రాష్ట్రం రాజధాని నుంచి జిల్లా కలెక్టర్లు తో, ఆరోగ్య శాఖ అధికారులు తో మీటింగ్ - కోవిడ్ కబుర్లు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,383,076; 104 తత్వాలు (Tatvaalu) and views 257,869.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాష్ట్రం రాజధాని నుంచి జిల్లా కలెక్టర్లు తో, ఆరోగ్య శాఖ అధికారులు తో మీటింగ్ జరుగుతుంది. అందరూ సీరియస్ గా తమ అంకెలు, తమ బొమ్మలు, తమ వాదనలు తో సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడులాగనే.

ఉత్తర రాష్ట్ర ప్రాంతం నుంచి, ఓ కలెక్టర్ ని అడిగారు వైద్య ఆరోగ్య మంత్రి గారు, మన దగ్గర పరిస్థితి ఎలా ఉంది. కోవిడ్ అదుపులో ఉందా? ఆసుపత్రిలో వైద్యం బాగా అందుతుందా? సంజీవిని వాహనాలు తిరుగుతూ ఉన్నాయా? కోవిడ్ రోగులకు భోజన మరియు ఇతర సదుపాయాలు ఎలా ఉన్నాయి? డాక్టర్లు, బెడ్ లు, వెంటిలేటర్ లు తగినన్ని ఉన్నారా, ఉన్నాయా? సమయానికి, ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? అంబులెన్స్ ల పరిస్తితి ఏమిటి? పరీక్ష రిజల్ట్ వెంటనే చెపుతున్నారా?

అధికారులు జవాబు ఎప్పటిలాగనే, అన్నీ బాగున్నాయి అండి. అన్ని మేము, రాష్ట్ర వెబ్సైట్ లో వారితో అప్డేట్ చేస్తున్నాము. అంకెలు, చిత్రములు, ఆరోగ్య వెబ్సైట్ వారు సోషల్ మీడియాలో పెడుతున్నారు, అందమైన చిత్రములతో.

మరి మీ జిల్లా సోషల్ మీడియాలో పెట్టడం లేదా? పట్టణ గ్రామ అధికారులు, స్ధానిక సౌకర్యాలు గురించి, సోషల్ మీడియా లో ప్రజలకు వివరించడం లేదా?

లేదండీ, జనానికి లేని అవసరం, మనకెందుకు అండి. సినెమా స్టార్ వి, ఇతర పిచ్చి వార్తలు చూస్తారు గానీ, ఊరి అభివ్రుద్ది గురించి వారు చూడరు.

మరి జనానికి, నమ్మకం ఎలా మన మీద? అందరూ రాష్ట్ర వెబ్సైట్ లో చూస్తారా? లోకల్ గా అధికారులు మాట కదా, జనం ఫోటో సాక్ష్యం తో నమ్మేది. సరే ఇంత బాగుంటే మన మెట్రో పాలిటన్ సిటీలో, మరి మన ఎంపీ గారు, కరోనా పాజిటివ్ వస్తే, హైదరాబాద్ ఎందుకు పరుగులు తీసారు? మన మీద నమ్మకం లేకనేగా? లేకపోతే ఆయన మన పట్టణ లేదా జిల్లా వైద్య శాలలో వైద్యం చేయించుకుంటూ, అక్కడ తిండి తింటూ, రోజూ ఫోటోలు పెడుతున్న, క్వారంటైన్ సమయంలో, మనకు పబ్లిసిటీ తో పాటుగా, ప్రజలకు విశ్వాసం నమ్మకం ఉండేది. మన ప్రభుత్వ అధికారుల మాటలు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా నమ్మడం లేదు.

మీరేమో అన్ని బాగున్నాయి అంటారు. జనమేమో ఆసుపత్రి లో బెడ్ దొరకక, జిల్లా మొత్తం ఆసుపత్రులు తిరిగి తిరిగి విసుగుపుట్టి, గుంటూరు, విజయవాడ ల చుట్టూ తిరిగి, లబోదిబోమంటున్నారు, కొందరు దోవలోనే ప్రాణాలు పోతున్నాయి. ఓపిక డబ్బు పలుకుబడి ఉన్న వారు, ఛలో హైదరాబాద్ అంటున్నారు.

సరే కోస్తా అధికారులు, మీ జిల్లా వైద్య పరిస్థితి చెప్పండి.

ఇక్కడ కూడా అంతా అద్భుతమైన వైద్యం అందుతుంది, మంత్రి గారిని ప్రభుత్వం ని, ప్రజలు మరీ పొగుడుతున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకో 20 ఏళ్ళు, మన ప్రభుత్వమే అంటున్నారు.

ఏమయ్యా, మాటలు కోటలు దాటుతున్నాయి. సంవత్సరం గా, మీరు జిల్లా పట్టణ గ్రామ సోషల్ మీడియా లో అప్డేట్స్ లేవు, కింద స్ధాయిలో ఇక అనుకోవడం అనవసరం. మీ జిల్లా మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్నారు, ఆసుపత్రిలో ఇప్పుడు. మీరు మారరా, వాస్తవం చెప్పరా, తప్పులు సరిచేసుకోరా? పాత ప్రభుత్వం లాగనే మమ్మల్ని, ప్రజలతో ఛీ కొట్టిస్తారా?

ముఖ్యమంత్రి గారేమో, మిమ్మల్ని నమ్మాను అంటారు. బెడ్ లు దొరకడం లేదు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటే తప్ప, మీరు వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రతిదీ సీఎమ్ చెపితే, ఇక మీరంతా ఎందుకు? అని తల పట్టుకున్నారు. ఏ ప్రభుత్వం మారినా , ఈ ఉత్తుత్తి మీటింగ్ ల గాలిలో లెక్కలు, త్రిశంకు స్వర్గం సౌకర్యాల భ్రమలు మారవు.

ఎందుకంటే, ప్రజలు బాధ్యత గా మంచివారిని ఎన్నుకోరు కాబట్టే. కుల మత వర్గ అవసరం కు, మాత్రమే ఓటు వేస్తారు కాబట్టి. జనం ఓటు బాధ్యత మారనిదే, జనం తలరాత మారదు. కొత్త కొత్త నాయకులు రావాలి, కొత్త నీరు పారాలి. కుటుంబ రాజకీయాలు తగ్గాలి. నా తర్వాత నా కొడుకే నాయకుడు, అనే సంస్కృతి విడనాడాలి. ప్రజల ఆలోచన మారాలి, అని గట్టిగా అరిచాడు, నారాయణ నిద్ర లో ఆవేశము తట్టుకోలేక.

వాళ్ళ అమ్మ, మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఇలాంటి ఉపయోగము లేని కలలు కనకురా బాబు, బీపీ వస్తుంది. మనము మారము, మన స్వార్థం మారదు, మన రాత గీత మారదు. నాయకులు ది అధికారులు ది తప్పు కాదు, ప్రజలదే తప్పు. విలువైన ఓటు ను, చిల్లర అవసరాలకు మోహములో తగలేస్తున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,383,076; 104 తత్వాలు (Tatvaalu) and views 257,869
Dt : 05-Aug-2020, Upd Dt : 05-Aug-2020, Category : General
Views : 931 ( + More Social Media views ), Id : 629 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Meeting , District Collectors , Health Department , officials , state capital , corona , kaburlu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content