మోదీ మొనగాడు రా బుజ్జీ 2 - దేశానికి వల్లభాయ్ పటేల్ తర్వాత మరో మొనగాడు - కశ్మీర్ రక్షణ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,052; 104 తత్వాలు (Tatvaalu) and views 224,452.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గతం లో ఏ జాతీయ నాయకుల కు అయినా అంత దమ్ము ధైర్యం ఉంటే, మోదీ కి ఈ అవకాశం వచ్చే ది కాదేమో బహుశా.

దేశానికి వల్లభాయ్ పటేల్(నిజాం పాలన ముగింపు, హైదరాబాద్ స్వాధీనం) తర్వాత, మరో గుజరాత్ మొనగాడు, మన మోదీ నే. ఒకరకంగా చెప్పాలి అంటే, మోదీ అమిత్ షా ద్వయం. మోదీ గుట్టుగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. అమిత్ షా దూకుడు మరియు తగ్గ జవాబులు ఇస్తారు. వారికి తోడు గా వ్యూహాల దిట్ట, రక్షణ సలహాదారు అజిత్ ధోవల్. ఈ నెల సమయంలో ఎన్ని విజయాలు,

1). చంద్రయాన్ 2 - కలసి వచ్చింది ఈ సమయము లోనే
2). ట్రిపుల్ తలాఖ్ - ఇరు సభల ఆమోదం, కావాల్సినంత చర్చ పార్లమెంట్ లో
3). కాశ్మీర్ రాష్ట్ర రక్షణ, విభజన, ఆర్టికల్ 370 తొలగింపు, కావాల్సినంత చర్చ పార్లమెంట్ లో

కానీ మన రాష్ట్రంలో మాత్రం, కొత్త వారి ని రానీయం , ఎదగనీయం. సదా రెండు కుటుంబాల కు లేదా 30 ఏళ్ళ నుంచి ఉన్న వారికి బానిసలం. రాష్ట్రం ఏమైనా పర్లేదు, వారి మనుమలే ఏలాలి, మన మనుమలే మోయాలి. ఉత్తమ బానిసత్వం కి జై అంటారు కొందరు.

కేసులున్నా దర్జాగా తిరిగే ఆయన ఒకరు. కేసులు లేకుండా స్టే తెచ్చిన ఆయన ఇంకొకరు. మనం నాశనం అయినా పర్లేదు, ఇంకొకరికి పని చేసే అవకాశం ఇవ్వము లేదా మార్పు ను అంగీకరించము, వీరు మాత్రమే కావాలి అనే వారు కొందరు.

ఇంతే నా మన బతుకు, ఆలోచన, మార్పు. మన కులం , మన వర్గం, మన చేతిలో పెట్టిన నోటు, మనకు చేసిన మేలు. ఇదే నా, ఇంతే నా, మన స్వార్థం అనే వారు కొందరు.

అంతే కానీ, మన బజారు, ఊరు, జిల్లా, రాష్ట్రం, మన దేశం సమస్య, మిగతా జనం బాధ , మనకు వద్దా అంటారు ఇంకొందరు. ఇపుడు ఇప్పుడే కొందరు నాయకులు, తమ అవసరాల కోసము కమలం వైపు దూకుతున్నారు.

మోదీ కి , అమిత్ షా కి ఏం పని తలాఖ్ తో , కశ్మీర్ తో, అగ్ర వర్ణ పేదలతో? హాయిగా సంపాదించుకొని పోక, మిగతా నాయకులు లాగ. మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కూడా, వారిని తప్పు పట్టారు గతంలో. ఇప్పుడు చిన్నగా చేరటానికి, ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ కి అసలు ఉన్న సంఖ్యే తక్కువ, అందులో ఎదురు తిరిగే వారు ఎక్కువయ్యారు. మోదీ ఏ, కరెక్ట్ అంటున్నారు. కాంగ్రెస్స్ మింగలేక కక్కలేక ఉంది పరిస్తితి.

మన కూతురు ని, విడాకులు ఇచ్చా వెళ్లి పో, ఖాళీ చేతులు తో ఈ క్షణం నోటి మాటతో ఫోన్ లో అంటే ఆ బాధ ఎవరికి తెలుస్తుంది. ఆ కూతురికి, ఆ తల్లిదండ్రులు కు మాత్రమే తెలుస్తుంది. భర్త కు, వారి తల్లిదండ్రులు కు తెలియదు ఎప్పటికీ, వారికి కూడా ఒక చెల్లి అలాంటి పరిస్థితి లో ఉంటే తప్ప. చాలా ముస్లిం దేశాలు ఎప్పుడో బాన్ చేసాయి ఆ పద్ధతిని అంటారు.

మరి కశ్మీర్, నిత్యం దాడులతో , అక్కడి వాళ్ళు ఎవరూ సరిగ్గా నిదురపోరు. ప్రతి నిత్యం తీవ్రవాద పోరు. ఏనాడో కాశ్మీర్ పండిట్ లు పారిపోయారు, ప్రాణ భయం తో. మనం బిగ్ బాస్ 5 చూస్తూ , బిర్యానీ తింటూ, పక్క మనిషి తో తగువులాడుతూ, మన కుల వర్గ గజ్జి లో తేలియాడుతున్నాము. లేదా ఎవరు ఎలా పోతే మనకే మన కుటుంబం బాగుంటే చాలు అని హాయిగా ఉన్నాము.

మరి మోదీ కి , అమిత్ షా కు వచ్చిన నొప్పి ఇబ్బంది ఏమిటి అంటారా? వాళ్లు బాధ్యత గలిగిన మనుషులు కాబట్టి, బాధ్యత తీసుకున్నారు, తమకు ముప్పు అని తెలిసి కూడా. మన లాగా వారు, స్వార్థ పరులు కారు. పక్క జనం గురించి మరియు దేశ క్షేమం గురించి కూడా ఆలోచన చేస్తారు. ఈరోజు అమిత్ షా ఏమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇస్తాం అన్నారు, చేతలలో చూపించారు పరిష్కారం.

ఇంకా ఎక్కువ ఇబ్బందులు రావచ్చు అక్కడ. కానీ ఇంకో మార్గం ఉంటే, సోనియా లేదా వేరే వారు చెప్పాలి. 50 ఏళ్ళుగా ఎందుకు చెయ్యలేదో చెప్పాలి, ఎవరికి భయపడ్డారో చెప్పాలి. వారికీ తెలీదు, తెలిస్తే ఇన్నేళ్ళ వాళ్ళ పాలనలో ఎప్పుడో చేసేవారు. అటు పాక్ చైనా అవకాశం కోసం కాసుకొని ఉన్నాయి. ముక్క లాక్కుందామని, లేదా నిత్యాగ్నిని రగిలిద్దాము అనో.

స్వార్థం వీడి, మన జనం మన దేశం గా ఆలోచన చెయ్యాలి, మరి చేద్దామా?
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,052; 104 తత్వాలు (Tatvaalu) and views 224,452
Dt : 06-Aug-2019, Upd Dt : 06-Aug-2019, Category : Politics
Views : 1270 ( + More Social Media views ), Id : 148 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : modi , amitsha , kashmeer , article 370 , triple talaq , chandrayaan 2 , bjp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content