మగమహారాజు - నీ దారి పూల దారి, పోవోయి బాట సారి - చిరంజీవి, సుహాసిని - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,497; 104 తత్వాలు (Tatvaalu) and views 225,073.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఏదైనా నీతి నియమం సంస్కారం కట్టుబాటు ఉన్నది అని, ఎలా తెలుస్తుంది. వారు నమ్మిన సిద్దాంతం ఎప్పుడూ విడవకుండా, మంచి దారిలో నడవడమే, అదీ పది మంది పెద్దలు మెచ్చేట్లుగా. అది పందెమైనా, జీవితమైనా ఏదైనా, ధైర్యముగా అందరిముందూ చెప్పాలి చెయ్యాలి. కపటం నాటకం 2 నాల్కలు ఉండకూడదు.

జీవితము మనకు అనుకూలముగా మార్చుకుని అనారోగ్యముగ, బద్దకముగా, అవినీతిగా బతకగూడదు. కష్టమైనా, సాధారణ జీవితమైనా, నీతి నియమముతో బతకాలి. 20 శాతం ఇలా చేస్తున్నారు, మనశ్శాంతి గా ఉన్నారు, ప్రాపంచిక మోహాలలో పడకుండా.

ఓ మంచి వ్యక్తి తమ అత్యంత అవసరాలకు పోటీలో నిలబడి, కష్టమైన ప్రయత్నము చేస్తుంటే, మిత్రులు బంధువులు ప్రజలు ఎలా ఆదరించారో ఉత్సాహపరిచారో చూడండి.

మరి మనమూ మంచి పనులను మెచ్చుకోవాలి, ఆదరించాలి, పది మందికి చెప్పాలి. బద్దకముతో గమ్ముగా ఉంటే, మన పిల్లలకు ఆ మంచి దొరకదు, చెప్పే వారు ఉండరు, వీరు వినరు. ఎందుకంటే, మన పెంపకమే, మనకు బుద్ది చెప్పాలి కాబట్టి.

నీ దారి పూల దారి, పోవోయి బాట సారి
నీ ఆశలే ఫలించగా, ధ్వనించు విజయ భేరి 2

ఆశయాలు గురిగా..,సాహసాలు సిరిగా
సాగాలి జైత్ర రథం, వడి వడిగా..
మలుపులేన్ని ఉన్నా, గెలుపు నీదిరన్నా
సాధించు మనోరథం, మనిషిగా ..
నరుడివై, హరుడివై, నారాయణుడే నీవై..
నీ బాసలే ఫలించగా, వరించు విజయ లక్ష్మి 2 ||నీ దారి పూల దారి ||

అయ్యప్పా.., స్వామియే. శరణం అయ్యప్పా..2

కాళరాత్రి ముగిసే.., కాంతి రేఖ మెరిసే.
నీ మండిన గుండెల, నిట్టుర్పులలో..
చల్ల గాలి విసిరే.., తల్లి చేయి తగిలే.
నీకోసం విండిన, ఒదార్పులతో
విజయమో..,విలయమో..,విధివిలాసమేదైనా
నీ రక్తమే జ్వలించగా, జయించు ఆత్మ శక్తి ||నీ దారి పూల దారి ||

అయ్యప్పా.., స్వామియే. శరణం అయ్యప్పా..2

దిక్కులన్ని కలిసే..దైవమొకటి కలిసే..
నీ రక్తం అభిషేకం, చేస్తుంటే
మతములన్ని కరిగే..,మమత దివ్వె వెలిగే
నీ ప్రాణం నైవేద్యం, పెడుతుంటే ..
ధీరుడివై, వీరుడివై, విక్రమార్కుడివే నీవై
నీ లక్ష్యమే సిద్దించగా, దీవించు దైవ శక్తి 2||నీ దారి పూల దారి ||

నీ దారి పూల దారి .. పోవోయి బాట సారి...
నీ ఆశలే ఫలించగా ... ధ్వనించు విజయ భేరి..

Maga Maharaju, Nee Dari pula dari, Chiranjeevi, Suhasini  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,497; 104 తత్వాలు (Tatvaalu) and views 225,073
Dt : 17-Feb-2023, Upd Dt : 17-Feb-2023, Category : Songs
Views : 481 ( + More Social Media views ), Id : 1706 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : maga , maharaju , nee dari pula dari , chiranjeevi , suhasini
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content