మీనా - శ్రీరామ నామాలు శతకోటి, పెళ్ళంటే నూరేళ్ల పంట కోరుకున్న వారి - కృష్ణ, విజయ నిర్మల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,409; 104 తత్వాలు (Tatvaalu) and views 225,065.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చిన్నప్పుడు ఈ పాట ఎప్పుడూ రేడియోలో వస్తూ ఉండేది - శ్రీరామ నామాలు శతకోటి. అందులో రామయ్య సుగుణాలను రామయణ గాధను తెలిక పదాలతో వీనుల విందు గా చెప్పారు. మనసుకు ఎంతో ఆహ్లాదం ఆనందం ఆ పాట వుంటుంటే, కానీ పాడితేనే మనకు నిజమైన మనశ్శాంతి. ఎప్పటికీ మరువద్దు, ఎదురు గా చూస్తుంటేనే, ఎవరో తింటుంటేనో, మన కడుపు నిండదు. అలాగే భక్తి ముక్తి కూడా, మన సాధన లేనిదే, మన మనసు ఇంచె కూడా లొంగదు, మన మాట వినదు సుమా.

పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్న పాట, మనసున్న హ్రుదయాలను కదిలిస్తుంది. ఈ పాట వినగానే, ఇది పెళ్ళి విషాద గీతం అనుకుంటారు, కానీ మన అందరికీ కావల్సిన జీవిత సత్యాలు, అంటే, మనము 3 ఏళ్ళు పైన చెప్పుకుంటున్న మాటలనే, ఇందులో పలికించారు. చూడండి అవి.

ప్రేమ పెళ్ళి అనేది, ఒక బాధ్యత గల, త్యాగం తెలిసిన, మనుషుల మధ్య మాత్రమే వినాలి ఉండాలి. కానీ దురద్రుష్టవ శాత్తు, అది ఇప్పుడు ఓ కామిక అవసరాల మూట బాట అయి కూర్చుంది. ఎందుకంటే, ముందు పెద్దలకే త్యాగం బాధ్యత అంటే తెలీదు, ఇంక 25 ఏళ్ళు లోపు పిల్లలకు అవగాహన ఉంటుందా, తెలుస్తుందా?

వీరికి కనీసం ఇంట్లో చిమ్మడం రాదు, అంట్లు కడగడం రాదు, బట్టలు ఉతకడం తెలీదు, వంట వండటం రాదు, ఏ పని లో సహాయం చేయడం తెలీదు, 4 గురితో మాట్లాడటం రాదు, అమ్మమ్మ తాత కు సేవలు చేయడం రాదు, నోటికి ఓ పాట పద్యం శ్లోకం రాదు, మంచి మాట రాదు, పూల దండ కట్ట లేరు, అయినా, మేమెందుకు ప్రేమించ కూడదు, మాకు ఏమి తెలీదని అని అహంకారము తో మొదలు పెడతారు, వారి అమ్మా నాన్న బాద్యత లేని పెంపకం తో?

ఈ పాటలో వచ్చిన ప్రశ్నలు అర్ధాలు చూడండి, ఆలోచన చెయ్యండి.

1. మనిషి విలువ పెరిగేదీ దేవుని ముందు సాత్వికుల ముందు మంచి వారి ముందు, ధనం పదవి హోదా తో కాదు. అంతేనా?
2. మంచి చెడు తెలిసి కూడా చెప్పలేని వారు, ఎవ్వరికీ పనికి రారు, ఏమీ చేయలేరూ? నిజమే కదా? బండ కు, బల్ల కు, వీరికి తేడా ఏముంది? దేవుని ముందు తల ఎలా ఎత్తుకుని ఉంటారు?
3. అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ, అలమటించుతారు - మాయ లో నుంచి బయటకు రావాలి కదా?
4. కలిమి కాదు మగువకు కావలసిందీ? మగ లేదా ఆడ అయినా కావలసింది స్థిరమైన గుణం బాధ్యత మాత్రమే, లేదంటే ఓ 2 ఏళ్ళలో, వాస్తవాలు బయటపడి, విడాకులే కదా లేదంటే రావణ కాష్టం లా, ఇద్దరి వైపూ ఒళ్ళు ఇల్లు, మండుతూ ఉంటుంది, ఎవరికీ మనశ్శాంతి లేకుండా, ప్రేమ వివాహం లో కూడా? పిల్లలకు ముందే తేలితే పర్లేదు, కానీ పిల్లల తర్వాత కూడా, విడిపోతాము అంటే, ఇంక వారిలో నీతి నిజాయితీ విలువ మనసు ఏముంది? పాత చొక్కా విప్పి, కొత్త చొక్కా తొడగడమేనా?

మరి ఇక పాటల భావం అర్ధం చేసుకుని, మీరు పాడి, మీ మనసుకు ఆనందాన్ని కలిగించండి.

1) శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి, బహు తీపి
శ్రీరామ నామాలు శతకోటి

1) తండ్రి ఆ..నతి, తలదా..ల్చు తనయుడు
దశరథ రా.మయ్య, స్తవనీ.యుడూ.. 2 లైన్లు 2 సార్లు
కడుమే.టి విలువిరిచి, కలికిని చే.పట్టు
కల్యా.ణ రా.మయ్య కమనీ.యుడూ.. కమనీ.యుడూ..||శ్రీరామ నామాలు||

2) సుదతి, జానకి తో.డ, శుభ సరసమాడే.టి
సుందర రామయ్య, సుకుమారుడూ..2 లైన్లు 2 సార్లు
కో..తి మూకలతో.., ఆ ఆ , లంకపై దండెత్తు,
కోదండ రామయ్య, రణధీరుడూ.. రణధీరుడూ.. ||శ్రీరామ నామాలు||

3) పవమా.న సుతుడు, పా.దాలు పట్టగ
పట్టాభి రా.మయ్య, పరంధా.ముడూ ..2 లైన్లు 2 సార్లు
అవనిలో. సే.వించు, ఆశ్రితుల పా.లించు,
అచ్యుత రామయ్య, అఖిలాత్ముడూ.. అఖిలాత్ముడూ.. ||శ్రీరామ నామాలు||

Music: Ramesh Naidu, singer : పి. సుశీల, Sri Rama Namalu Song

2) పల్లవి: పెళ్ళంటే... నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలను తెంచుకొని.. బాధ్యతలను పెంచుకొని..
అడుగు ముందుకేశావమ్మా.. గడప దాటి కదిలావమ్మా
పెళ్ళంటే... నూరేళ్ల పంటా...

చరణం: 1 మనిషి విలువ పెరిగేదీ.. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయా.నికి.. పేదతనం లేదు 2 లైన్లు 2 సార్లు

మనసులోని మమతలను,.. తెలుసుకోరు పెద్దలు 2
అందుకే.., తిరుగుబాటు చేసేరు పిల్లలూ.. ||పెళ్ళంటే||

చరణం: 2 మంచి చెడు.. తెలిసి కూడా చెప్పలే.ని వా.రు
ఎవ్వరికీ.. పనికి.రారు, ఏమీ చేయలేరూ 2 లైన్లు 2 సార్లు

అన్నెం పున్నెం, ఎరుగని, అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ, అలమటించుతా.రు 2 లైన్లు 2 సార్లు ||పెళ్ళంటే||

చరణం: 3 మనసు ఒకరిపైనా.. మనువు ఒకరితోనా...2
ఎలా కుదురుతుందీ.. ఇది ఎలా జరుగుతుందీ..

కలిమి కాదు మగువకు కావలసిందీ... 2
మనసిచ్చిన వానితో.., మనువు కోరుకుందీ 2.. మనువు కోరుకుంది..||పెళ్ళంటే||
అడుగు ముందుకేశావమ్మా 2 పెళ్ళంటే

Meena Movie - Krishna, Vijaya Nirmala
Meena - srirama namalu satakoti, pellante nurella panta krishna vijaya nirmala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,409; 104 తత్వాలు (Tatvaalu) and views 225,065
Dt : 02-Jun-2022, Upd Dt : 02-Jun-2022, Category : Songs
Views : 945 ( + More Social Media views ), Id : 1412 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : meena , srirama , namalu , satakoti , pellante , nurella , panta , krishna , vijaya , nirmala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content