పాటతో పరమార్ధం - కుర్రాడనుకొని కునుకులు (పేరడీ) - చిలకమ్మ చెప్పింది - రజనీకాంత్, సంగీత, శ్రీప్రియ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,924,200; 104 తత్వాలు (Tatvaalu) and views 229,774.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాటతో పరమార్ధం - కుర్రాడనుకొని కునుకులు (పేరడీ) - చిలకమ్మ చెప్పింది - రజనీకాంత్, సంగీత, శ్రీప్రియ

Song Spirit - Kurradanukoni Kunukulu (Parody) - Chilakamma Cheppindi - Rajinikanth, Sangeeta, Sripriya, Lakshmikanth, Narayana Rao

ఎవరికైనా తెలిసినవారికి మంచి మాట చెపితే, భవిష్యత్ జాగ్రత్తలు చెపితే, అబ్బో ఈయన దేవ లోకం నుంచి దిగి వచ్చాడు, వెర్రి మాటలు చెపుతున్నాడు, మేము వినాలంట, ఆచరణలో పెట్టాలి అంట, ఏమి జరుగుతుందో ఆ చివరలోనే చూద్దాం -

అసలు ఉదయం 5 కి ఎందుకు లెగవాలి, బయట కల్తి గడ్డి మాంసం ఎందుకు తినకూడదు, నీతి నియమాలు స్తిరత్వం మాట మీద ఉండటం ఎందుకు, అప్పు లేకుండా ఉండటం ఎందుకు, ధర్మం కన్నా బంధం ఆనందం ముఖ్యం, పెద్దలను ఎందుకు గౌరవించాలి, తెలుగు గురువులు మాకెందుకు, మేము అప్పుతో 4 ఇళ్ళు కొంటాము, మా పిల్లలకు సంస్కారం అక్కరలేదు, పొలాలు ప్లాట్లు చేసి అమ్ముతాము తర్వాత దొరికితే పచ్చ గడ్డి తింటాము, మన లాగా అబద్దాలు తాకట్టు అప్పు అమ్మకం నక్క పులి పాము కే మా ఓటు, ఏదో ఒక దోవలో వెన్నుపోటుతో ధనం పదవి అధికారం తీసుకుంటే దోచుకుంటే దాచుకుంటే ఒక రోజులో తప్పు ఏమిటి, గూండాయిజం ఫాక్షనిసం కేసులు స్టేలు ఉంటే తప్పు ఏమిటి, ముదుసలి తల్లి దండ్రులను దగ్గర ఎందుకు, వాట్సాప్ లో బొట్టు లా ఫోటో రీడ్ రిసీప్ట్ ఆపి దొంగలా చూస్తే తప్పు ఏమిటి, స్పందన లేని జీవచ్చవాలుగా అవసర అవకాశవాదులుగా ఉంటే నష్టం ఏమి, మీ శనివార సాధనలు మేమెందుకు చెయ్యాలి, ఆసుపత్రులు మందులకు కేసులకు రోగాలకు తగవులకు గొడవలకు అన్యాయం చెయ్యమంటారా?

అని మనల్ని తప్పు పడుతూ, వారు వారి పతన దోవలో సాగుతూ ఉంటారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు, తాము వెర్రివారు భవిష్యత్ లో అవుతారు అని వారు గ్రహింపరు, అది జరగక మానదు, తమ సొంతవారితోనే.

అదిగో అలాంటి వారికే ఈ పాట, ఇంకోసారి ఈ మేలు కొలుపు. నిద్ర లేవండి, జ్ఞాన నేత్రం తో, భవిష్యత్ చూడండి అని. వారికీ తెలుసు, కానీ మనసు మాత్రం, అదంతా ఉత్తి మాటలే, మనము వరాహం లాగా ఆ బురదలోనే పొర్లుదాము జీవితాంతం అంటుంది. రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్యకు జరిగింది మాకెందుకు జరుగుతుంది అంటారు. కానీ పంచభూతాలు వదలవు. కర్మ ఫలితము వెతికి వెతికి, ఏదో ఒక కారణముతో వెంటపడుతుంది.

భవిష్యత్ ముందుగా చెప్పే మనల్ని వెర్రాడనుకుని, తమ అరిషడ్వర్గ అష్ట్వసన బానిసత్వములో కునుకులు తీసే (ప్రాపంచిక వ్యామోహ వ్యసనపరులకు) వెర్రివారికి ఈ పిలుపు, ఇదే మా మేలుకొలుపు.

ఇన్నాళ్ళ మత్తును విడిచీ, కనీసం ఇప్పుడైనా గురు/ శిష్య మంచిని నేర్చి, తీపి కానుక రేపును తలచీ, కళ్ళు తెరిచి, ఒళ్ళు తెలిసీ, మేలుకుంటే, మేలిక మనకూ. ఎందుకంటే ఒక్కసారి, శిక్షణ ప్రారంభం అయ్యాక, ఇంక ఆగదు, పై ధన అధికార గొప్ప వారి విషయములో చూసాము కదా, ఇంక మన బతుకులు ఎంత మిత్రమా?

మరి మనసును ఎలా దారిలో పెట్టాలి, శని వారం మనం ఎన్నో సాధన పద్దతులు తెలిపాము, జపములు విరిసే, తపములు కురిసే, కొత్త సాధనమున్నది మీకు, దీపమంటి జ్ఞానముంది, ఇప్పటికైనా అందుకో, తేనె మనసే, చీకటి చేయకు, ఆ తర్వాత ఎవరమూ కాపాడలేము. మనం చూసేది వినేది, ఏదీ నిజము కాదు, శాశ్వతము కాదు, అంతా మాయ, బ్రమ, అన్ని తాత్కాలికమే. ఎప్పటికైనా, మనము ఒంటరే, ఆ పరమాత్మనే మనకు చివరి దిక్కు.

వెర్రా.డనుకుని, కునుకులు తీ.సే.. (వ్యసనపరులకు) వెర్రివా.రికి పిలుపు.. 2
ఇదే. మా మేలుకొలుపు..!!

జపములు విరిసే., తపములు కురిసే., కొత్త సా.ధనము.న్నది మీ.కు. 2
దీ.పమంటి.. జ్ఞా.నముంది2
తేనె మనసే.. చీకటి చేయకు 2 ||వెర్రాడనుకుని ||

వెన్నెల చిలికే., వేణువు పలికే., వేళ మీ. కిది మా. తొలిపలుకు 2
మూగదైన.. రా.గవీ.ణ2
పల్లవొకటే.., పాడును చివరకు 2||వెర్రాడనుకుని ||

మత్తును విడిచీ., మంచిని వలచీ., తీ.పికానుక రే.పును తలచీ..2
కళ్ళు తెరిచి.. ఒళ్ళు తెలిసీ..
మేలుకుంటే.., మేలిక మనకూ..2||వెర్రాడనుకుని ||

చిత్రం : చిలకమ్మ చెప్పింది; సంగీతం : యం యస్ విశ్వనాధన్; సాహిత్యం : వేటూరి; గానం : బాలసుబ్రమణ్యం
Veturi - Balu - MSV (track by padmacharan)  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,924,200; 104 తత్వాలు (Tatvaalu) and views 229,774
Dt : 13-Jul-2023, Upd Dt : 13-Jul-2023, Category : Songs
Views : 308 ( + More Social Media views ), Id : 1833 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kurradanukoni , Kunukulu , Parody , Chilakamma , Cheppindi , Rajinikanth , Sangeeta , Sripriya , Lakshmikanth , Narayana , Rao
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content