పాటతో పరమార్ధం - మాయమై పోతున్నాడమ్మా (అసలు, పేరడీ) - ఎర్ర సముద్రం - నారాయణ మూర్తి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,416; 104 తత్వాలు (Tatvaalu) and views 226,429.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Mayamai Pothunnadammaa (Original, Parody) - Erra Samudram - Narayana Murthy

ఇలాంటి ఉత్తమ సినిమాలు, పాటలు తీసే ఉత్తములు దమ్ము ధైర్యం మానవత్వం, తల్లి దండ్రుల సంస్కార పెంపకం ఉన్న, ఒకే ఒక్క మొనగాడు, తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, నిస్వార్ధపరుడు, అరిషడ్వర్గం అష్టవ్యసనం జయించిన వారు, శ్రీ నారాయణ మూర్తి గారే.

నేటి పతనమైపోయిన మనవ్త్వం గురించి, చాలా బాగా రాశారు. చిత్రం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరు ఇది ఇతరుల గురించి మాత్రమే అనుకుంటారు. తమను తాము మాత్రం మార్చుకోరు. ఆవును చచినా గెలిపించరు. తమ గొయ్యి తాము తీసుకున్నట్లే, నక్క పాము పులి ని గెలిపించి, తమ కు తామే పతన బాట పడతారు. మరలా ఏంటోనండి, పాపం విపరీతంగా పెరిగి పోతుంది, మా ఇంట్లో తప్ప అంటారు, అమాయకముగా, ఆత్మ ద్రోహముతో.

మాయమై పోతున్నరమ్మా, మనిషన్న వారు, మచ్చుకైనా లేరు చూడు, మానవత్వం ఉన్నవారు, ముదుసలి కన్న తల్లి దండ్రులను, వర దానం చేసిన అత్తమామలను దేవతలు గా ఇంట్లో పెట్టి పూజించుకునే వారు, సంస్కార పెంపక పిల్లల దగ్గర తమ జీవితాంతం వరకు ఉంటాము అనేవారు, నూటికో, కోటికో, ఒక్కరే ఒక్కరు, యాడ ఉన్నారో కాని, కంటికి కనరారు. నిజమేనా?

అవినీతి పెనుఆశ, అంధకారము లోన, చిక్కిపోయి, రోజూ, శిధిలమౌతున్నారు? కుక్క నక్కల, దైవ రూపాలుగ గొలిచి, పంది నందిని జూస్తె, పడి మొక్కుతుంటారు? అబ్బా ఎంత నటనా కపటం? సీమలకు చెక్కర, పాములకు పాలోసి, జీవకారున్యమే, జీవితము అంటారు పైకి. తోడ బుట్టిన ఇతర మనుషులను, ఊరౌతలకి నెట్టి, కుల వర్గ అంతస్తు ధనం పదవి అంటూ, కలహాల గిరిగీసి, ఆనందం పొందుతుంటారు.

పావలా అగరోత్తులు గాల్చి, కోట్ల, వరములడుగుతారు. దైవాల పేరుతో, చందాలకై దంద చేస్తూ, భక్తి ముసుగు తొడిగి, భలే ఫోజు పెడుతారు. ముక్తి పేర నరులు, రక్తి లో రాజయ్యి, రాకాసి రూపాన, రంజిల్లుతున్నారు.

రూపాయి కొరకు, ఏరూ పాపాన్ని ఐతె యేమి, ఒడిగట్టె అదుగొ చూడమ్మా, మన చుట్టూ నిరంతరమూ తగలబడుతున్న పాపాలను. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి, కోట్లకు పడగెత్త కోరికలు చెలరెగి, మాయమై పోతున్నడమ్మా, మనిషన్న వారు.

ఇప్పుడు పేరడీ పాట కూడా చూద్దాము, ఎవరు రాసారో తెలీదు. నెట్ లో దొరికింది, బాగానే ఉన్నది, మన పతనపు ఆలోచనలకు సరిపోయేటట్లు.

మాయమై పోతున్నాడమ్మా, జబ్బంటులేనోడు. మచ్చుకైనా లేడు చూడు, రోగమంటూ లేనివాడు. వావి వరసలు మార్చి, బంధాలు బలి చేసి, మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.
మతిలేక గతిలేక మంచిని చంపేసి, నిలువెల్లా నీచుడౌతున్నాడు. చెడు తిరుగుళ్లకు చేరువై వాడు, పాపాల కొలిమిలో కాలిపోతున్నాడు. మరి ఆ పాట కూడా విడిగా వినడి మరి.

Original - అసలు

మాయమై పోతున్నడమ్మా.., మనిషన్న వాడు..
మచ్చుకైనా లే.డు చూ.డు.., మానవత్వం ఉన్నవా.డు..
నూటికో, కోటికో, ఒక్కడే ఒక్కడు ..2
యాడ ఉన్నాడో కా.ని, కంటికి కనరా.డు ||మాయమై ||

1.నిలువెత్తు స్వార్ధము, నీడలా వస్తుంటే.
చెడిపోక ఏమైతడమ్మా.., చెడిపోక ఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాలు
దిగజారుతున్నడోయమ్మా..దిగజారుతున్నడోయమ్మా
అవినీతి పెనుఆశ, అంధకారము లోన 2
చిక్కిపోయి, రోజు, శిధిలమౌతున్నాడు ||మాయమై ||

2.ఇనుప రెక్కల డేగ, విసిరినా పంజాకు
కోడి పిల్లై చిక్కి, కొట్టుకుంటున్నారు 2
వుట్టికి స్వర్గాని, కందకుండగ తుదకు
అస్తిపంజరమై అగుపించనున్నారు 2
కదిలే విశ్వము, తన కనుసన్నలో, నడువ 2
కనుబొమ్మ లెగిరేసి, కాలగమనములోన ||మాయమై ||

3.కుక్క నక్కల, దైవ రూపాలుగ, గొలిచి
పంది నందిని జూస్తె, పడి మొక్కుతుంటాడు 2
సీమలకు చెక్కర, పాములకు పాలోసి
జీవకారున్యమే, జీవితము అంటాడు 2
తోడ బుట్టిన వాళ్ళ, ఊరౌతలకి నెట్టి
కుల మంటు ఇలమీద, కలహాల గిరిగీసి ||మాయమై ||

4.ఇరువై అయిదు పైసల, అగరోత్తులు గాల్చి
అరవై ఐదు కోట్ల, వరములడుగుతాడు 2
దైవాల పేరుతో, చందాలకై దంద
భక్తి ముసుగు తొడిగి, భలే ఫోజు పెడుతాడు 2
ముక్తి పేర నరుడు, రక్తి లో రాజయ్యి 2
రాకాసి రూపాన, రంజిల్లుతున్నాడు ||మాయమై ||

5. అవసరాలకు మనిషి స్రుష్టించి రూపాయి
చుట్టు తిరుగుతున్నడమ్మా, 2
రుపాయి కొరకు ఏ పాపాన్ని ఐతె యేమి
ఒడిగట్టె అదుగొ చూడమ్మా 2
కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
కోట్లకు పడగెత్త కోరికలు చెలరెగి ||మాయమై ||

Parody - పేరడీ

Mayamai pothunnadamma Jabbantulenodu

మాయమై పోతున్నాడమ్మా జబ్బంటులేనోడు
మచ్చుకైనా లేడు చూడు రోగమంటూ లేనివాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడవున్నాడోకానీ కంటికి కానరాడు ||మాయమై||

1 సుఖమంటే ఏమిటో స్పష్టంగా తెలియక
తికమక పడుతున్నాడమ్మా
సౌఖ్యాల మోజులో సరదాల బూజులో
నుజ్జు నుజ్జు అవుతున్నాడమ్మా
సుఖమంటూ మోజంటు తెలియని రోగాల
చేరువై వాడు చెదిరిపోతున్నాడు ||మాయమై||

2 ఇల్లేమో పెద్దదై మనసేమో చిన్నదై
మానసిక రుగ్మతల మాడిపోతున్నాడు
మనిషికి మనసుకు దూరమై వాడు
మనిషన్నమాటే మరచిపోతున్నారు
సాటిమనిషితో పనిలేదని నేడు
చావుకు దగ్గరై సాగిపోతున్నాడు ||మాయమై||

3 డబ్బుంటే చాలని ఏ జబ్బైతే ఏమని
గబ్బు గబ్బుగా మారిపోతున్నాడు
సరికొత్త భోగాల వింతైన రోగాల
ఒళ్ళంతా పుండ్లతో ఇల్లంతా మందులై
సౌఖ్యాల వేటలో రోగాల తోటలో
ఆసుపత్రులలో విహరిస్తూ వున్నాడు ||మాయమై||

4 ప్రకృతిని శాసించ వికృత చేష్టలు
వికటించనదిగో చూడమ్మా
సంస్కృతులు మార్చేసి
సరిక్రొత్త ఆకృతులు సృష్టించేనదిగో చూడమ్మా
సహజ సంపదలు కొల్లగొట్టినవాడు
ప్రళయాల ఉచ్చులో కొట్టుకొని పోతున్నాడు ||మాయమై||

5 వావి వరసలు మార్చి బంధాలు బలి చేసి
మానవత్వాన్ని మరిచిపోతున్నాడు
మతిలేక గతిలేక మంచిని చంపేసి
నిలువెల్లా నీచుడౌతున్నాడు
చెడు తిరుగుళ్లకు చేరువై వాడు
పాపాల కొలిమిలో కాలిపోతున్నాడు ||మాయమై||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,416; 104 తత్వాలు (Tatvaalu) and views 226,429
Dt : 12-Jun-2023, Upd Dt : 12-Jun-2023, Category : Songs
Views : 554 ( + More Social Media views ), Id : 1790 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Mayamai , Pothunnadammaa , Original , Parody , Erra , Samudram , Narayana , Murthy , vandemataram , Srinivas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content