Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Mabbulo Yemundi (Parody) - Lakshadhikari - NTR, Krishna Kumari
ఇవి ఏళ్ళు గా మన సందేశాలు అందుకునే, మీలో ఒకరు పంపిన పాటకు, పేరడీ. మంచి పాటలను, మీరు పంపినా, మధురముగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. మనకూ క్రుతజ్ఞత విశ్వసనీయత ఉంది, గతాన్ని మరువలేదు అనడానికి.
దైవం భావనలు వచ్చే విధముగా, ఏ పాటను ఏ విధముగా అయినా మలచుకోవచ్చును. సంకల్పం సాధనకు అవి కూడా పనికి వస్తాయి.
మబ్బులో ఏముంది, మన మనసులో ఏముంది? 2 పైకి కనపడవు. కానీ చేతలలో గుణాలు కనపడాలి. అందుకే మబ్బులు పరుగులు తీసి, పైర్లకు నీరు ఇస్తాయి. మరి మన మనసులో దైవం ఉండి, మన చేత మంచి పనులు చేపిస్తుంది.
మనకు విశ్వసనీయత క్రుతజ్ఞత ఉన్నది, పంచభూతాల శిక్షణ మనకు వద్దు అని, కనీసం ముదుసలి తల్లి దండ్రులకు అత్త మామలకు అయినా, సేవ చెయ్యాలి కదా?
లేకపోతే, మనకు జంతువులకు తేడా ఏముంది, అవి కని ఊరి మీద వేస్తాయి, ఆనందముతో విచ్చల విడిగా తిరుగుతాయి. మరి మనము అలాగే చేస్తే, మానవత్వం ఎక్కడ ఉంది, దైవత్వం ఎప్పుడు కనపడుతుంది?
తోటలో ఏముంది, మన మాట లో ఏముంది? తోటలో దైవానికి సమర్పించే పుష్పములు, మన మాటలో గాత్ర నైవేద్యముగా వచ్చే వేదముల పలుకులు ఉన్నాయి, ఉండాలి కదూ?
చేనులో ఏముంది? మన మేనులో ఏముంది? చేనులో మానవత్వం ఉన్న మనుషులు తినే అన్నమనే బంగారం ఉంది, మరి ఆ అన్నం తిని పశువాంచలు మాత్రమే తీర్చుకోకుండా, మన మేనులో ఉన్న ఆత్మశక్తిని సాధనలు ద్వారా బయటకు తీసి, ఆ దైవము లాగా మారే శక్తి ని ప్రచోదనం చేయాలి.
ఏటిలో ఏముంది? మన పాటలో ఏముంది? మనము బతుకు సాగించడానికి తాగడానికి ఏటిలో గలగలలు ఉన్నాయి, మరి అవి తాగి, మన పాటలో నాదములు బయటకు రావాలి, ఆ దేవ దేవుని స్తుతిస్తూ.
సరే మరి ఇన్ని చెప్పారు, మరి ఇది చెప్పండి? నేనులో ఏముందీ? నీవులో ఏముంది? నేనులో ఆత్మఉంది, నీవులో ఆత్మఉంది, ఆ పరమాత్మలో మనముంది. అంతేనా? ఈ ఆత్మ జ్ఞానం ఉంటే, ఇక లోకములో కుట్రలు కుతంత్రాలు మోసాలు ఉంటాయా?
అమెరికాలో కూడా మన తెలుగు తేజాలు, క్షణంలో కోట్లు ఎలా, తర్వాత వెన్నుపోటు మనకు ఎలా, అనే వారి పనులు ఇలాగే ఉంటాయి - పచ్చ కార్డు మోసం, రియల్ ఎస్టేట్ మోసం, కుటుంబం మోసం, చివరకు తనకు తానే మోసం.
ఒకచోట ఎక్కువగా బయటకు వచ్చింది, ఇంకోచోట తక్కువ గా బయటకు రాలేదు. నమ్మిన వారికే వెన్నుపోటు, అలాంటి వారి వెనకే తిరిగే కు సంస్కార పెంపకం. సొంత ముదుసలి తల్లి తండ్రుల అత్త మామల ద్రోహులు, సొంత పిల్లల దగ్గర ముదుసలి తనం లో దేవతలు గా ఉంటామని చెప్పలేని దౌర్భాగ్యం, అమ్మిన మరియు కొన్న, ఇద్దరు కూడా మోహ వశులే. మోహ బాబాయి భక్తులు కంపల్సరీ ఇందులో, మానసిక బలహీనతతో.
మన నేల విత్తనము ఎక్కడ కు వెళ్ళినా, ఆఖరకు అంతరిక్షానికి వెళ్ళినా, తన సహజ సువాసనలు వీడదు కదా?
ఇంకో కన్న కూతురు కెనడా లో ఉండి, కొడుకు ఆఫ్రికా లో ఉండి, నాన్న చనిపోయాడు రామ్మా అంటే కర్ణాటక పోలీసులు, మీరే ఏదైనా చేయండి లేదా పారేయండి, అని చాల చక్కగా, తన పెంపక సంస్కారము ను చూపించింది. పోలీసులే, ఆ అందరూ ఉన్న అనాధ శవానికి, దహన కార్యక్రమాలు చేసారు. వాట్సాప్ స్టేటస్ లో చూసారు కదా కన్నీటి గాధలు.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడుజన్మించినపుడె పుట్టదు,జనుల
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.
పుణ్యం కొద్దీ పురుషుడు, ఖర్మము కొద్దీ పిల్లలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము ను బట్టి ఫలితాలు.
ఎంత కోపం ఉన్నా తల్లి తండ్రుల మరణానికి ప్రతిక్రియ లేని పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కనీస గౌరవం ఐనా ఇవ్వాలి. మనకు సవాలక్ష సమస్యలు ఉండవచ్చు, వారి ఊపిరి పోయిన తర్వాత, నీ జన్మకు కారణమైన శరీరం పట్ల, కనీస గౌరవము పాటించుట, కనీస కర్తవ్యం.
పై ఉదాహరణ అడుగంటుతున్న మానవతా విలువలకు దర్పణం పడుతోంది. ఉమ్మడి కుటుంబాలనుంచి చిన్న కుటుంబం నుంచి, నేను వరకు దిగజారిన విలువలు.
వీటన్నింటికన్న ఆ అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడిన మాటలు, ఇంకొక్క మెట్టు దిగజారిన విలువలు చెప్పకనే చెపుతున్నాయి. మన కన్నా జంతువులు నయం అనిపించింది.
నేడు వారి ఇంట్లో, రేపు మన ఇళ్ళలో, ఆపగలమా? ఐతే, మన శనివారం సాధనలు మొదలు పెడతారా? ఇంకో మార్గము లేదు కదా?
మబ్బులో.. ఏముంది, మన మనసులో.. ఏముంది, మన మనసులో.. ఏముంది?
మబ్బులో. పైరునీరు, మన మనసులో. దైవము, మన మనసులో దైవము..
అవునా..ఉహు..ఊ..ఊ....
1. తోటలో.. ఏముంది, మన మాట లో.. ఏముంది? మన మాటలో.. ఏముంది?
తోటలో పుష్పములు, మన మాటలో వేదములు, మన మాటలో వేదములు..
ఉహు..ఊ..ఊ..ఊ..
ఊహు..ఊ..ఊ..ఊ..
2. చేనులో.. ఏముంది?. మన మేనులో. ఏముంది?. మన మేనులో.. ఏముంది?
చేనులో బంగారం.. మన మేనులో.. సాధనలు, మన మేనులో.. సాధనలు
3. ఏటిలో.. ఏముంది? మన పాటలో.. ఏముంది? మన పాటలో.. ఏముంది?
ఏటిలో గలగలలు, మన పాటలో నాదములు, మన పాటలో నాదములు
4. నేనులో.. ఏముందీ? నీవులో.. ఏముంది? నీవులో.. ఏముంది?
నేనులో ఆత్మఉంది, నీవులో ఆత్మఉంది, పరమాత్మలో మనముంది
నేనులో ఆత్మఉంది నీవులో ఆత్మఉంది
నీవులో ఆత్మఉంది నేనులో ఆత్మఉంది...
అహ..ఆ..అహ..ఆ..
అహ..ఆ..అహ..ఆ..
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2254 General Articles and views 2,553,145; 104 తత్వాలు (Tatvaalu) and views 273,142
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments