పాటతో పరమార్ధం- మానవుడే మహనీయుడు - బాలభారతము- ఎస్వీ రంగారావు, అంజలి, శ్రీదేవి, హరనాథ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,785,460; 104 తత్వాలు (Tatvaalu) and views 217,037.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Maanavude Mahaneeyudu - Bala Bharatam - SV Ranga Rao, Anjali, Sridevi, Haranath

మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే, మాననీయుడు అని నిరూపించింది, మన ఇస్రో చంద్రయాన్ 3 యాత్ర తో. దక్షిణ ధ్రువాన దిగిన సందర్భముగా, ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి.

మంచిని తలపెట్టినచో, మనిషికడ్డు లేదులే. ప్రేరణ దైవానిదైన, సాధించును నరుడే. అంతే కదా?

మరి మనము ఓ 4 రాత మాటలు, ఓ గాత్ర నైవేద్య పాట తో, అదీ మన అందరి నాన్న అమ్మమ్మ నాయనమ్మ తాతలకు నచ్చిన మెచ్చిన మాటలుతో, అలాగే మన ఆధ్యాత్మిక భావనల పేరడీతో, అభినందనలు తెలుపు దామా. అందరికన్నా మనది ప్రత్యేకముగా ఉండాలి కదా, చిత్తశుద్ది వాక్సుద్ది తో.

చందమామ రావె జాబిల్లి రావె అనే అమ్మ జోలపాటలను, నేడు నిజం చేశారు. ఆకాశంలో కనిపించే ఆ చంద్రుడ్ని అందుకుంటామని ఎవరూ ఊహించి ఉండరు! నేడు ఆ అసాధ్యాన్ని భారత శాస్త్రవేత్తలు, ఇస్రో సుసాధ్యం చేసింది! చంద్రయానంతో ప్రపంచంలో భారత్ కీర్తి ప్రతిష్టల్ని పెంచింది !

ఇదే వేగంతో, మనుషుల్ని కూడా చంద్రుని పైకి తీసుకెళ్లే యజ్ఞం కూడా పూర్తి చేస్తారని, దేశమంతా నమ్ముతోంది ! బలమైన నాయకత్వం - అద్భుతమైన ప్రోత్సాహకం ఫలితాలను ఇస్తుందని నేడు నిరూపితమయింది.

మనము పురాణాల్లో చదివాము, మరి ఇప్పుడైనా నమ్మాలి కదా, కళ్ళ ముందు సాక్ష్యాలు, ఇతర ఏ మత గ్రంధాలు ఇవి చెప్పలేదు మిత్రమా. మన సనాతన ధర్మం మాత్రమే, మానసిక నియంత్రణ బలముతో, ఇవన్నీ ఊహించి, చూసి, అనుభవించి చెప్పింది.

దివిజ గంగ భువి దింపిన, భగీరథుడు మానవుడే; సుస్థిర తారగ మారిన, ధ్రువుడు కూడ మానవుడే; సృష్టికి ప్రతిసృష్టి చేయు, విశ్వామిత్రుడు నరుడే; జీవకోటి సర్వములో, శ్రేష్టతముడు మానవుడే. ఇవన్నీ కాదనగలమా? ఐరావతము తేవడానికి, భీముడు ఇంద్రలోకం వెళ్ళారు మన మహాభారతములో.

గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో, గంధర్వ గోళ తతుల దాటి, చంద్రలోకమైనా, దేవేంద్రలోకమైనా, బొందితో, దైవం అండతో జయించి మరల, భువికి తిరిగి, రాగలిగే మానవుడే మహనీయుడు. ఇప్పుడు గ్రహాల మీదకు, చంద్రుని మీదకు వెళ్ళి వచ్చేది మానవుడే.

మరి 200 వారాల 108 ప్రదక్షిణలు, చేసింది మానవుడే; 130 వారాల ఉపవాసం, 41 మాస శిరోముండన, చేసింది మానవుడే; 9 ఏళ్ల సజీవ గురువు, 78 ఏళ్ల అమ్మ సేవ, చేసింది మానవుడే; జిల్లా ప్రభుత్వ ఉద్యోగం, లక్షల ఆదాయం పెన్షన్లు, వదిలింది మానవుడే; మానసిక బలం, దైవ శక్తి, ఆధ్యాత్మిక భక్తి, ఉన్న మానవుడే కదా? మరి మీరు మేము కనీసం ఇవి చేయడానికి కూడా ఈ జన్మలో పనికి రామా? మనము ప్రపంచాన్ని/ విశ్వాన్ని ఎంత జయించినా, ముందుగా మనల్ని మనము జయించాలి మిత్రమా.

మానవుడే..., మహనీయుడు..2
శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే...మాననీయుడు
మానవుడే..., మహనీయుడు

అనుపల్లవి:
మంచిని తలపెట్టినచో, మనిషికడ్డు లేదులే.
ప్రేరణ దైవానిదైన, సాధించును నరుడే..
మానవుడే..., మహనీయుడు..2

చరణం : 1
దివిజ గంగ భువి దింపిన, భగీరథుడు మానవుడే..
సుస్థిర తారగ మారిన, ధ్రువుడు కూడ మానవుడే..
సృష్టికి ప్రతిసృష్టి చేయు, విశ్వామిత్రుడు నరుడే..
జీవకోటి సర్వములో, శ్రేష్టతముడు మానవుడే..
మానవుడే..., మహనీయుడు..2

చరణం : 2
గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి 2
గగనాంతర రోదసిలో..., గంధర్వ గోళ తతుల దాటి..,
చంద్రలోకమైనా, దేవేంద్రలోకమైనా.. 2
బొందితో, జయించి మరల, భువికి తిరిగి, రాగలిగే.. ||మానవుడే ||

చరణం 3
200 వారాల 108 ప్రదక్షిణలు, చేసింది మానవుడే..
130 వారాల ఉపవాసం, 41 మాస శిరోముండన, మానవుడే
9 ఏళ్ల సజీవ గురువు, 78 ఏళ్ల అమ్మ సేవ, చేసింది మానవుడే,
జిల్లా ప్రభుత్వ ఉద్యోగం, లక్షల ఆదాయం పెన్షన్లు, వదిలింది మానవుడే
మానసిక బలం, దైవ శక్తి, ఆధ్యాత్మిక భక్తి, మానవుడే ||మానవుడే ||  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,785,460; 104 తత్వాలు (Tatvaalu) and views 217,037
Dt : 28-Aug-2023, Upd Dt : 28-Aug-2023, Category : Songs
Views : 193 ( + More Social Media views ), Id : 1895 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Maanavude , Mahaneeyudu , Bala , Bharatam , SV , Ranga , Rao , Anjali , Sridevi , Haranath , Bharathamu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content