ఈ పాటలో పెద్దవారిని, అలాగే మంచి మాటలను తక్కువ చేసే మాటలను, మనము కొంతవరకు మార్చే ప్రయత్నము చేసాము, కాబట్టి కొంత పేరడీ అనవచ్చు.

కుర్రాళ్ళో..య్, కుర్రాళ్ళు.., వెర్రెక్కి.., ఉన్నోళ్ళు.
కళ్ళాలే.. లేనోళ్ళు.., కవ్వించే.. సోగ్గాళ్ళు - 2

ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ..... ఓ

కుర్రాళ్ళో..య్, కుర్రాళ్ళు.., వెర్రెక్కి.., ఉన్నోళ్ళు.
కళ్ళాలే.. లేనోళ్ళు.., కవ్వించే.. సోగ్గాళ్ళు

చరణం: 1
గతమున పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్లు
వీ.ళ్ళే.నో.య్. నేటి మొనగా.ళ్ళు..,
చెలిమికెపుడూ జతగాళ్ళు, చెడుపుకెపుడు పగవాళ్ళు,
వీళ్ళ వయసు నూరేళ్ళు.., నూరేళ్ళకు కుర్రాళ్లు..

ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ..... ఓ

కుర్రాళ్ళో..య్, కుర్రాళ్ళు.., వెర్రెక్కి.., ఉన్నోళ్ళు.
కళ్ళాలే.. లేనోళ్ళు.., కవ్వించే.. సోగ్గాళ్ళు

చరణం: 2
తళతళ మెరిసేటి కళ్ళు, నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు, మత్తులో మునిగెనె వీళ్ళు
మా.నా..లోయ్ దాన్ని కు.ర్రా.ళ్ళు
నిదురరాని పొదరిల్లు., బ్రహ్మచారి పడకిల్లు..
మూసుకున్న ఆమత్తు.., వదలినపుడే ఎదిగినోళ్ళు..

ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ..... ఓ

చరణం: 3
నీతులు చెప్పే పెద్దోళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్లు
నేర్చేయ్ ఆనాటి రుజువులు, మనవే ముందున్న రోజులు
తెం.చే.సె.య్ తప్పు. స్నే.హా.లు
మనుషులె మన నేస్తాలు, కమాన్ క్లాప్, మనసులె మంచి కోవెల్లు, ఎవిరిబడి
మనుషులె మన నేస్తాలు.., మనసులె మంచి కోవెళ్ళు..
మనకు మనమె దేవుళ్ళు.., మార్చలేము శాస్త్రాలు..

ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ..... ఓ

కుర్రాళ్ళో..య్, కుర్రాళ్ళు.., వెర్రెక్కి.., ఉన్నోళ్ళు.
కళ్ళాలే.. లేనోళ్ళు.., కవ్వించే.. సోగ్గాళ్ళు
Come on everybody join together  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,489; 104 తత్వాలు (Tatvaalu) and views 225,605
Dt : 17-Feb-2023, Upd Dt : 17-Feb-2023, Category : Songs
Views : 332 ( + More Social Media views ), Id : 1705 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kurraalloy , kurraallu , andamaina , anubhavam , kamal , haasan , jayaprada , rajinikanth
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content